28, జనవరి 2020, మంగళవారం

కలలకు నిద్దుర..రాదని తెలుసా..!? - తెలుగు గజల్

కలలకు నిద్దుర..రాదని తెలుసా..!?
పగటికి పగలే..కాదని తెలుసా..!?

ఆశల వెన్నెల..నిలిపే దెవ్వరు..
రెంటికి తీరం..లేదని తెలుసా..!?

తనకై పరుగులు..పెట్టని దెవ్వరు..
కలతకు మనసే..చేదని తెలుసా..!?

అగ్నికి రెక్కలు..తొడిగే దెవ్వరు..
విరహపు మధువే..మందని తెలుసా..!?

దారిని ముక్కలు..చేసే దెవ్వరు..
కంటికి తీరిక..అవదని తెలుసా..!?

మాధవ గజలే..కోరే దెవ్వరు..
పదముల సంపద..'కల'దని తెలుసా..!?

(మిత్రులు శ్రీ మాధవరావు కొరుప్రోలు గారి గజల్ చదివాక గుర్తుకొచ్చిన నా చిత్రం. వారికి నా కృతజ్ఞతలు.)

కామెంట్‌లు లేవు:

పాలగుమ్మి పద్మరాజు -- రచయిత

 పాలగుమ్మి పద్మరాజు రచయిత -  పెన్సిల్ స్కెచ్ పాలగుమ్మి పద్మరాజు ( జూన్ 24 , 1915 - ఫిబ్రవరి 17 , 1983 ) ప్రముఖ తెలుగు రచయిత, కేంద్ర సాహిత్...