13, మే 2017, శనివారం

Depressio - నిర్వేదం, కుంగుబాటు



నా ఈ pencil  చిత్రానికి శ్రీమతి ఉమాదేవి ప్రసాదరావు జంధ్యాల గారి కవిత

వెన్నెలంత మింగేస్తూ భూతమొకటి నవ్వినట్లు
ఊపిరాడ నీయకుండ గొంతెవరో నొక్కినట్లు
మెదడులోని నరాలన్ని చిక్కులుపడి పోయినట్లు

గతమంతా బొంగరమై లోలోపల తిరిగినట్లు
ఛిద్రమైన ముఖచిత్రం బహుమతిగా ఇచ్చినట్లు
టిక్ టిక్ మని గడియారం దుందుభిలా మ్రోగినట్లు
చస్తేనే మంచిదంటు బుజంతట్టి చెప్పినట్లు
నిస్సత్తువ నిలువెల్లా ఆవరించి కూల్చినట్లు
దేనిపైన ధ్యాసలేక ఉత్సాహం ఉడిగినట్లు
తనకుతాను బరువై మ్రోడులాగ మిగిలినట్లు
లోకమంత ఒక్కటై తననే వెలివేసినట్లు
పనికిరాని వస్తువంటు దేవుడు పారేసినట్లు
ముగింపు చిరిగిన కథలా జీవితమే మారినట్లు 
ఆలోచన దొంతరలను మీదకెవరొ తోసినట్లు
ఆగంతకులెవరో హంతకులై వచ్చినట్లు
అంతుపట్టలేనివ్యాధి అణువణువున చేరినట్లు
------ ఇంకా ----- ఇంకా -----

1, మే 2017, సోమవారం

మదిభావం॥ మేడే ॥


మదిభావం॥ మేడే ॥
~~~~~~~~~~~~
వినండి ...
ఇక్కడ అలసిపోయింది ఓ దేహంకాదు
మనిషితోలు కప్పుకున్న మనసిది
సొలసిపోయిందో-- సొమ్మసిల్లిపోయిందో
మరి కాస్త సేదతీరనివ్వండి.....
కడుపులోపడిననాటి నుండీ
కష్టాలనలిగిన గుర్తులే దేహమంతా
బాధ్యతల్లో బంధాలలో
బరువులో మమతలకరువులో
మునకలేసిన తునక
మసిచూరిన భరిణెలోని నిప్పుకణిక......
గుండెబీటల్ని కళ్ళలో దాచుకున్న చెమ్మ
క్షణం విశ్రమించని పరిశ్రమ
తననాశ్రయించిన అనుబంధాలపుప్పొడికే పూతొడిమ...
ఇప్పుడు నా అక్షరాలలో నిదురిస్తున్న కార్మిక పటిమ...
ష్ !!!శబ్ధించకండి....కొంత విరామమిద్దాం
మేని మడతలపై అనుభవాల కలలు కననివ్వండి
పగలు-రేయి తేడా కూసింత తెలుసుకోనివ్వండి
ఎప్పుడూ కన్నీటీవర్ణాలేనా??
ఆనందపు హరివిల్లొకటుందని చూడనివ్వండి
నిదురిచే తోటొకటుందని వెతకనివ్వండి
అన్నీమరచిపోయేలా అలసటతీరేలా..
ఇలా కాస్తంత నిదురజారనీయండి......
J K 1-5-17(చిత్రం Pvr Murty బాబాయ్ గారు.ధన్యవాదాలు బాబాయ్ )

మహాకవి శ్రీశ్రీ




మదిభావం॥సాహో॥ (కవిత - శ్రీమతి జ్యోతి కంచి)
~~~~~~~~~~~~
జల్లై
ఉరుమై 
మెరుపై
పిడుగై
ఝరినడకై
కడలిపిలుపులై
జీవితాన్ని మదించే పదమై
జారిపోని ఓ తపంచా వేటై
పదేపదే ఙ్ఞప్తికి వచ్చే పాటై
నీకు నీవే పోటిలేని కోటై
మార్గమై-మార్గబంధువై
కవి లోని రవివై
మహోన్నత రధచక్రాలు పరుగులెత్తించి
అలసి,
మా వెన్నుతట్టి నడిపిస్తున్న
మనీషివయ్యా.....మహాకవి....మహాప్రస్తానివి.....
JK30-4-17
(చిత్రం-Pvr Murty బాబాయ్ ధన్యవాదాలు బాబాయ్ )



శ్రీ Ratna Reddy Yeruva గారి కవిత 

నేను సైతం.....
నేను సైతం కవితాగ్నికి అక్షరాన్నొకటి
ఆహుతిచ్చాను,
నేను సైతం అక్షరసేద్యంలో ఒక రైతునై
కావ్యాల మడి దున్నాను...
నన్ను చూసి నవ్వినా , వెక్కిరించినా
గేలి చేసినా, గోల చేసినా
కవి కులానికి వన్నె తెచ్చేలా
వెన్నెల కుసుమాలని కొన్ని
మనసు కాగితంపై పరిచాను....
వేదనలో అయినా రోదనలో అయినా
ఆవేదనలో అయినా ఆవేశపు ఘడియల్లోనయినా
ఆనందపు అనుభూతుల్లో అయినా
ఆహ్లాదపు క్షణాల్లో అయినా ...
అక్షరాన్నే నమ్ముకున్నాను
కవితనై కమ్ముకున్నాను...
నీకు తెలుసా...
కవి నిశ్శబ్దంలో కూడా అందమైన శబ్దం
వినిపించగలడని,
కారు చీకట్లో కూడా కాంతిరేఖల్ని
కురిపించగలడని...
వెన్నెలై వెలుగులు విరజిమ్ముతాడని
వేకువై నిను నిద్ర లేపుతాడని...
నీకు తెలుసా... నీకు తెలుసా
గుండె పగిలినా కవితే
మనసు నలిగినా కవితే
నవ్వినా కవితే.. ఏడ్చినా కవితే
కలాలనన్నీ మది కాగితాలపై దున్నీ
నేను సైతం కవితాగ్నికి అక్షరాన్నొక్కటి
ఆహుతిచ్చాను...
నాకు నేనే అక్షర యజ్ణంలో
సంతోషంగా సమిధనయ్యాను...

The power of 'Will' Usage - English grammar - illustration

  When we use will to make a promise 🤝 or an offer 💡, we are usually deciding to do something at the very moment we are speaking. It shows...