28, నవంబర్ 2017, మంగళవారం

వృధ్ధాప్యం

ఓ వృధ్ధుని ఆవేదనకి నా పెన్సిల్ చిత్రం.
చిన్నా,
అలసిపోయాను. నీరసపడిపోయాను. ముసిలివాణ్ణి, దయచేసి అర్ధం చేసుకో. బట్టలు వేసుకోవడం కష్టం. తువ్వాలేదో చుట్టపెట్టుకుంటాను. గట్టిగా కట్టుకోలేను. అందుకే అది తొలగిపోతుంటుంది. కసురుకోకు. అన్నంతింటున్నప్పుడు చప్పుడు అవుతుంది. చప్పుడుకాకుండా తినలేను. అసహ్యించుకోకు. నీ చిన్నతనంలో నువ్వుకూడా ఇంతే. గుర్తు తెచ్చుకోరా ! బట్టలు సరిగ్గా వేసుకునేవాడివి కాదు. అన్నం కూడా అంతే. పెద్దగా శబ్దం చేస్తూ క్రిందామీదా పోసుకుంటూ తినేవాడివి. ఒకే విషయాన్ని పదేపదే చెప్తుంటాను. విసుక్కోకు. స్నానం చెయ్యడానికి ఓపిక ఉండదు. చెయ్యలేను. తిట్టకు. నువ్వుకూడా చిన్నప్పుడు స్నానం చేయమంటే ఎంత ఏడ్పించేవాడివో గుర్తుందా? తినాలని లేనప్పుడు తినలేను. విసుక్కోకు.
కీళ్ళ నొప్పులు. నడవలేను. ఊత కర్ర నాతోనే ఉండాలి. లేనప్పుడు నీ చేయి అందించి నడిపించు. నీకు నడక వచ్చేంతవరకూ అలాగే నేను నిన్ను వేలుపట్టుకుని నడిపించాను. అందుకేనేమో ముసిలివాళ్ళు పసిపిల్లలతో సమానమంటారు. ఏదో ఒకరోజు "నాకు బతకాలని లేదు చనిపోవాలని ఉంది" అని అంటాను. అప్పుడు కోపం తెచ్చుకోకు. అర్ధం చేసుకో. ఈ వయస్సులో ఇంక బతకాలని ఉండదు. అయినా బతకక తప్పదు. ముసిలి కంపు కొడుతున్నానని అసహ్యంగా చూడకు. దగ్గరగా తీసుకుని కూర్చో. చిన్నప్పుడు నువ్వు ఎలాగున్నా నేను అలాగే దగ్గరకి తీసుకునేవాణ్ణి. నువ్వు అలా తీసుకుంటే ధైర్యంగా, ఆనందంగా, హాయిగా నవ్వుతూ చనిపోతానురా!

17, నవంబర్ 2017, శుక్రవారం

అలనాటి ప్రయాణాలు.

అలనాటి ప్రయాణ దృశ్యం - 
మగని చేతిలో ట్రంకుపెట్టె, చంకలో 'బెడ్డింగు' (హోల్డాల్ అని కూడా అని అనేవారు), మగనాలి చేతిలో 'మరచెంబు' తప్పని సరి. ( 'శంకరాభరణం' చిత్రంలో ప్రేమికుల ప్రేమ చిహ్నం ఈ 'మరచెంబు') . ఆదరాబాదరాగా ఏ చేతి రిక్షాలోనో స్టేషను వరకూ వస్తే ఆ పాసెంజరు బండి కాస్తా గంటలతరబడి ఆలస్యంగా నడిచే రోజులు ఇప్పటికీ నాకు గుర్తు. భానుమతి గారు రాసిన అత్తగారికథల్లో మొత్తం కనిపించేది మరచెంబే. 'బాపు' గారు వేసిన అలనాటి ఓ illustration లో బొమ్మని re-create చేసి రంగులద్ది మా చిన్నప్పటి రోజుల్ని గుర్తు చేసుకున్నాను.

కూటికొరకు కోటి విద్యలు


కూటికొరకు కోటి విద్యలంటారు. ఇదొక 'rural marketing' అని చెప్పుకోవచ్చునేమో. రోజూ ఓ మోపెడ్ మీద వీటిని కట్టి ఇంటింటికీ తిరిగి, (ముఖ్యంగా గ్రామాల్లో) , ఈ రతహా గృహోపకర వస్తువులు వ్యాపారం చేస్తుంటారు. వీటిల్లో మిక్సీలు, ప్రెషర్ కుక్కర్లు, fans, ప్లాస్టిక్ బిందెలు, స్టీలు బిందెలు, plastic చాపలు, వగైరా వగైరా వస్తువులన్నీ ఉంటాయి. show-rooms లో లభించే branded products వీరు అమ్మరు. వీటిని సులభ వాయిదా పధ్ధతిల్లో గ్రామీణ గృహిణులకు అమ్ముతుంటారు. ఈ తరహా వ్యాపారస్థులకు అధిక వడ్డీకి finance చేసే వ్యక్తులుంటారు. దీనిని ఈ వ్యాపారస్థులు 'daily finance' అని వ్యవహరిస్తుంటారు. వీరిని చూస్తే 'జీవనోపాధి' కి ఎన్ని మార్గాలో అనిపిస్తుంది.

8, నవంబర్ 2017, బుధవారం

ద్వారం వేంకటస్వామి నాయుడు


కళాతపస్వి, పద్మశ్రీ వాయులీన విద్వాంసుడు ద్వారం వేంకటస్వామి జయంతి నేడు. "ఉజ్వల సువర్ణ సంకలితోన్నత శబ్దద్వారము/తెరచి పరబ్రహ్మమును ప్రత్యక్షము చేయింపగా/భూలోకమునకు వచ్చిన పుంభావసరస్వతి/గాంధర్వయోగి'' అని పలువురిచే కొనియాడబడిన 'ఫిడేలు నాయుడు' గారికి నా నివాళి (My pencil sketch)

6, నవంబర్ 2017, సోమవారం

సంజీవ్ కుమార్ - Sanjeev Kumar



తనదైన శైలిలో హిందీ చిత్రసీమని అలరించిన అద్భుత నటుడు. తన స్వల్ప జీవితకాలంలో ఎన్నొ పురస్కారలు సొంతం చేసుకుని అగ్ర తారల స్థాయిని చేరుకున్న నటుడు.

ఎన్టీఆర్ - చిత్రాలు, కవితలు

నిమ్మకూరు నందీ జగమున పుట్టి చలన చిత్ర సీమన అడుగు పెట్టి నటవిశ్వరూపము చాటి చూపెట్టి నటసార్వభౌమ బిరుదము చేపట్టి ఏకఛత్రమున ఏబదేండ్లు ఏలినట్టి జ...