25, ఆగస్టు 2019, ఆదివారం

శ్రావ్య సంగీతభూషణుడు 'ఖయ్యామ్:

శ్రధ్ధాంజలి

ఈ నెల 19వ తేదీన  భువినుండి దివికేగిన  శ్రావ్య సంగీత భూషణుడు 'పద్మభూషణ్' ఖయ్యాం కి శ్రధ్ధాంజలి.

‘కభీ కభీ మేరే దిల్‌ మే...’ ఈ  పాట తెలియని సంగీత ప్రేమికులుండరు అంటే అతిశయోక్తి కాదేమో.  ఈ పాట 'కభీ కభీ'  సినిమాలోకి రావడం వెనుక కూడా మరో కథ ఉంది. నిజానికి అది సాహిర్‌ లూథియాన్వీ కవిత. చేతన్‌ ఆనంద్‌ సినిమా కోసం అదివరకే ఆ పాటను ఖయ్యామ్‌ రికార్డింగ్‌ చేశారు. కానీ, అనివార్య కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. దాంతో, చేతన్‌ ఆనంద్‌ అనుమతితో ఆ పాటను ఈ ‘కభీ కభీ’లో వాడారు. సంగీతంగానే కాక, వాణిజ్యపరంగా కూడా ఆ చిత్రం పెద్ద హిట్‌. దాంతో, తన కెరీర్‌లో మొదటి సిల్వర్‌ జూబ్లీ హిట్‌ యశ్‌ చోప్రా ఇచ్చారని ఖయ్యామ్‌ అనేక సందర్భాలలో గొప్పగా చెప్పేవారు. ఆ తరువాత యశ్‌ చోప్రా రూపొందించిన వరుస చిత్రాలు ‘త్రిశూల్‌’ (1978), ‘నూరి’ (1979)కు కూడా ఖయ్యామే సంగీతం. అవీ సిల్వర్‌ జూబ్లీ హిట్లే. ఖయ్యామ్‌ స్వరసారథ్యంలో మరో ఆణిముత్యం... 1981లో లక్నో నేపథ్యంలో ముజఫర్‌ అలీ నిర్మించగా, రేఖ నటించిన ‘ఉమ్రావ్‌ జాన్‌’. అంతదాకా చాలావరకు పాటలు లతా మంగేష్కర్‌తో పాడించిన ఖయ్యామ్‌ ఆ చిత్రంలో రేఖకు ఆశాభోంస్లేతో నేపథ్యగానం ఇప్పించారు. ఆశాకు తొలిసారి ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ అవార్డు వచ్చింది ఆ ‘ఉమ్రావ్‌ జాన్‌’తోనే! ఖయ్యామ్‌ సాబ్‌కు కూడా సంగీత దర్శకుడిగా తొలి జాతీయ అవార్డు దక్కిందీ ఆ చిత్రంతోనే! ‘కభీ కభీ’, ‘ఉమ్రావ్‌ జాన్‌’ ఆయనకు ఫిల్మ్‌ఫేర్‌లను అందించాయి.

'మొహబ్బత్ ఇస్కో కెహెతే హైం' చిత్రం కోసం వీరు స్వరపరచిన  'ఠెహరియే హోష్ మెం లావూం' పాట అంటే నాకు మహా మహా ఇష్టం. మహమ్మద్ రఫీ, సుమన్ కళ్యాన్పూర్ పాడిన ఈ పాట శశి కపూర్, నందా ల మీద చిత్రీకరించారు.

కామెంట్‌లు లేవు:

ఎన్టీఆర్ - చిత్రాలు, కవితలు

నిమ్మకూరు నందీ జగమున పుట్టి చలన చిత్ర సీమన అడుగు పెట్టి నటవిశ్వరూపము చాటి చూపెట్టి నటసార్వభౌమ బిరుదము చేపట్టి ఏకఛత్రమున ఏబదేండ్లు ఏలినట్టి జ...