20, డిసెంబర్ 2017, బుధవారం

ప్రియతమా .....నీ నవ్వు .- కవిత




సోదరి Velamuri Luxmi నైరాశ్యపు కవితకి నా పెన్సిల్ చిత్రం.

ప్రియతమా .....నీ నవ్వు .

" అంతే లేని ఆలోచన సాగి పోయింది ......
ఏదో రహస్యం నన్నావరించుకుంది .....
ఏమీ తోచక భయంతో కళ్లు మూసుకున్నాను .....
అపుడు ...నీ నవ్వు ....నా గుండె క్రింద వినపడింది .....
రెప్ప రెప్పనీ తడిపింది .....కన్నీటి చుక్క... 
నాకే ఎరుగని నా మనస్సు నాలోనే చెదిరింది ....
ఆకాశపు అంచులో ...వొంపులో ....ఆర్ద్రత వెనుక ....
క్షితిజ రేఖపై నీ నవ్వు వినిపించింది .....
పాతాళ లోకాల్లో ...ప్రతిధ్వనించ సాగింది ......
అంధకారపు సంద్రానికి ఆవలి వొడ్దున నీ రూపం .....
అస్పష్టంగా అగుపించింది ....అగుపించింది .....
అందుకో లేని నిన్ను నా చూపు ఆశగా ..ఆశగా చూసింది ....
తరతరాల నిస్ప్రుహ నన్నావహించింది .....
నాకే తెలియని రహస్యం నన్ను తన వశం చేసుకుంది ......
నిదురలో ..కంటికొస నుంచి కన్నీటి చుక్క రాలినట్టుగా .....
నా.....కలం లోంచి ....శిరా జాలువారుతోంది .....
ఏవో సవ్వడులు నాలో నాకే వినిపిస్తున్నాయి .....
మ్రుత్యువనే .....మైదానం ...పిలుస్తోంది .....
నిన్ను విడచి మనస్సు రానని మొరాయిస్థొంది .....
ఒక వెన్నెల బిందువు కొబ్బరి మొవ్వలోకి జారింది .....
ఆ నాటి తీపి గురుతులు ....గురుతొస్తున్నాయి ..మేమున్నామంటూ ....
ఆ నాటి స్వప్న వంశీ రవమ్ములు వినిపిస్తున్నాయి .....
మనం నడచిన దారికీ తెలుసు ...
మనం చెప్పుకున్న రహస్యాలు .....
విచ్చుకుంటున్న మల్లెలకూ తెలుసు....
మన గుస గుసలు .....
వూరి చివరనున్న మామిడి తోపుకూ తెలుసు..... 
మనం దాని క్రింద కూచుని కన్న కలలు .....
మన ఇంటివెనుక నున్న గన్నేరు చెట్టుకూ తెలుసు .....
సంజె కెంజాయల ముసురులలో .....
కలిసిన మన పెదవుల నిశ్వాసాలు .....
ఎక్కడ ప్రియతమా ....వుమర్ ఖయ్యాం రుబాయీలు .....
ఎక్కడ గాలిబ్ గీతాల్లాంటి ....ప్రేమ పలుకులు ......
ఎవరు హరియించారు ప్రియతమా ......
నాటి హేమంత శైత్యానికి .....కాదు ...
నీ నిరాకరణ పైత్యానికి ....గడ్డ కట్టిన నా మనస్సు .....
కేవలం ......నాటి వసంత విహారాలు ....
తలచుకుంటూ .......అవైనా మిగిలాయని ....
ఒక్క జీవ కణం రగిలి త్రుప్తి పడుతోంది .....నా మనస్సు.... 
పగిలిన నా హ్రుదయం.... 
కానీ నీ నవ్వు ....నా గుండెని చీలుస్తోంది ....
ప్రియతమా ....ఎంత నిర్దయ....."

1 కామెంట్‌:

నిర్మల్ కుమార్ చెప్పారు...

తిలక్ కనిపిస్తున్నాడు వంశీ రవమ్ములు అంటే ఏమిటి

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...