28, నవంబర్ 2013, గురువారం

నేటి మన రాజకీయాలు

ఎప్పుడో యాభై ఏళ్ళక్రితం నేను చూసిన సినిమా ‘Love in Tokyo’. ఆ సినిమాలో చూసిన రోడ్లు, flyovers, మెట్రో రైళ్ళు ఇత్యాదివన్నీ మన భారతదేశం లో ఎప్పుడా అని అప్పటినుండి ఇప్పటివరకూ ఎదురుచూస్తూనే వున్నాను.
దేశం ప్రగతి పధంలో దూసుకుపోవాలంటే రోడ్లు మౌలిక సదుపాయాలూ ఎంతగానో అభివృద్ధి చెందాలని మోడీ గారంటే, కాదు కాదు అవి ప్రగతికి సోపానాలే కావని సెలవిచ్చారు మన యువరాజు గారు. దేశం అభివృద్ధికి పేదరిక నిర్మూలనవంటి అంశాలే ప్రధానంట!
మొగుడు తాగేసి వస్తాడు. పెళ్ళాం ఇక్కడ అక్కడా కూలీ నాలి చేసుకుంటూ సంపాదించిన పదో పరకా వాడి తాగుడుకే సరిపోదు. డబ్బులడిగితే మొదట ఇవ్వనంటుంది. వాడిచేత తన్నులు కూడా తింటుంది. చివరికి ఇస్తుంది. అంతేగాక వాడి వంశాభివృద్ధి కి సహకరిస్తుంది. మా గ్రామంలోనే ఇటువంటి కుటుంబాలు ఎన్నో. వీరు మన రాజకీయ నాయకులకి చాలా ఆప్తులు. ఓ క్వార్టర్ బాటిల్ మందు, ఓ బిర్యాని ప్యాకెట్టు, ఓ అయిదువందల నోట్ ఇస్తే చాలు సంతృప్తి చెంది వారికే ఓటు వేస్తారు. పేదరిక నిర్మూలన వంటి ఊకదంపుడు ప్రసంగాలు మన యువరాజు గారి నాయనమ్మగారు అధికారంలో ఉన్నప్పటినుండీ వింటూనే వున్నాం.
‘వీరికా ఓటేసేది?’ అని మధ్యతరగతి కుటుంబాలు, ఇంతో అంతో మన చదువుకున్న ప్రజానీకం ఓటే వెయ్యడంలేదు. ఈ పరిస్థితి ఇలాగ ఉన్నన్నాళ్ళూ మన దేశం ఇలాగే వుంటుంది!

కామెంట్‌లు లేవు:

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...