1, డిసెంబర్ 2019, ఆదివారం

కలకంఠి నీ కంట - కవిత

అలనాటి బాపు గారి నలుపు తెలుగుల చిత్రాన్ని తిరిగి చిత్రించి రంగులద్దిన బొమ్మ ఇది.. అప్పటి రోజుల్లో పత్రికల్లో పత్రికల్లో రంగుల ముద్రణ లేదు. నా చిత్రానికి శ్రీమతి  గుడిపూడి రాధికా రాణి గారి కవిత.                    కలకంఠి నీకంట
కన్నీరు రానీను
గుండెలో నీకొరకు
గూడొకటి కట్టాను

అరికాలు కందకనె
అబ్బురముగా చూతు
నీకాలిలో ముల్లు
నిలువునా నను చీల్చు

జాగుసేయక నేను
జాగ్రత్తగా తీసి
అపురూపముగ నిన్ను
అక్కునను జేర్చుకొన

నీకాలియందియలు
నీ మెట్టె సవ్వడులు
నిలువెల్ల మదినిండె
నినువీడి మనలేను
*********************
(**ఇష్టపదులు**
 గుడిపూడి రాధికారాణి.
శీర్షిక:రాధాగోపాళం
తేది:1.12.2019
ఇష్టపది సంఖ్య:236)
**********************

కామెంట్‌లు లేవు:

ఈ తరం అమ్మాయి - కథ

 శీర్షిక : " ఈ తరం అమ్మాయి " రచన:   భవానికుమారి బెల్లంకొండ (ఇది నా స్వీయ రచన. PVR  మూర్తి గారి రెండు స్కెచెస్ మీ ఆధారంగా రాసిన కథ)...