13, మే 2014, మంగళవారం

ఆంధ్రుడు - ఆవకాయ - కార్టూన్


“ఆవకాయ పెట్టేసారా?”
“లేదండీ .. ఆ ప్రయత్నంలోనే వున్నాం”
“ఏ కాయ పెడతారూ .. పర్యానా, బారామాసీనా” 
“తీపి ఆవకాయ అయితే కలక్టరు, పచ్చి (పుల్ల) ఆవకాయ అయితే , పర్యా కాయలు బాగుంటాయి”
“మరి కారంకి? బందరు మిరపకాయలా..”
“అవును బందరు కారం అయితే రంగుకి రంగు రుచికి రుచీ ... అమోఘంగా వుంటుంది.”
“అన్నీ ఖరీదుగా వున్నాయి .. ఆవకాయ లేనిదే ముద్దదిగదు మరి..”

ఈ తరహా సంభాషణలు ఈ మధ్య కరువవుతున్నాయి. అన్ని రకాల ఊరగాయలు, పచ్చళ్ళు బజార్లో దొరికేస్తున్నాయి కదా..! అయినా ఇంటి ఆవకాయకున్న రుచి వాటికి ఉంటుందా..?
ఏది ఏమైనా అమెరికా వెళ్ళినా అంటార్టికా వెళ్ళినా ఆవకాయ కోసం అర్రులుజాచని ఆంధ్రుడు ఉండడంటే అతిశయోక్తి కాదేమో!! ఆవకాయ మనది .. ఇది పూర్తిగా ఆంధ్రుల ఆవిష్కరణ !!


(శ్రీమతి పొన్నాడ లక్ష్మి గారికి కృతజ్ఞలతో)

కామెంట్‌లు లేవు:

రాగ మాలిక - కథ

 మీ చిత్రం - నా కథ. రాగమాలిక రచన: మాలా కుమార్ మాలిక  కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేసరికి డ్రాయింగ్ రూం అంతా నీట్ గా సద్ది ఉంది. అమ్మ వంటింట్లో హడ...