15, డిసెంబర్ 2019, ఆదివారం

పొట్టి శ్రీరాములు

Pencil sketch by me

ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవి యైన మహాపురుషుడు, పొట్టి శ్రీరాములు, ఆంధ్రులకు ప్రాత:. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనవాడు. మహాత్మా గాంధీ బోధించిన సత్యముఅహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాలకొరకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడు.

అది గొప్ప యౌకొకో! యపుడు వెన్నెముకను
దాన మిచ్చె ధధీచి మౌని యతడు!
యది యేమిఘనత! కాయము కోసి ఇచ్చెను
శిబి చక్రవర్తి ప్రసిద్దుడతడు!
అది యొక లెక్కయా? యడుగులు మూడుగా
ధరనిచ్చె బలియు వదాన్యుడతడు!
యది లెస్సయా? మేన ననఘళించిన సొమ్ము
లడుగ నిచ్చెను కర్ణు డగునె దాత
యనుచు స్వర్గపురీ రధ్యలందు సురలు
పొట్టి శ్రీరాముల యుదంతమును దలంచి
యక్కజంపడి తలయూచి యాడుభాష
లందగించెను మేఘగర్జాంతముల
~ సామవేదం జానకిరామ శర్మ

కామెంట్‌లు లేవు:

జయహనుమాన్ జయతి బలసాగర!

  జయహనుమాన్ జయతి బలసాగర! ~~~~~~~~🌸🌸🙏🌸🌸~~~~~ 1) ఉ॥ పుట్టుకతోనె కర్ణముల భూషణముల్ యుప వీతమున్, మొలన్  బొట్టము, శీర్షమందు ఘన బొమ్మికమున్,కట...