దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
పండు వాళ్ళ నాన్న - కథ
నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న' 'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...
-
మిత్రులు మాధవరావు కొరుప్రోలు గారు రచించిన గజల్ : పలుకుతేనె పాటలలో..రాశి పో''సినారె'' భళారే..! తెలుగువీణియ శృతి..తెల...
-
పద్మభూషణ్ జ్ఞానపీఠఅవార్డ్ గ్రహీత డా. సి.నా.రె కి అంజలి ఘటిస్తూ రచనలనుండి కొన్ని భాగాలు ప్రపంచ పదులు ➿➿➿➿➿➿➿ సముద్రానికి చమురు పూస్తే నల్ల ...
-
Dr. C. Narayana Reddy - My pencil sketch పద్మభూషణ్ జ్ఞానపీఠఅవార్డ్ గ్రహీత డా. సి.నా.రె వర్థంతి నాడు వారికి అంజలి ఘటిస్తూ రచనలనుండి కొ...
6 కామెంట్‌లు:
మీరు కన్యాశుల్కం నాటకాన్ని మరికొంచెం శ్రధ్ధగా పరికించాలి అని నా అభిప్రాయం.
బుచ్చమ్మ తొలిసారిగా తనకు ఎదురైన ఘట్టంలో గిరీశం ఆమెను చూసి తన శిష్యుడు వెంకటేశంతో "మీ సిస్టరా? తలచెడ్డట్టుంది!" అంటాడు. ఆ పిల్లాడు అమాయకంగా "మా అక్కే. తలకు చమురు రాసుకోదు" అంటాడు. అప్పుడు గిరీశం "తలచెడ్డం అంటే విడో అన్నమాట. చమురూ గిమురూ జాన్తానై అంటాడు."
బాలవితంతువూ అప్పటికాలం ఆచారాలపుణ్యమా తిరస్కారాలకు గురియై నలుగుతున్న అమ్మాయీ ఈ బుచ్చమ్మ. ఆమెను మీరేమో ఒక ప్రబంధసుందరీమణిలాగా చిత్రీకరించారు. అరమోడ్పుకన్నులతో ఆనందపారవశ్యంతో పిండిరుబ్బటం అనే వినోదక్రియలో మునిగి ఉన్నట్లుగా. ఇలా ఈమె ఆకారాన్ని ఊహించటం బాగుండదు కదా!
నాకు తోచిన అభిప్రాయాన్ని చెప్పాను. నేనే పొరబడి ఉంటే మన్నించండి.
మూర్తిగారు, గురజాడ అప్పారావు గారు కూడా స్వయంగా బుచ్చమ్మ పాత్రకి ఇంత గొప్పగా సజీవచిత్రణ చేయలేరేమోననిపిస్తుంది. అభినందనలు.
శ్యామలీయంగారు,
మీకా చిత్రంలో ప్రబంధనాయిక కనిపించిందా? నాకైతే మూఢాచారాల నెలవులోని కట్టుబాట్లకి పడుచు వయసు సహజవాంఛలకి మధ్య నెట్టుకొస్తున్న యంగ్ విడో బుచ్చమ్మే కనపడింది.
ఎందుకో, మీరు కొన్ని కొన్ని విషయాల్ని పూర్తిగా పురాతన, సాంప్రదాయ, సంకుచిత సులోచనాలనుంచి మాత్రమే చూడగలుగుతారనిపిస్తుంది.
Edge గారూ,
పూర్తిగా పురాతన, సాంప్రదాయ, సంకుచిత సులోచనాలనుంచి మాత్రమే నేను విషయాల్ని చూస్తున్నానన్న మీ అరోపణకు సమాధానం ఇవ్వవలసిన అవసరం లేదనుకుంటాను.
మీరు నా వ్యాఖ్యను సరిగా చదివారా అని అనుమానంగా ఉంది. చక్కని తైలసంస్కారం కలిగి నున్నగా కురులు దువ్వి ముడివేసిన చిత్రంలోని అమ్మాయిని బుచ్చమ్మ అంటారు. బాగుంది. అప్పటికాలంలో వితంతులవుల వస్త్రధారణగురించి మీకు అవగాహన ఉన్నదా? చిత్రం అట్టి అవగాహనకు తగిన విధంగా ఉన్నదా? చిత్రంలోని అమ్మాయి ముఖంలో మీకు బండెడు చాకిరీకి అంకితమైన బాలిక ముఖంలోని దైన్యం చాయలైనా కనిపిస్తున్నాయా?
కొంచెం పధ్ధతిగా స్పందించటం అలవరచుకోమని నా మనవి. ఐనా, నా అభిప్రాయం పైన చిత్రకారుడి అభిప్రాయానికి తప్ప మీ మాటలకు నేను విలువను ఇవ్వనవసరం కూడా పెద్దగా లేదు.
శ్యామలీయంగారు,
మీ బాహ్యదృష్టి/దృక్పథం/దృక్కోణం పై అది కేవలం నా పరిశీలన /అభిప్రాయం మాత్రమే, మీరు స్పందించాల్సిన అవసరం ఖచ్చితంగా లేదు, ఒప్పుకుంటాను.
బుచ్చమ్మ యొక్క ఏ రూపచిత్రణ ఐనా కన్యాశుల్కం లోని తొలి సందర్భపు వర్ణనలను మాత్రమే ప్రతిఫలించాలని మీ ఉద్దేశ్యమా?
మూర్తిగారి చిత్రంలో బుచ్చమ్మ తన నల్లటి కురుచజుట్టుని అనువుగా ముడివేసి ఉంచుకోవడం, బాధ్యతలేగాని అధికారము అవకాశాలేమాత్రం లేక, రోజువారీ పనులలో నిమగ్నమై, నిజజీవితంలో నోచుకోని అనుభవాలను ఊహాలోకంలో అందుకోవడానికి ప్రయత్నిస్తున్న ఒక పడుచు వయసు యువతి సహజ సౌందర్యం మాత్రమే నాకు కనిపించింది. చక్కని తైలసంస్కారం కలిగి నున్నగా కురులు దువ్వి ముడివేసినట్టుగాను, ఒక ప్రబంధసుందరీమణిలా అరమోడ్పుకన్నులతో ఆనందపారవశ్యం ఓలలాడుతున్నట్టుగాను మీకు అనిపిస్తే… I guess there is a huge difference in how we perceive things.
అప్పటికాలంలో వితంతులవుల వస్త్రధారణ, శిరోధారణల గురించి అవగాహన కోసం 1950లలో వచ్చిన కన్యాశుల్కం సినిమాలోని వివిధ వయసుల వితంతు పాత్రలు బుచ్చమ్మ, మీనాక్షి, పూటకూళ్ళమ్మల ఆహార్యం ఒక మంచి reference అని నా అభిప్రాయం.
ఇక, నా స్పందనా పద్ధతులపై మీ సూచనని తప్పక దృష్టిలో పెట్టుకుంటాను, ధన్యవాదాలు.
మూర్తిగారు,
నమస్కారం.
ఈ చిత్రంపైన కొన్ని అభిప్రాయాలు వచ్చాయి. కాని మీరు ఏమీ ప్రతిస్పందించలేదు. కొంచెం ఆశ్చర్యంగా ఉంది. మీరు ప్రతిస్పందించి తీరాలన్న నియమం ఏమీ లేదు. మంచి బొమ్మలు గీస్తున్నందుకు అభినందనలు. మా అభిప్రాయాలను ప్రచురించినందుకు ధన్యవాదాలు.
అయ్యా .. ఆలస్యంగా స్పందిస్తున్నందుకు అన్యధా భావించవలదు.
నేను వేసిన బొమ్మ స్వర్గీయ బాపు గారి బొమ్మకి 99% replica. గిరీశం లెక్చర్లు (ముళ్ళపూడి వారి రచన) అట్టమీద బొమ్మ లో క్రిందన ఓ చిన్న బొమ్మగా వేశారు. నా కళా త్రిష్ణ కొద్దీ ఆ బొమ్మని పెద్దదిగా చేసుకుని వేశాను. (శీర్శికలో 'బాపు బొమ్మ ప్రేరణ' అని కూడా వ్రాశాను. అంతకుమించి ఇందులో నేను కల్పించింది ఏమీ లేదు.
మీ స్పందనకి ధన్యవాదాలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి