27, జులై 2019, శనివారం

లిప్తకాలం - కవిత - pen sketch

అమ్మాయి అనుశ్రీ కవితకి నా line drawing.

~లిప్తకాలం~
~~~~~~~~~~~~~

ఎందుకిలా....
గతించిన కాలాలన్నీ
నెమరువేతలో విషాద వీచికలను
మదిపైకి ఉసిగొలుపుతుంటే...

స్వార్థపు ఆలోచనల్లో
మకిలిపట్టిన అనుబంధాలు
చమరింతను నిర్థయగా
విసిరిన సందర్భాలన్నీ
జ్ఞాపకాల నిండా పోగేసుకున్నా..

లిప్తకాలమైనా ఆనందం
మనసుకివ్వలేని బంధాలు
వేదనను మాత్రం వెతికి ఇస్తున్నా

నిజాలని ఆమోదించలేక
లేని ప్రేమల అన్వేషిస్తూ...
ఎందుకిలా వేధిస్తున్నావని
మూగదైన మనుసుని అడిగేదెలా...!!

అనూశ్రీ...

కామెంట్‌లు లేవు:

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...