30, డిసెంబర్ 2024, సోమవారం

కెరటాలు వేరనీ సాగరం వేరనీ ఆలోచనే తప్పు! - తెలుగు గజల్


 ॥తాజా గజల్॥

 నా pencil చిత్రానికి Dr. ఉమాదేవి గారి గజల్

~~~~🔹🔸🔹~~~~


కెరటాలు వేరనీ సాగరం వేరనీ ఆలోచనే తప్పు!

పోరాట మేలేని జీవితం కోసమై అన్వేషణే తప్పు!


మండువేసవిలోన నిండుగా పూయవా  తోటలో మల్లియలు!

ఆవేదనుండగా నవ్వడం కుదరదను నిర్వేదమే తప్పు! 


బురదలో బతుకుతూ  పద్మాలు వికసించి చేరవా కోవెలకు 

శాంతికై సన్యాసి కావాలనే మనిషి సంకల్పమే తప్పు!


తప్పెవరిదోగాని తలరాతలేమారె విధివైపరీత్యాలు 

గొంతెమ్మ కోరికల పిల్లలకు కన్నోళ్ళ  

ప్రోత్సాహమే తప్పు 


తనతప్పు తెలుసుకొని మారిపోయిన వాణ్ణి వెతకండి-పొగడుదాం!

చుక్కలను తప్పెట్టి ముగ్గుపిండిని తిట్టు 

ఉక్రోషమే తప్పు!


ఊపిరులు ఆగినా రాబడులకై పరుగు ఆగదని తెలుసుకో 

నిన్నటిది తెల్లారి మరిచిపోయేజనం ఉన్మాదమే  తప్పు! 


ప్రతిపొద్దు పొడుపులో హెచ్చరిక దాగుంది…. గమనించి మసలుకో 

ముసుగులో తలదూర్చి వెలుగు లేదనుకునే మూర్ఖత్వమే తప్పు! 

~~~~~~~~~~~

డా. ఉమాదేవి జంధ్యాల

కామెంట్‌లు లేవు:

కెరటాలు వేరనీ సాగరం వేరనీ ఆలోచనే తప్పు! - తెలుగు గజల్

 ॥తాజా గజల్॥  నా pencil చిత్రానికి Dr. ఉమాదేవి గారి గజల్ ~~~~🔹🔸🔹~~~~ కెరటాలు వేరనీ సాగరం వేరనీ ఆలోచనే తప్పు! పోరాట మేలేని జీవితం కోసమై అన...