28, జులై 2014, సోమవారం

తలత్ మహమద్ - అమర గాయకుడు

స్వల్ప అస్వస్థలో కళ్ళు మూసుకుని విశ్రాంతి తీసుకుంటూనే సిల్కు గొంతు తలత్ మహమూద్ పాట నా చెవిన పడింది. 'ఏయ్ గమేదిల్ క్యా కరూన్..' అబ్బ ఎంత హాయి అండీ. ఈ రోజు నెట్ లో వెతికితే ఆంధ్రబూమి లో ప్రచురించబడిన గంటి బానుమతి గారి వ్యాసం కంటబడింది. వీరు మన తెలుగు సినిమా 'మనోరమ' లో 'అందాలసీమా సుధా నిలయం' 'గతి లేని వాణ్ని గుడ్డి వాణ్ని బాబయా' వంటి పాటలు కూడా పాడారు.

ఆంధ్రభూమి లో ప్రచురించబడిన వ్యాసం :

మెరీ యాద్‌మే తుమ్ న ఆసూ బహానా...అని పాడాడు. కానీ వింటుంటే మన కళ్లు చెమ్మగిల్లడం ఖాయం.
ఫిర్ వహీ షామ్, వహీగమ్, వహీ తన్‌హాయి ఆ పాట నిజంగానే మనల్ని కళ్లుమూసుకునేలా చేసి, ఏకాంతంలోకి వెళ్లిపోయేలా చేస్తుంది.
ఓ మాయని, ఓ పొరని మన చుట్టూ సృష్టించే శక్తి ఆ గళానికి ఉంది. అతని పాటలు గుండెల్లోని మూలల్ని తాకుతుంది. అప్రయత్నంగా కళ్లు మూసుకుని, ‘అబ్బా’ అని అనుకుంటూ మైమరిచిపోయేలా చేస్తుంది.
ఆ గొంతుని అనుకరించి, చెంపలేసుకున్న వారెందరో. ఆ గొంతుని అనుకరించలేరు. ఆ గొంతు అతనికే స్వంతం. అదే అతని ప్రత్యేకత. అందులో లాలిత్యం ఉంది. మాధుర్యం ఉంది. అన్నింటికీ మించిన మంత్రం ఉంది.
గజళ్లు పాడడం ఆయనకే చెల్లు. అతనికి అతనే సాటి. వేదన, ఆర్ద్రత, బాధ, ఆవేదన, ప్రేమ, అన్ని రసాలను అందులోకి ప్రవహింప చేయగల రాజు. అందుకే అతడిని బాద్‌షా-ఎ-గజల్. కింగ్ ఆఫ్ గజల్స్ అంటారు. అతని తర్వాత ఆ బిరుదు ఎవ్వరికీ రాలేదు. అతని గొంతుని ‘మొఖ్మలీ ఆవాజ్’ అని అంటారు.
ఇన్ని ప్రత్యేకతలు సంతరించుకున్న ఆ గొంతు స్వంతదారుడు తలత్ మహమూద్. తలత్ గాయకుడే కాదు నటుడు కూడా.
తలత్ లక్నోలోని సనాతన సంపన్న కుటుంబంలో మన్‌సూర్ మొహమూద్‌కి గల ఆరుగురు సంతానంలో ఒకడిగా ఫిబ్రవరి 24, 1924న పుట్టాడు.
ఇంట్లో తండ్రి, సోదరీమణులు సంగీతంలో మంచి ప్రతిభ వున్నవారు కావడంతో అదే తలత్‌కి వచ్చింది.
పెద్ద పెద్ద గొప్ప సంగీత విద్వాంసుల సంగీతాన్ని వింటూ కాలం గడిపేవాడు. గాలిబ్, మీర్, దాగ్, జిగర్‌ల గజళ్లని పాడుతుండేవాడు. విన్న వాళ్లందరు అతని గొంతులోని మార్ధవాన్ని లాలిత్యాన్ని, గుర్తించి ఇది ఓ ప్రత్యేకమైన గొంతు, మిగిలిన గాయకులలాగ లేదు అని అనుకున్నారు
ఆ సమయంలో అతని 16వ ఏట లక్నో ఆకాశవాణిలో పాడే అవకాశం వచ్చింది. అతని గాత్రాన్ని గుర్తించిన హెచ్‌ఎంవివారు తలత్‌తో పాడించారు. అవి సబ్‌దిన్ ఏక్ సమాన్ నహీ థా...పెద్ద హిట్. ఆ తర్వాత తస్‌వీర్ తెరీ దిల్ మెరా మెహలా న సఖేగీ...ఇది ఓ ప్రభంజనానే్న సృష్టించింది. ఒక్కసారిగా పదివేల రికార్డులు అమ్ముడుపోయాయి.
అంతవరకు రాష్ట్రానికే పరిమితం అయిన తలత్ ఇతర రాష్ట్రాలలోని సంగీత ప్రియుల దృష్టిలో పడ్డాడు.
తలత్ ప్రతిభని గుర్తించిన కలకత్తా సినీ పరిశ్రమ ఆహ్వానించింది. 1940 ప్రాంతంలో కలకత్తా సినిమా పరిశ్రమలకి ఓ కేంద్రం. తలత్ సినిమాలకి పాడడం అదీ ఇంట్లో వాళ్లకి ఇష్టం లేదు. వారిది సనాతన, కట్టుబాట్లు వున్న కుటుంబం అవడంవలన, తలత్‌ని మెచ్చుకోలేదు. ప్రోత్సహించలేదు కానీ ఓ పదేళ్ల తరువాత తలత్‌ని, అతని పాటలని విన్నారు. అభినందించారు. ఆనందించారు.
సినిమా కెరీర్‌ని ఎంచుకున్న తలత్ కలకత్తా వచ్చాడు. అక్కడ తపన్ కుమార్ పేరుతో పాడాడు. ఆ పాటలు ఈనాటికీ, ఎక్కడో అక్కడ వినిపిస్తునే వుంటాయి.
తలత్ మంచి పర్సనాలిటీతో వున్న మనిషి. మంచి అందగాడు. అందుకని అతనితో సినిమాలు కూడా తీసారు. 1945లో కానన్ బాలతో ‘రాజ్యలక్ష్మి’, 1947లో ‘తుమ్ ఔర్ మై’లో కానన్‌దేవి, 1949లో ‘సమాప్తి’ భారతీదేవిలతో నటించాడు.
1949 వరకు కలకత్తాలో పని చేసిన తలత్, హాలీవుడ్ లాంటి బొంబాయికి రావాల్సి వచ్చింది. కలకత్తా సినీ పరిశ్రమ లాగానే బొంబాయి సినీ పరిశ్రమ రెండు చేతులు చాచి ఆహ్వానించింది. ఆ కాలంలో నటులు వాళ్ల పాటల్ని వాళ్లే పాడుకునేవారు. సైగల్, శ్యామ్ సురేంద్ర లాగా, తలత్‌కి కూడా నటించే అవకాశాన్ని ఇచ్చారు. అయితే ముందుగా గాయకుడిగానే పరిచయం అయ్యాడు. ఆ అవకాశాన్ని ఇచ్చిన ఘనత అనీల్ బిస్వాస్‌ది. ‘ఆర్జూ’ అనే సినిమాలో దిలీప్‌కుమార్‌కి పాడాడు. ‘ఐ దిల్ ముఝే ఐసీ జగాహ్ లే చల్ జహా కోయి నహీ’ అది ఓ విద్యుల్లతలా అందర్నీ ఊపేసింది. రాత్రికి రాత్రి పెద్ద హిట్ అయిపోయింది.
అప్పటి సంగీత దర్శకులకి ఇతని గొంతు నటులకి సరిగ్గా సరిపోతుందని భావించారు. అందుకని అప్పటి పరిశ్రమలోని సంగీత దర్శకులందరు అందరి హీరోలకి కనీసం ఒక్క పాటయినా పాడించారు. తప్పనిసరిగా సినిమాలో గజల్ ఒకటి ఉండేది. దాన్ని తలత్‌తోనే పాడించేవారు. పదాల ఉచ్ఛారణ, భావాన్ని పలికించడం, రసానుభూతిని కలగజేయడం అతని ప్రత్యేకత. ఉర్దూ పాట అంటే తలత్. గజల్ అంటే తలత్. వాటిని విడదీయడం కష్టం అన్నట్టుగా అయిపోయింది.
గాయకుడిగా కొనసాగుతూనే సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయి. ఆరామ్ (మధుబాల, దేవానంద్), దిల్-ఎ-నాదాన్, లాలా రూఖ్ (శ్యామా) డాక్‌బాబూ, రఫ్తార్ (నాదిరా) మాలిక్, వారిస్ (సురయ్య), దివాలీకీ రాత్ (రూప్‌మాలా, శశికళ) ఏక్ గావ్‌కీ కహానీ (మాలా సిన్హా), సోనేకీ ఛిడియా (నూతన్) మొత్తం పది సినిమాల్లో చేశాడు.
దాదాపు 800 పాటల వరకు పాడాడు. అందులోని కొన్ని పాటలు ఈ రోజుకీ రేడియోలో వినిపిస్తూనే ఉంటాయి. శ్రోతలు వాటిని కోరుతూనే ఉన్నారు.
హమ్‌సే ఆయా న గయా (దేఖ్ కబిరా రోయా), జాయేతో జాయెకహా (టాక్సీడ్రైవర్), తస్‌వీర్ బనాతాహూ మై తకదీర్ నహీ బన్‌తీ (బరాదరి), ఆసూ సమఝకే క్యో ముఝె అప్‌నే గిరాదియా (్ఛయా), మేరీ యాద్ మే తుమ్ న ఆసూ బహాన్ (మద్‌ఘోష్), ఫిర్ వహీ షామ్ వహీ గమ్ వహీ తన్వాయి (జహనారా), ఐ మెరె దిల్ కహీ ఔర్ చల్ (దాగ్), జిందగీ దేనేవాలే సున్ (దిల్-ఎ-నాదాన్), మై దిల్ హ ఏక్ అర్మాన్ భూత్ ఆకే ముఝే పెహచాన్ జరా (అన్‌హోనీ) జల్‌తే హై జిస్‌కేలియే (సుజాత), దిల్‌ఎ నాదాన్ తుఝె హువా క్యాహై (మిర్జా గాలిబ్) షామ్ ఎ గమ్‌కీ కసమ్ (్ఫట్‌పాత్), ప్యార్ బస్‌తో నహీ మెరా తు బతా తుఝె ప్యార్ క రూయా న కరూ (సోనేకీ ఛిడియా), బహారోంకి దునియా పుకారే తు ఆజా (లైలా మజ్ను), దిల్‌మే సమాగమె సజన్ ఫూల్ ఖిలే చమన్ చమన్ (తకదీర్), తుమ్‌తో దిల్‌కీ తార్ ఛేడ్‌కర్ హోగయే బేకబర్ ( రూప్‌కీ రాని చోరోంకా రాజా) మొహబ్బత్‌మే ఐసీ జమానే భీ ఆయె (సగాయి) ఐ సనమ్ ఆజ్ ఏ ఖసం ఖాయో (జహనారా), ఏ నరుూ నరుూ ఫ్రీత్‌హై ఏ నరుూ నరుూ మీత్ హై (పాకెట్ మార్), మిల్‌తే హీ ఆంఖే దిల్ హువా దీవాన్ (బాబుల్), హమ్ తుమ్ హారే హోగయే సనమ్ (రంగీలా రాజ్) రాత్‌నే క్యాక్యా ఖాబ్ దిఖారుూ, సబ్‌కుచ్ లుటాకే హోష్‌మే ఆయేతో క్యాహువా మొదలైనవి ఇంకా ఎనె్నన్నో మధురగీతాలు పాడాడు. తెలుగులో మనోరమలో రమేశ్‌నాయుడు పాడించారు. అందాల సీమ సుధా నిలయం, గతిలేని వాడ్ని గుడ్డివాణ్ని బాబయ్య.
సినిమాలు వద్దనుకున్నాడు. గాయకుడిగానే కొనసాగించాడు. అయితే ఆ తర్వాత గజళ్లు వెనక్కి వెళ్లిపోయాయి. కానీ అతని గాత్రం అంటే ఇష్టపడేవాళ్లు ఒక్క పాటయినా తన సినిమాల్లో పెట్టేవారు. ‘హకీకత్’లో ‘కరచలే’ అన్న పాటని రఫీ మన్నాడేతో కలిసి ఒక్క చరణం పాడాడు. ‘గమ్‌కీ అంధేరే రాత్ మే’ అన్న పాటని రఫీతో కలిసి పాడారు. రఫీ, ముఖేష్, కిషోర్, మన్నాడేల గొంతు అప్పుడే వస్తున్న హీరోలకి సరిపోతుందనుకున్నారు. ఈ సమయంలోనే తలత్ తనే ఇంక పాడలేనని సినిమాల్లో పాడడం మానేసారు. అయితే ప్రైవేట్‌గా ఎన్నో ఉర్దూ ఎక్కువగా వుండే గజళ్లు పాడారు.
విదేశాల్లో ప్రోగ్రాంలు ఇచ్చిన మొట్టమొదటి వ్యక్తి తలతే. అప్పటినుంచి ఇస్తూ వచ్చిన తలత్ ఆఖరుసారిగా 1991లో హాలెండ్‌లో ఇచ్చారు. ఇంతటి గొప్ప గాయకుడిగా ఎన్నో అవార్డులు వచ్చాయి. భారత ప్రభుత్వం కూడా 1992లో పద్మ విభూషణ్‌తో సత్కరించి తనని తాను గౌరవించుకుంది. నరాల బలహీనతతో బాధపడ్డ తలత్ పాడలేకపోయాడు. అది క్రమేపీ పార్కిన్‌సన్‌కి దారితీసింది. దానితో డిప్రెషన్‌లోకి వెళ్లిపోతూ మంచంమీదే గడిపేవారు ఈ అమరగాయకుడు. 1998 మే 9న బొంబాయిలోని బాంద్రాలోని సన్‌బీమ్ ఇంట్లో తుది శ్వాసని విడిచారు.
తలత్‌పోయి ఇన్ని ఏళ్లయినా అతని పాటలు జీవించి ఉన్నాయి. ఆ పాటలు మెత్తగా, చల్లగా, హాయిగా, ఇంకా చెవుల్ని తాకుతూ వుంటాయి. అతడిని అమరుడిని చేసాయి. - గంటి భానుమతి 
 — with Aruna Ramesh,Devaki Yagalla and Vinjamuri Venkata Apparao.

24, జులై 2014, గురువారం

అందాల సీమ సుధా నిలయం - తలత్ మహమ్మద్ పాడిన తెలుగు పాట

'Siliky voice', King of Ghazals తలత్ మహమ్మద్ పాడిన తెలుగు పాట, 1959 చిత్రం 'మనోరమ' (హిందీ లో 'ఏక హీ రాస్తా' అని గుర్తు)

సంగీతం: రమేష్ నాయుడు.
రచన : సముద్రాల జూనియర్

అందాల సీమ సుధా నిలయం ఈ లోకమె దివ్య ప్రేమ మయం
అందాల సీమ సుధా నిలయం ఈ లోకమె దివ్య ప్రేమ మయం
వలపేమొ తెలియక తెలవారు బ్రతుకేలా
తొలినాటి ప్రేమలు ఫలమైన కలఐనా
మాయని గాయమై మిగిలిన అభినయం
మాయని గాయమై మిగిలిన అభినయం
అందాల సీమ సుధా నిలయం ఈ లోకమె దివ్య ప్రేమ మయం
అందాల వెలుగులో అలరారు ఆనందం
అలరించు సొగసుల ఆనందమున తేలే
తీయని అనుభవం దేవుని పరిచయం
అందాల సీమ సుధా నిలయం ఈ లోకమె దివ్య ప్రేమ మయం

https://www.youtube.com/watch?v=mYav41z0tr0


21, జులై 2014, సోమవారం

చాగంటి వారి మాట

'అడ్డంగా పుట్టి నిలువుగా పెరిగేవాడు మనిషి ఒక్కడే'
ఇది 'చాగంటి' వారి మాట.
ఆలోచించాల్సిన విషయమే.

ఆలింగనం - ణా పెన్సిల్ చిత్రం.

Pencil sketch - The hug (July - Free Hugs Month, be it friends, lovers, relatives, etc.)
స్నేహితులు, తల్లీ బిడ్డ, బంధువులు, ప్రేమికులు, భార్యాభర్తలు, ఎవరు కానీయండి - ఆత్మీయ ఆలింగనంలోని అనుభూతే వేరు. మరి జూలై నెల 'Free Hugs Month' గా జరుపుకునే సాంప్రదాయం గత పది సంవత్సారాలుగా ప్రారంభమయ్యిందట! జనవరి 21 ప్రపంచ వ్యాప్తంగా 'అంతర్జాతీయ హగ్స్ డే' గా జరుపుకుంటున్నారట కూడా!! (వివరాలు : 20.7.2014 'ఈనాడు' పెళ్లిపందిరి')

20, జులై 2014, ఆదివారం

ఆమ్యాయ్మాలు

ఆమ్యామ్యాలు
మన రాజకీయ నాయకుడొకాయన ఓ సారి అమెరికా ప్రభుత్వం ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఓ రాజకీయ నాయకుడు అతన్ని తన ఇంటికి విందుకు ఆహ్వానించాడు. మన నాయకుడు ఆయనకున్న విశాలమైన భవనాలు, ఇంటి ముందు కావాల్సినంత ఖాళీ స్థలం, ఖరీదైనా ఫర్నీచర్ అన్నీ చూసి ముచ్చట పడి
మీ కొచ్చే కొద్దిపాటి జీతాలతో ఇంత ఇంటిని, వస్తువులను ఎలా సంపాదించగలిగారుఅని అడిగాడు.
దానికి ఆ సెనేటర్ నెమ్మదిగా నవ్వి అతన్ని కిటికీ దగ్గరికి తీసుకెళ్ళాడు.
అదిగో ఆ నది కనిపిస్తోందా?”
కనిపిస్తోంది
దాని మీద వంతెన కనిపిస్తోందా?”
కనిపిస్తోంది
“10%” అన్నాడు.
మన నాయకుడు అర్థమైందన్నట్లుగా నెమ్మదిగా తల పంకించాడు.
తర్వాత కొద్ది రోజులకు సదరు అమెరికన్ సెనేటర్ భారత్ కు వేంచేశాడు. అతన్ని మన నాయకుడు తన ఇంటికి విందుకు ఆహ్వానించాడు.
సెనేటర్ కి మన నాయకుడు ఇల్లు చూడగానే మతిపోయినంత పనైంది. రాజభవనాన్ని తలదన్నే ఇల్లు, ఇంటి నిండా ఖరీదైన సామాగ్రి, నౌకర్లు, కార్లు
ఇవన్నీ చూసి ఆశ్చర్యపోయాడు.
మీకొచ్చే రూపాయల్లో జీతంతో ఇదెలా సాధ్యం?” అని ప్రశ్నించాడా సెనేటర్.
మన నాయకుడు అతన్ని కిటికీ దగ్గరకు తీసుకెళ్ళి
అక్కడ నది కనిపిస్తోందా?”
కనిపిస్తోంది
దాని మీద వంతెన కనిపిస్తోందా?”
అదేంటి అక్కెడ వంతెనే లేదు కదా!!!
“100%” అన్నాడు నెమ్మదిగా
ఇప్పుడు దిమ్మతిరగడం సెనేటర్ వంతైంది

(జాజి శర్మ గారికి కృతజ్ఞలతో)

19, జులై 2014, శనివారం

ఆర్.కే.లక్ష్మన్ - కాకులు




మనకి నిత్యం కన్పించే అతి సాధారణ పక్షి కాకి. తన తోటి కాకికి కష్టం కలిగితే కాకులన్నీ కలసి 'కావు కావు'మంటూ సానుభూతిగా అక్కడికి చేరతాయి. మనుష్యుల్లో లేని మానవతావాదం కాకుల్లో కనిపించడం విడ్డూరమే మరి. భారత దేశం గర్వించదగ్గ సుప్రసిద్ధ కార్టూనిస్ట్ ఆర్.కే.లక్ష్మన్ గారికి కాకులంటే ఎంతో ఇష్టమో మరి! ఎంత బాగా చిత్రీకరించారో చూడండి మరి.

18, జులై 2014, శుక్రవారం

చందమామ రావో జాబిల్లి రావో - అన్నమయ్య కీర్తన - నా బొమ్మ

చందమామ రావో జాబిల్లి రావో - ఈ వారం అన్నమయ్య కీర్తన

చందమామని చిన్న పిల్లలకి చూపించి చందమామ రావే జాబిల్లి రావే అని తల్లి పాడి లాలించడం అనాదిగా మన సంప్రదాయంలో ఉంది. ఈ చందమామ పాట ఏనాడో అన్నమయ్య మనకోసం రచించి పెట్టాడు. కాలక్రమేణా ఈ చందమామ పాట సాహిత్యంలో కొన్ని మార్పులు వచ్చాయి కానీ మాత్రుక మాత్రం అన్నమయ్య పాటే.

చందమామ రావో జాబిల్లి రావో
మంచి కుందనపు పైడి కోర వెన్న పాలు తేవో

నగుమోము చక్కని యయ్యకు
నలువ బుట్టించిన తండ్రికి
నిగమము లందుండే యప్పకు
మా నీల వర్ణునికి
జగమెల్ల నేలిన స్వామికి
ఇందిర మగనికి
ముగురికి మొదలైన ఘనునికి
మా ముద్దుల మురారి బాలునికి

తెలిదమ్మి కన్నుల మేటికి
మంచి తియ్యని మాటల గుమ్మకు
కలికి చేతల కోడెకు
మా కతల కారి ఈ బిడ్డకు
కుల ముద్ధించిన పట్టెకు
మంచి గుణములు కలిగిన కోడెకు
నిలువెల్ల నిండు వొయ్యారికి
నవ నిధుల చూపుల జూసే సుగుణునకు

సురల గాచిన దేవరకు
చుంచు గరుడుని నెక్కిన గబ్బికి
నెరవాది బుద్ధుల పెద్దకు
మా నీటు చేతల పట్టికి
విరుల వింటి వాని యయ్యకు
వేవేలు రూపుల స్వామికి
సిరిమించు నెరవాది జాణకు
మా శ్రీ వేంకటేశ్వరునికి

భావం :

చందమామ రావే జాబిల్లి రావే మంచి బంగారు గిన్నెలో వెన్న పాలు తేవే.
నగుమోముతో ఉన్న మా చక్కనయ్యకు, బ్రహ్మని పుట్టించిన తండ్రికి, వేదమలనందుండే అప్పకు, మా నీలవర్ణునికి, జగమెల్ల ఏలే స్వామికి, చక్కని లక్ష్మీ దేవీ మగనికి, మువుర దేవుళ్ళకు ఆఎఇమోలమైన మా ముద్దుల కృష్ణునికి బంగారు గిన్నెలో వెన్న పాలు తేవో!
తెల్లతామెరవంటి కన్నులు గలవానికి, తియ్యగా మాట్లాడే వానికి, మంచిపనులు చేసేవానికి, మంచిమాటకారియై సమయానికి తగినట్లుగా కతలల్లి చెప్పే ఈ బిడ్డకు, గోకులాన్ని ఉద్ధరించిన పట్టికి, మంచి గుణములు కలిగిన వానికి, నిలువెల్లా ఒయ్యారాలతో ఉండి నవనిధులను చూపులలో నింపి చూసే మా సుగుణాల రాశికి,
దేవతలను కాపాడిన దేవునకు, బలమైన గరుత్మంతుని ఎక్కిన ఘనునకు, మంచి నేర్పరితనమున్న బుద్ధులు కల మా పెద్దకు,గొప్ప చేతల పట్టికి, మన్మదుని తండ్రికి, వేయిరూపులు గల స్వామికి, సిరిని కట్టుకొన్న నేర్పరి జాణకు శ్రీ వేంకటేశ్వరునికి బంగారు గిన్నెలో వెన్నపాలు తేవో! చందమామ రావో!

14, జులై 2014, సోమవారం

కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు - నా పెన్సిల్ చిత్రం

 
నా ఈ పెన్సిల్ చిత్రానికి ఇలా స్పదించిన మిత్రులందరికీ ధన్యవాదాలు 
శ్రీ  మోపూర్ ప్రసాద్రు :
 
కలలలో ఉన్నది కళకి తెలుసు
కళకి తెలిసింది కలంకి తెలుసు
కలంకి తెలిసింది కన్నులకి తెలుసు
కన్నులకి తెలిసింది మనసుకి తెలుసు
మనుసుకి తెలిసింది మనుషులకి తెలుసు
మధుసూదన్ రెడ్డి గారు
 
 అన్నులమిన్న కన్నుల అందాన్ని ఎలా చిత్రించాలో పొన్నడవారి పెన్సిల్ కే తెలుసు
 
శ్రీ దుర్గాప్రసాద్ దేష్పాండే :
"కనుల కనుల కలయికలో కలయికల కలవరింతలలో కలిగే కరిగే కదిలే కదలికలే ఆ కలలు... ఆ కలల వెలుగులే ఈ కనులు... ''
శ్రీ కనక సాయికుమార్ మల్లాది :
మన స్త్రీ జాతి సమస్తం వెలుగులు నింపుకుని , ఆనందంగా ,హాయి గా సరి కొత్త ప్రపంచాన్ని చూస్తున్నట్లుగా వుంది . మన మాతృమూర్తులందరికి నమస్కారములు
శ్రీమతి పొన్నాడ లక్ష్మి :

కళ్ళలో పెళ్లిపందిరి కనపడసాగే, పల్లకీలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే అని ఆ సుముహర్తం కోసం ఎడురుచూస్తున్నట్లుగా ఉన్నాయి మూర్తిగారి పెన్సిల్ చిత్రంలోని అమ్మాయి కన్నులు.

7, జులై 2014, సోమవారం

సిగ సింగారం ఎలా చెయ్యాలో ఈ వాలుజడ వయ్యారికే తెలుసు


కర్షక కవిత్వం

మిత్రులు  నందిరాజు రాధాకృష్ణ గారు facebook లోపెట్టిన ఈ టపా నాకు బహు బాగా నచ్చింది.

"ఓ కవి, ఓ ప్రజా కవి, ఓ విప్లవ కవి, ఓ ప్రయోక్త, ఓ ఉద్యమకారుడు .. అయిన దాశరథి కృష్ణమాచార్యులు రైతు గురించి.."అగ్ని ధార"లో ..ఇలా ప్రస్తుతించారు. దీన్ని కర్షక కవిత్వమన్నారు..
"పంట పొలాలోన తెలవారులు నిద్దుర కాచి వేకువన్
ఇంటికి వచ్చి చల్దిమెతుకెంగిలి చేసియొ చేయకో పసుల్
వెంటబడంగ కాననము వీధులపోయెడి కాపు బిడ్డ! నీ
వంటి స్వయంప్రపోషణ విభావము రాజులకబ్బజాలునే"

ఎన్ని పుణ్యాలు చేసి జన్మించినావో !
ఈ ధరాభామినీ మధురాధరాన
అమృత మొలికించినావు నీ హలముతోడ
హాలికా! వేన వేల దండాలు నీకు..!"

3, జులై 2014, గురువారం

ఎన్టీఆర్ - చిత్రాలు, కవితలు

నిమ్మకూరు నందీ జగమున పుట్టి చలన చిత్ర సీమన అడుగు పెట్టి నటవిశ్వరూపము చాటి చూపెట్టి నటసార్వభౌమ బిరుదము చేపట్టి ఏకఛత్రమున ఏబదేండ్లు ఏలినట్టి జ...