13, జూన్ 2026, శనివారం

నీతోడుతొ జీవితాన్ని గడపనివ్వు ఇలాగే ౹౹ మదినేలే రాణివలే గెలవనివ్వు ఇలాగే ౹౹ - గజల్

Pvr Murty బాబాయ్ గారి చిత్రానికి చిన్న ప్రయత్నం...


నీతోడుతొ జీవితాన్ని గడపనివ్వు ఇలాగే ౹౹
మదినేలే రాణివలే గెలవనివ్వు ఇలాగే ౹౹

ఆలోచన అంతులేని కథలెన్నో చెప్పునులే
మనజీవితమొక కథగా మార్చనివ్వు ఇలాగే ౹౹

చేయివదలి వెళ్ళకయా చేయూతవు నీవేగా
మమకారం నీ స్పర్శన పలుకనివ్వు ఇలాగే ౹౹

అనురాగపు ఆ చూపులు దాటవేయలేనులే
నీ కన్నుల కనులుకలిపి చూడనివ్వు ఇలాగే ౹౹

బంధాలే వదలినంత బలముకోలిపోములే
మనజంటే ఆదర్శం సాగనివ్వు ఇలాగే ౹౹

మరుపురాని జ్ఞాపకాలు మధురమైన తోరణాలు
అనుభూతుల నెమరవేత చిలకనివ్వు ఇలాగే ౹౹

చెమరింతలు ఎందుకులే అలుక వీడినానులే
నీ హృదయపు నీడలోన దాగనివ్వు ఇలాగే ౹౹

... వాణి కొరటమద్ది

 

అమ్మకే అమ్మ అమ్మమ్మ

 ​ అమ్మకే అమ్మ అమ్మమ్మ (pen sketch) ఆ గుండె చప్పుడు వింటూ ఒదిగిపోతా, నీ దీవెనల నీడలో పెరిగి పెద్దవుతా. తరాలు దాటిన మన ప్రేమానుబంధం, ఈ సృష్టి...