18, ఫిబ్రవరి 2026, బుధవారం

గతమంతా గాయమైతే - గజల్


 


గతముఅంతా గాయమైతే మనసు విరిగే పోయెనే !!

గమనమంత జ్ఞాపకాలే గుండె బరువుగ మారెనే !!


పలుకరింతలు శూన్యమైతే కలలు చెదిరిన శాపమే

ఆత్మ వికసిత భాష్యమైతే పదము పరిమళ మొలికెనే !!


మరువలేని  వేదనున్నా గతిని ఆపుట సాధ్యమౌనా

మనసునొచ్చే దుఃఖమైనా కనులు భావం పలికెనే !!


చిత్రమైనది జీవితమ్మే చితికి చేరక ఆగునా

ఆశ అదుపుకు మార్గమేది జ్ఞానమెప్పుడు కలిగెనే !!


కూలబడెనే కుదురులేకనే ఓడిపోయెను కాoక్షలే 

మౌనమేగా మార్గమైనది  చింత చెలిమిగ మారెనే !!


..... వాణి కొరటమద్ది


(నా చిత్రానికి మంచి గజల్ రచించిన శ్రీమతి వాణి గారికి ధన్యవాదాలు)

కామెంట్‌లు లేవు:

అమ్మకే అమ్మ అమ్మమ్మ

 ​ అమ్మకే అమ్మ అమ్మమ్మ (pen sketch) ఆ గుండె చప్పుడు వింటూ ఒదిగిపోతా, నీ దీవెనల నీడలో పెరిగి పెద్దవుతా. తరాలు దాటిన మన ప్రేమానుబంధం, ఈ సృష్టి...