17, మే 2016, మంగళవారం

చెలి బుగ్గల సిగ్గులలో - తెలుగు గజల్ - నా పెన్సిల్ చిత్రం


ఈ వారం facebook లో 'బొమ్మలు చెప్పిన గజల్లు' శీర్షికలో Madhav Rao Koruprolu గారి గజల్ కి నా పెన్సిల్ చిత్రం. 


చెలి బుగ్గల సిగ్గులలో అనురాగపు గనులున్నవి..!
తన పెదవుల అరుణిమలో నవ పగడపు సిరులున్నవి..!
తారలతో ముచ్చటించు ఆ మౌనమె నా కోవెల..!
మంచుపూల తలపులో తన పరువపు వనులున్నవి..!
కడలి అలల పదములకే సరిగమలను నేర్పునుగా..!
తన చూపుల స్వరములలో మధుమాసపు మరులున్నవి..!
అడుగడుగున కలహంసల సొగసులొలుకు నెరజాణరొ..!
కాంతిపూల ధారలలో తన సరసపు నిధులున్నవి..!
పలుకు వీణ శృతిలయలకు ప్రాణమూదు ప్రేమమయిరొ..!
తన అందెల రవములలో శుభ చెలువపు సరులున్నవి..!
నా'మాధవ' ప్రియ భామిని ఆ'రాధ'యె ఆమె సుమా..!
ఆ వలపుల పిలుపులలో చిలపితనపు గిరులున్నవి..!

3 కామెంట్‌లు:

Zilebi చెప్పారు...




చెంపకు సాయము చేతిని
నింపుగ నుంచెను జిలేబి నిచ్చట జూడన్
సొంపగు రూపము నయనపు
వొంపుల విరుపున పెదవులు వోరగ జూచెన్ !


జిలేబి

Ponnada Murty చెప్పారు...

బాగుందండి మీ పద్యం. ధన్యవాదాలు

Upendra చెప్పారు...

A picture speaks 1000 words అంటారు. 1000 భావనలు కనిపిస్తున్నాయి. తెలుగమ్మాయి.. అద్భుతం.

The power of 'Will' Usage - English grammar - illustration

  When we use will to make a promise 🤝 or an offer 💡, we are usually deciding to do something at the very moment we are speaking. It shows...