23, ఫిబ్రవరి 2018, శుక్రవారం

మనిషి - కవిత


మిత్రులు శ్రీ Vemuri Mallik గారి కవిత కి నా చిత్రం వారి అనుమతితో. వారికి నా ధన్యవాదాలు. చదవండి.
మనిషీ నీవో వింతజీవివే..
తనువుని బంధించుకుంటూ..
మనసుకు బందీవై..
గెలిచాననుకుంటూ ఓడిపోతూ..
ఓటమి సైతం నీ గెలుపనుకుంటూ..
అందనివన్నీ పులుప‌నుకుంటూ..
అందినవన్నీ చేదని తలపోస్తూ..
నిజాన్ని ఒప్పుకోలేక..‌
అబద్ధమని చెప్పుకోలేక..
ఇలలో గిరిగీసుకుంటూ..
కలలో హద్దులు చెరుపుకుంటూ..
ఉన్న మాటలకు ఉలిక్కిపడుతూ..
అంతరాత్మ పీకినులిమి..
ఎదుటివాడికి వేలుచూపుతావు..
నిన్ను చూపే మూడు వేళ్ళకు..
గంతలు కడతావు..
లోకానికి ఓ హరిశ్చంద్రుణ్ణి నేనంటావు..
సఛ్చీలతే నా సొత్తంటావు..
ఆషాఢభూతినే అనుకరిస్తావు..
మన:తనువులుగా విడిపోతావు..
మనో వాక్కులంటూనే..
రెండు ముసుగులతో ఉంటావు..
మనిషీ నువ్వో రెండుకాళ్ళ వింతజీవన్నది నిజమనిపిస్తావు..‌!!

కామెంట్‌లు లేవు:

జన్మల వరమై..పుడితివి కదరా..! గజల్

  కృత్రిమ మేధ సహకారంతో రంగుల్లో రూపు దిద్దుకున్న నా పెన్సిల్ చిత్రం. ఈ చిత్రానికి మిత్రులు,  ప్రముఖ గజల్ రచయిత ‌‌శ్రీ  మాధవరావు కొరుప్రోలు గ...