1, మే 2017, సోమవారం

మదిభావం॥ మేడే ॥


మదిభావం॥ మేడే ॥
~~~~~~~~~~~~
వినండి ...
ఇక్కడ అలసిపోయింది ఓ దేహంకాదు
మనిషితోలు కప్పుకున్న మనసిది
సొలసిపోయిందో-- సొమ్మసిల్లిపోయిందో
మరి కాస్త సేదతీరనివ్వండి.....
కడుపులోపడిననాటి నుండీ
కష్టాలనలిగిన గుర్తులే దేహమంతా
బాధ్యతల్లో బంధాలలో
బరువులో మమతలకరువులో
మునకలేసిన తునక
మసిచూరిన భరిణెలోని నిప్పుకణిక......
గుండెబీటల్ని కళ్ళలో దాచుకున్న చెమ్మ
క్షణం విశ్రమించని పరిశ్రమ
తననాశ్రయించిన అనుబంధాలపుప్పొడికే పూతొడిమ...
ఇప్పుడు నా అక్షరాలలో నిదురిస్తున్న కార్మిక పటిమ...
ష్ !!!శబ్ధించకండి....కొంత విరామమిద్దాం
మేని మడతలపై అనుభవాల కలలు కననివ్వండి
పగలు-రేయి తేడా కూసింత తెలుసుకోనివ్వండి
ఎప్పుడూ కన్నీటీవర్ణాలేనా??
ఆనందపు హరివిల్లొకటుందని చూడనివ్వండి
నిదురిచే తోటొకటుందని వెతకనివ్వండి
అన్నీమరచిపోయేలా అలసటతీరేలా..
ఇలా కాస్తంత నిదురజారనీయండి......
J K 1-5-17(చిత్రం Pvr Murty బాబాయ్ గారు.ధన్యవాదాలు బాబాయ్ )

కామెంట్‌లు లేవు:

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...