25, డిసెంబర్ 2018, మంగళవారం

అద్దమెంత అల్లరిదో..పలుకరించు పదేపదే..!


నా చిత్రానికి మిత్రులు మాధవరావు కొరుప్రోలు గారు రాసిన కవిత. వారికి నా ధన్యవాదాలు.


అద్దమెంత అల్లరిదో..పలుకరించు పదేపదే..!
మెచ్చనీదు అందాలను..ధిక్కరించు పదేపదే..!
ఎంత దిద్దుకోవాలో..ఎఱుకపరచు పలుకకనే..
ముచ్చటాడు సందడినే..సంస్కరించు పదేపదే..!
అర్థమవని భావాలకు..నిఘంటువే తానవునే..
నేను మాటు చిత్రాలను..ఆదరించు పదేపదే..!
విరహాగ్నిని ఊరడించు..నెచ్చెలిగా మిగిలియుండు..
చిరునవ్వుల వేదాలను..చిలకరించు పదేపదే..!
ప్రతిబింబపు మూలాలను..అందించే కోమలిరో..
నిత్యసత్య మౌనసుధను..వెలువరించు పదేపదే..!
నా కలలకు ప్రతిరూపం..ఈ జగమే మాధవుడా..
నీ గజల్ పరిమళములె..కలవరించు పదేపదే..!

కామెంట్‌లు లేవు:

నీతోడుతొ జీవితాన్ని గడపనివ్వు ఇలాగే ౹౹ మదినేలే రాణివలే గెలవనివ్వు ఇలాగే ౹౹ - గజల్

Pvr Murty బాబాయ్ గారి చిత్రానికి చిన్న ప్రయత్నం... నీతోడుతొ జీవితాన్ని గడపనివ్వు ఇలాగే ౹౹ మదినేలే రాణివలే గెలవనివ్వు ఇలాగే ౹౹ ఆలోచన అంతులేన...