20, ఫిబ్రవరి 2018, మంగళవారం

మనసుకన్న విందుసేయు..మేఘబాల ఎవ్వరోయి - గజల్





మనసుకన్న విందుసేయు..మేఘబాల ఎవ్వరోయి..!?
చేమంతుల పసిడివాన..పూలబాల ఎవ్వరోయి..!?
ఊరించే తనచూపుల..ఊయలనే నిలిపెనుగా..
కవ్వించక కదిలించే..కలువబాల ఎవ్వరోయి..!?
ప్రతిరేయిని ముచ్చటగా..నిదురపుచ్చు చిత్రముగా ..
కలలవీణ మీటుతున్న..రాగబాల ఎవ్వరోయి..!?
నిదురించని కంటిపాప..ఎంత పరమ సాక్షి అసలు..
సున్నితమౌ మౌనసుధా..కావ్యబాల ఎవ్వరోయి..!?
గజలింటను నాట్యమాడు..చిరునవ్వుల మెఱుపుతీవ..
రెప్పపాటు మాటు నిలచు..గంధబాల ఎవ్వరోయి..!?
ఈ మాధవ అక్షరాల..గగనసీమ నేలేనే..
సర్వము మరి తానయ్యిన..సరసబాల ఎవ్వరోయి..!?

 (నా చిత్రానికి శ్రీ మాధవరావు కొరుప్రోలు గారు అల్లిన గజల్)

కామెంట్‌లు లేవు:

ఫిల్టర్ కాఫీ

  Digital గా రంగుల్లో కూర్చుకున్న నా pen sketch. దక్షిణాది రాష్ట్రాల్లో  ఫిల్టర్ కాఫీ రుచే వేరు. మరి మిథునం చిత్రంలో జొన్నవిత్తుల వారు రచించ...