28, జనవరి 2020, మంగళవారం

కలలకు నిద్దుర..రాదని తెలుసా..!? - తెలుగు గజల్

కలలకు నిద్దుర..రాదని తెలుసా..!?
పగటికి పగలే..కాదని తెలుసా..!?

ఆశల వెన్నెల..నిలిపే దెవ్వరు..
రెంటికి తీరం..లేదని తెలుసా..!?

తనకై పరుగులు..పెట్టని దెవ్వరు..
కలతకు మనసే..చేదని తెలుసా..!?

అగ్నికి రెక్కలు..తొడిగే దెవ్వరు..
విరహపు మధువే..మందని తెలుసా..!?

దారిని ముక్కలు..చేసే దెవ్వరు..
కంటికి తీరిక..అవదని తెలుసా..!?

మాధవ గజలే..కోరే దెవ్వరు..
పదముల సంపద..'కల'దని తెలుసా..!?

(మిత్రులు శ్రీ మాధవరావు కొరుప్రోలు గారి గజల్ చదివాక గుర్తుకొచ్చిన నా చిత్రం. వారికి నా కృతజ్ఞతలు.)

27, జనవరి 2020, సోమవారం

ఎదురు చూపులు = కవిత







నా చిత్రానికి మిత్రులు రామకృష్న వారణాసి గారి కవిత

ఆశలతో ఎదురు చూసినప్పుడెల్లా
కన్న కలలన్నీ అడియాసలు జేస్తూ
నిట్టూర్పులే వెక్కిరిస్తూ నాకు
స్వాగతాలు పలికాయి ఎప్పుడూ!!!

స్వచ్ఛమైన నా ప్రేమకు
నీ ఛీత్కారాలే వినిపించావు!!!
నా జీవితం నీకే అర్పిస్తే
కాఠిణ్యంతో తిరస్కారాలే
మిగిల్చావు నాకు!!!

ప్రతీ క్షణం నీ అనుమతి కోసం
జీవితాన్ని హారతి కర్పూరంలా
కరిగించినా... కనికరంలేకుండా
అడుగడుగునా అవమానాలే
నిర్దయగా నాకు మిగిల్చావు!!!

అన్నీ నీవే అనే భ్రమతో
అనుబంధాలు పెంచుకొంటే,
అదే నా బలహీనతని తెలిసీ
నీ జ్ఞాపకాలే నీడల్లా మిగిల్చావు!!!

ఎన్నిమార్లు చదవాలో ... తెలుగు గజల్


నా చిత్రానికి మిత్రులు మాధవరావు కొరుప్రోలు గారి గజల్

ఎన్నిమార్లు చదవాలో..మధురమైన నీ రచనలు..!
అక్షరాల మన ప్రేమకు..సాక్ష్యమైన నీ రచనలు..!
కనులు మూతపడవు ఇంత..పలుకలేని మైమరపే..
అపురూపత వర్షించే..దివ్యమైన నీ రచనలు..!
అంతరంగ మౌనమేల..ఒదిగేనో వ్రాసేందుకు..
భువనాలను త్రిప్పిచూపు..కవనమైన నీ రచనలు..!
అనురాగం ఆత్మీయత..అల్లుకున్న భావనలా..
అద్దమంటి నీ మది ప్రతి..రూపమైన నీ రచనలు..!
పలకరించు నవపరిమళ..గంధాలే చిందేనా..
నిత్యచెలిమి కావ్యమంటి..అందమైన నీ రచనలు..!
మాధవుడా నీ గజలే..లోకాలకు ఊయలలే..
పదేపదే పాడుకోగ..సరసమైన నీ రచనలు..!

20, జనవరి 2020, సోమవారం

బందా కనకలింగేశ్వర రావు





బందా కనకలింగేశ్వర రావు గారు - నా pencil చిత్రం. వారి గురించి నేను సేకరించిన వివరాలు ఈ లింక్ క్లిక్ చేసి చదవండి.

https://www.facebook.com/photo.php?fbid=2574965492601337&set=a.208394439258466&type=3&theater


The power of 'Will' Usage - English grammar - illustration

  When we use will to make a promise 🤝 or an offer 💡, we are usually deciding to do something at the very moment we are speaking. It shows...