27, మే 2014, మంగళవారం

NTR - నా పెన్శిల్ చిత్రం (బడిపంతులు)

నేడు మహానటుడు ఎన్టీఆర్ జయంతి. ఆ మహా నటునికి నివాళులు అర్పిస్తూ నేను వేసిన బడిపంతులు చిత్రంలో  పెన్శిల్ చిత్రం. (బడిపంతులు చిత్రంలో)

24, మే 2014, శనివారం

తెలుగు భావాల జిలుగులు – పొన్నాడ మూర్తి గారి బొమ్మలు : భావరాజు పద్మిని

తెలుగు భావాల జిలుగులు – పొన్నాడ మూర్తి గారి బొమ్మలు : భావరాజు పద్మిని

  ఉద్యోగ బాధ్యతల నుంచీ పదవీ విరమణ తర్వాత చాలా మంది, కొత్త జీవనశైలికి అలవాటు పడలేక, ఏమి చెయ్యాలో తోచక,       కొంత నిరాశకు గురౌతూ ఉంటారు. కాని ఆయన, అదొక అవకాశంగా భావించారు. తనకు ఇష్టమైన చిత్రకళా సాధన ప్రారంభించి,   నలుపూ తెలుపూ బొమ్మల్లో తెలుగు ...

19, మే 2014, సోమవారం

ఈమె ఎవరు ? - నా పెన్సిల్ చిత్రం.



నా పెన్సిల్ చిత్రం - ఈమె ఎవరు? 

కొన్ని పత్రికల్లో ఝాన్సి లక్ష్మీబాయి ఒరిజినల్ ఫోటో గా ప్రచురించిన చిత్రం నచ్చి నేను వేసుకున్న బొమ్మ. Hoffman అనే ఇంగ్లీష్ ఫోటోగ్రాఫర్ తీసిన అరుదయిన ఫోటోగా చెప్పబడుతోంది. ఇది నిజమో కాదో తెలియదు. ఎవరో సినిమా తార అని కొందరి అభిప్రాయం.  ఏది ఏమైనా ఈ ఫోటో నాకు నచ్చి నేను చిత్రీకరించుకున్నాను.

13, మే 2014, మంగళవారం

ఆంధ్రుడు - ఆవకాయ - కార్టూన్


“ఆవకాయ పెట్టేసారా?”
“లేదండీ .. ఆ ప్రయత్నంలోనే వున్నాం”
“ఏ కాయ పెడతారూ .. పర్యానా, బారామాసీనా” 
“తీపి ఆవకాయ అయితే కలక్టరు, పచ్చి (పుల్ల) ఆవకాయ అయితే , పర్యా కాయలు బాగుంటాయి”
“మరి కారంకి? బందరు మిరపకాయలా..”
“అవును బందరు కారం అయితే రంగుకి రంగు రుచికి రుచీ ... అమోఘంగా వుంటుంది.”
“అన్నీ ఖరీదుగా వున్నాయి .. ఆవకాయ లేనిదే ముద్దదిగదు మరి..”

ఈ తరహా సంభాషణలు ఈ మధ్య కరువవుతున్నాయి. అన్ని రకాల ఊరగాయలు, పచ్చళ్ళు బజార్లో దొరికేస్తున్నాయి కదా..! అయినా ఇంటి ఆవకాయకున్న రుచి వాటికి ఉంటుందా..?
ఏది ఏమైనా అమెరికా వెళ్ళినా అంటార్టికా వెళ్ళినా ఆవకాయ కోసం అర్రులుజాచని ఆంధ్రుడు ఉండడంటే అతిశయోక్తి కాదేమో!! ఆవకాయ మనది .. ఇది పూర్తిగా ఆంధ్రుల ఆవిష్కరణ !!


(శ్రీమతి పొన్నాడ లక్ష్మి గారికి కృతజ్ఞలతో)

11, మే 2014, ఆదివారం

అమ్మ - నా పెన్సిల్ చిత్రం.


అమ్మ ఎప్పటికీ అమ్మే! మరి ప్రత్యేకంగా అమ్మ దినోత్సవం  ఎందుకు? ఈ భావనకి నేను వ్యతిరేకం. అమ్మ బొమ్మలు నా పెన్సిల్ తో చాలానే వేసాను. అందులో ఇది ఒకటి.

4, మే 2014, ఆదివారం

కొత్త కుండలో నీరు తీయన - నా పెన్సిల్ chitram


ఆనాటి ఇల్లరికం సినిమాలో 'చేతులు కలసిన చప్పట్లు' పాటలో ఓ చరణం ఇది. నా పెన్సిల్ గీతల్లో ఇలా రూపుదిద్దుకుంది.

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...