29, ఆగస్టు 2023, మంగళవారం

శంకరంబాడి సుందరాచారి - తెలుగు కవి - (charcoal pencil sketch)

                            Charcoal pencil sketch drawn by me



మా తెలుగు తల్లికి మల్లె పూదండా
మా కన్న తల్లికి మంగళారతులూ ॥మా తెలుగు॥
కడుపులో బంగారు కను చూపులో కరుణా
చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి ॥మా తెలుగు॥

గల గలా గోదారి కదలి పోతుంటేను ॥గల గలా॥
బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటే
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలు తాయి ॥మా తెలుగు॥


అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి యుండే దాక
రుద్రమ్మ భుజ శక్తి
మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి కృష్ణరాయని కీర్తి
మా చెవుల రింగుమని మారు మ్రోగే దాక
నీ పాటలే పాడుతాం
నీ ఆటలే ఆడుతాం


జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ!!



ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాష్ట్ర గీతమైన మా తెలుగుతల్లికి మల్లెపూదండ రచించిన శంకరంబాడి సుందరాచారి. 

సుందరాచారి 1914 ఆగస్ట్ 10వ తేదీన తిరుపతిలో జన్మించాడు. మాతృభాష తమిళం అయినప్పటికీ తెలుగుపై ఎంతో మక్కువ చూపేవాడు. మదనపల్లెలో ఇంటర్మీడియట్ వరకు చదివాడు. చిన్ననాటి నుండే స్వతంత్ర భావాలు కలిగి ఉండేవాడు. బ్రాహ్మణునిగా సంధ్యావందనం చేయడం అతనికి ఇష్టం లేదు. అందుకు తండ్రి మందలించగా జంధ్యం తెంపివేసాడు. తండ్రిపై కోపంతో పంతానికి పోయి, ఇళ్లు వదలి వెళ్లిపోయాడు.
 
పొట్టకూటి కోసం ఎన్నో పనులు చేసాడు. తిరుపతిలో హోటల్‌లో సర్వరుగా పని చేసాడు. రైల్వేస్టేషన్‌లో కూలీగా మారాడు. చివరకు పని కోసం మద్రాసు వెళ్లి ఆంధ్రపత్రికలో ఉద్యోగం సంపాదించాడు. అక్కడ పని చేస్తుండగా ఒక ప్రముఖునిపై వ్యాసం రాయవలసి వచ్చినప్పుడు, తాను వ్యక్తులపై వ్యాసాలు రాయనని భీష్మించుకుని ఉద్యోగానికి రాజీనామా చేసాడు. అటు పిమ్మట విద్యాశాఖలో పాఠశాల పర్యవేక్షకుడిగా చేరారు. నందనూరులో ఉండగా పాఠశాల సంచాలకుడు అతడిని బంట్రోతుగా పొరబడటంతో కోపగించిన ఆయన ఆ ఉద్యోగానికీ రాజీనామా చేసాడు. 

శంకరంబాడి సుందరాచారి గొప్పకవి. ఆయన పద్యాలు ఎక్కువ భాగం తేటగీతి ఛందస్సులోనే ఉంటాయి. ఎందుకంటే తేటగీతి అంటే ఆయనకు ఎంతో ఇష్టం. మా తెలుగుతల్లికి మల్లెపూదండ కూడా తేటగీతిలోనే వ్రాసారు. రాష్ట్ర చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని నాలుగు పద్యాలలో రమ్యంగా రచించాడు. ప్రఖ్యాత గాయకురాలు టంగుటూరి సూర్యకుమారి గ్రామఫోన్ రికార్డు కోసం ఆ పాటను మధురంగా పాడిన తరువాతనే ఆ గీతానికి గుర్తింపు లభించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆ గీతాన్ని రాష్ట్ర గీతంగా గుర్తించి గౌరవించింది.

మహాత్మాగాంధీ మరణానికి కలత చెంది బలిదానం అనే కావ్యాన్ని వ్రాసాడు. సుందర రామాయణం పేరుతో రామాయణం రచించాడు. అలాగే సుందర భారతం రచించాడు. తిరుమల వెంకటేశ్వరుని పేరుతో శ్రీనివాస శతకం వ్రాసాడు. రవీంద్రుని గీతాంజలిని తెలుగులోకి అనువదించాడు. అలాగే అనేక భావ గీతాలు, స్థల పురాణాలు, జానపద గీతాలు, ఖండకావ్యాలు, గ్రంథాలు రచించాడు. 

జీవితం చరమాంకంలో ఒక రకమైన నిర్లిప్త జీవితాన్ని గడిపాడు. త్రాగుడుకు అలవాటు పడి చివరకు తిరుపతిలో తాను నివాసం ఉంటున్న ఇంట్లోనే 1977 ఏప్రిల్ 8వ తేదీన మరణించాడు. 2004లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తిరుపతి-తిరుచానూరు రోడ్డులోని అన్నపూర్ణేశ్వరి సర్కిల్‌లో సుందరాచారి జ్ఞాపకార్థం, ఆయన కాంస్య విగ్రహాన్ని నెలకొల్పింది. అలా శంకరంబాడి శకం ముగిసినప్పటికీ ఆయన చేసిన రచనలు మనకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. 

(సౌజన్యం - వికీపీడియా, ఇంకా కొన్ని పత్రికలద్వారా సేకరించిన వివరాలు)
చిత్రం : నా స్వహస్తాలతో charcoal pencil తో వేసిన చిత్రమిది.




 

తెలుగు భాషా దినోత్సవం


 తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు...మరియు

గిడుగు రామ్మూర్తి గారి జయంతి.. (pencil sketch)


ౠప్రజల బాసకై సతతము పరితపించి

తెలుగు బాషకు చక్కటి వెలుగు జూపి

ఉద్యమాలను నడిపిన ఉన్నతుండు

అట్టి గిడుగు వారిని కొల్తు నహరహమ్ము...


ఉ౹నన్నయ 'సంప్రసన్న కలనా కధనార్ధ'మరంద మాధురీ

సన్నుత వాక్ప్రసూన తత సౌరభ డోలల శైశవమ్మునన్

మన్నన యూగి,తిక్క కవి మౌళి 'రసాభ్యుచిత ప్రబంధ' దీ

వ్యన్నవ భూష శింజితము లాశల జేరగ దోగియాడి,యె

ఱ్ఱన్న'రసోక్తి చిత్ర' మలయానిల యాత రజస్సుగంధ శ

శ్వన్నవ నందనాళి పరువమ్ములు పొంగ మనోహరాకృతిన్

పున్నమి వెన్నెలల్ విరియు ముగ్ధ మనోజ్ఞ సుహాస రేఖల

కన్నె గులాబి యౌవనపు కాంతులు జిమ్ము "త్రిలింగ భారతీ!!!"....


సీ౹ కృష్ణా తటీ కుక్షి కేదార సుఖ సుప్త

వీరగాధల నాలపింపుమమ్మ

గోదావరీ పావనోదార చలదూర్మి

కలగానముల గొంతు కలుపుమమ్మ

తుంగభద్రా సముత్తంగ భంగీ మృదం

గా రావముల వెంట నడపుమమ్మ

శశ్వత్పినాకినీ ఝణఝణన్మంజీర

మందు పదధ్వనుల నర్తింపుమమ్మ

తే౹గీ౹౹తావకానూన కరుణా కటాక్ష వీక్ష

లలమి నా పైన దీవింపుమా మదీయ

కావ్య బంధోల్లసత్ప్రసంగముల యందు

చతుర జయధాటి 'నాంధ్రభాషా'వధూటి


రచన

ఎస్.ఏ.టి.ఎస్.ఆచార్య,

సంస్కృతాధ్యాపకుడు,

శ్రీ చైతన్య..మెయిన్ కాంపస్,

హైదరాబాద్...


సేకరణ...

పొన్నాడ మూర్తి, విశాఖపట్న

27, ఆగస్టు 2023, ఆదివారం

మార్కస్ బార్ట్లే (Marcus Bartley) - Cinematographer - charcoal pencil sketch


Marcus Bartley (charcoal pencil sketch)


మార్కస్ బార్ట్లే ( Marcus Bartley) (జ.1917- మ.1993తెలుగు సినిమా రంగములో ప్రసిద్ధ ఛాయచిత్ర గ్రాహకుడు

మరిన్ని వివరాలు ఈ క్రింది లింక్ (courtesy : Wikipedia) చేసి ఈ మహా వ్యక్తి గురించి తెలుసుకోవచ్చు.


https://te.wikipedia.org/wiki/%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%95%E0%B0%B8%E0%B1%8D_%E0%B0%AC%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B2%E0%B1%87


26, ఆగస్టు 2023, శనివారం

సి. కె. నాయుడు - క్రికెట్ దిగ్గజం.


సి. కె. నాయుడుగా పేరు గాంచిన కొఠారి కనకయ్య నాయుడు భారత టెస్ట్ క్రికెట్  జట్టు తొలి కెప్టెన్.  పద్మభూషణ్ పురస్కారం అందుకొన్న తొలి క్రికెట్ ఆటగాడు, 1933లో విస్‌డెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అందుకున్నాడు.  భారత క్రికెట్ చరిత్రలో రెండు దశాబ్దాలు (1916-1936) నాయుడు యుగం గా ప్రసిద్ధి గాంచాయి.

నాయుడు 1895 అక్టోబర్ 31న నాగపూర్లో  ఒక తెలుగు కుటుంబములో జన్మించాడు. నాగపూర్లో పెరిగిన ఈయన పాఠశాల రోజులనుండే క్రికెట్ ఆటలో ఎంతో ప్రతిభ కనపరిచాడు. ఈయన ప్రథమ శ్రేణి క్రికెట్ ఆటలో ప్రవేశము 1916లో హిందూ జట్టులో, యూరోపియన్ జట్టుకు వ్యతిరేకముగా జరిగింది. ఈయన ఆ ఆటలో తమ జట్టు 79 పరుగులకు 7 వికెట్లు పడిన పరిస్థితిలో 9వ ఆటగాడిగా బ్యాటింగుకు దిగాడు. మొదటి మూడు బంతులు అడ్డుకొని, నాలుగో బంతిని సిక్సర్ కొట్టాడు. ఇలా మొదలైన ఈయన ప్రాబల్యం తన క్రీడాజీవితపు చివరినాళ్ల వరకు చెక్కుచెదరలేదు.

 ఈయన 1967 navaMbar 14న ఇండోర్ లో మరణించాడు.


24, ఆగస్టు 2023, గురువారం

తెలుగులెంక తుమ్మల సీతారామమూర్తి (charcoal pencil sketch)

 

తుమ్మల సీతారామమూర్తి


charcoal pencil sketcn

ఆయన్ని చూస్తే అచ్చం తెలుగు రైతులాగా వుండేవాడు కాని 'కవి వేషం' కనబడేది కాదు. ఆరడుగుల నల్లని విగ్రహం. పల్లెటూరి పెద్దరికం తొణికసలాడే నుదురు.  పొడుగైన ముక్కు. గుబురైన మీసాలు. ఖద్దరు దుస్తులు. ఆచితూచి మాటలు. సద్గుణాల ప్రోగు. ఆయన ఒక విషయంలో మాత్రం గర్వి ష్ఠి! తాను తెలుగు వాడైనందుకు ఆయన గర్విస్తాడు. తెలుగుజోదుల తుటారి కటారి చెలరేగి పగర చీల్చిన దినాన్ని జ్ఞప్తి చేసుకొని, పారతంత్య్రానికి, కులతత్వాలకు, ఈర్ష్యకులోనై, కుక్కలు చింపిన విస్తరిగా దేశాన్ని చేసిన ఆంధ్రజాతిని ఈసడించుకున్నాడు. రాష్ట్ర సిద్ధి కోసం 'రాష్ట్ర గానం' రచించి, రాష్ట్ర వృద్ధికోసం 'ఉదయగానం' ఆవిష్కరించాడు తుమ్మల.

గ్రామజీవనము, గాంధీతత్త్వము, సర్వోదయము, ఆంధ్రాభ్యుదయము, తిక్కన కవితామార్గము, చిన్నయసూరి సిద్ధాంతము ఆయనకు అభిమాన విషయాలు. తుమ్మల కవిత్వంలో గ్రామీణ జీవిత, ఆంధ్రత్వ, భారతీయత్వ, విశ్వమానవత్వ లక్షణాలుంటాయి. ఆయనది ప్రధానంగా ధర్మప్రబోధనాత్మక కవిత్వం. తాను తెలుగువాడననే అభిమానం ఆయనలో ఎక్కువ. తెలుగు జాతి, తెలుగు భాష, తెలుగు చరిత్ర, తెలుగు సంస్కృతి అంటే పులకించిపోయేవారాయన.

వీరి గురించి పలువురి అభిరాయాలు 'సంచిక' పత్రిక సౌజన్యంతో


https://sanchika.com/tummala-kanakabhisheka-sanmana-sanchika-14/

23, ఆగస్టు 2023, బుధవారం

ముత్తులక్ష్మి రెడ్డి


Muttulakshmi Reddi - Charcoal pencil sketch


ముత్తులక్ష్మి రెడ్డి గొప్ప సంఘ సంస్కర్త, విద్యావేత్త, రాజకీయ వేత్త, స్త్రీ హక్కుల ఉద్యమశీలి, భారతదేశపు మొదటి మహిళా శాసనసభ్యురాలు. .


ముత్తులక్ష్మి రెడ్డి గారు 1886వ సంవత్సరం జూలై నెల 30 వ తేదీన పుదుక్కోటై సంస్ఠానంలో నారాయణ సామి, చంద్రమ్మాళ్ దంపతులకు జన్మించారు. ఆడ పిల్లల చదువుకు ఆంక్షలు ఉన్న ఆ కాలం లోనే ముత్తులక్ష్మి రెడ్డి గారు 1912వ సంవత్సరంలో  మద్రాసు వైద్య కళాశాల నుండి వైద్య పట్టా అందుకున్నరు.


శ్రీమతి సరోజని నాయుడు గారి ప్రేరణతో వీరు స్త్రీల సామాజిక, ఆర్థిక, రాజకీయ ఉన్నతికై పోరాడారు. వీరి సేవలను మెచ్చి నాటి  మద్రాస్ రాష్ట్ర ప్రభుత్వము శాసన మండలి సభ్యురాలిగా వీరిని 1927వ సంవత్సరంలో నియమించారు. ఆ విధంగా భారతదేశపు మొట్ట మొదటి మహిళా శాసన సభ్యురాలయ్యారు. శాసన మండలి సభ్యురాలిగా దేవదాసీ విధాన రద్దు, కనీస వివాహ వయసు పెంపు, నిర్బంధ వ్యభిచారం రద్దు, బాలల హక్కుల రక్షణ తదితర విషయాలపై పోరాడారు. 1931వ సంవత్సరం అఖిల భారత మహిళల సదస్సు (ఆల్ ఇండియా విమెన్స్ కాన్ఫరెన్స్) కు అధ్యక్షత వహించారు. ఈ సదస్సు తరపున మహిళల ఓటు హక్కుకై పోరాడారు.   గాంధీ  గారిచ్చిన ఉప్పు సత్యాగ్రహ పిలుపుతో శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు.


(సౌజన్యం : వికీపీడియా)



త్రిపురనేని గోపీచంద్

.

సాహితీవేత్త, సినిమా దర్శకుడు త్రిపురనేని గోపీచంద్ .. నా charcoal pencil sketch.

ఈ మహనీయుని గురించి నేను సేకరించిన వివరాలు క్రింద పొందుపరుస్తున్నాను.

వీరి గురించి 

ప్రముఖ తెలుగు నవలా రచయిత త్రిపురనేని గోపీచంద్ కి  నవలా  సాహిత్యంలో  సుస్థిర స్థానాన్ని సాధించి పెట్టిన అసమర్థుని జీవయాత్ర తెలుగులో మెట్టమొదటి మనో వైజ్ఞానిక నవల. ఈ నవల 1945-46లో రాశారు. ఆంధ్రరభ దినపత్రిక ఆదివారపు సాహిత్యానుబంధాలలో సీరియల్‌ నవలగా వెలువడింది. 

వీరి గురించి సూర్య దినపత్రిక వారు వివరాణాత్మక వ్యాసం ప్రచురించారు. ఈ క్రింది లింక్ క్లిక్ చేసి చదవగలరు.
పత్రిక యాజమాన్యానికి నా ధన్యవాదాలు. 


 https://suryaa.co.in/tripuraneni-gopichand/

19, ఆగస్టు 2023, శనివారం

పద్మశ్రీ అన్నవరపు రామస్వామి - charcoal pencil sketch


My charcoal pencil sketch of Padmasri Annavarapur Ramaswamy, 

ఎందరో మహానుభావులను నా చిత్రలేఖనంలో తీర్చిదిద్దుతున్నాను. అందులో భాగంగా ఈనాడు వయొలిన్ విద్వాంసులు చిత్రం చిత్రీకరించాను.  వారి గురించి నేను సేకరించిన వివరాలు ఈ క్రిందన పొందుపరుస్తున్నాను.


అన్నవరపు రామస్వామి
 లేదా అన్నవరపు (మార్చి 231926) ఒక భారతీయ వాయోలిన్ విద్వాంసులు. ఆయన ప్రతిభకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2021 లో పద్మశ్రీ అవార్డ్ తో సత్కరించింది,  1996 లో ఈయనను సంగీత నాటక అకాడమీ పురస్కారంతో /సత్కరించింది.  ఆయన 1948 నుండి 1986 వరకు ఆల్ ఇండియా రేడియో (ఆకాశవాణి)కు తమ సేవలందించారు. 1988 లో, ఆల్-ఇండియా రేడియో (AIR) ఆయనను టాప్ గ్రేడ్ కర్ణాటక సంగీతకారుడిగా పేర్కొంది.[5] కర్ణాటక సంగీతకారులైన పారుపల్లి రామకృష్ణయ్య పాంతులుమంగళంపల్లి బాలమురళీకృష్ణఅరియకుడి రామానుజ అయ్యంగార్చెంబై వైద్యనాథ భాగవతార్, జి.ఎన్. బాలసుబ్రమణ్యం, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, టి.ఆర్.మహాలింగం, సుందరం బాలచందర్కు వాయులీన సహకారం అందించారు. ఆయన పండిట్ వినాయకరావు పట్వర్ధన్, పండిట్ భీమ్సేన్ జోషిపండిట్ జస్రాజ్ వంటి వివిధ హిందుస్తానీ సంగీతకారులకు వయోలిన్ సహకారం అందించారు. ఆయన సహకార వాద్యుడిగానేగాక స్వతంత్రంగా కూడా కచేరీలు చేశారు.

మరిన్ని వివరాలు ఈ క్రింది లింక్ క్లిక్ చేసి చదవండి.



8, ఆగస్టు 2023, మంగళవారం

ఆరుద్ర, తెలుగు కవి



ఆరుద్ర - charcoal pencil sketch 

ఆరుద్ర 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలో జన్మించాడు. విశాఖపట్నం ఎ.వి.యన్. కాలేజీ ఉన్నత పాఠశాల లో, తర్వాత విజయనగరంలో యం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు. క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‍లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. 1947-48 లో చెన్నై నుంచి వెలువడే వారపత్రిక ' ఆనందవాణి 'కి సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో శ్రీశ్రీ, చిత్తూరు బాలాజీ ఆరుద్ర వ్రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించాయి. అభ్యుదయ రచయితల సంఘం (అరసం) వ్యవస్థాపకుల్లో ఒకడైన ఆరుద్ర ఆ సంస్థ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఆరుద్ర మహాకవి శ్రీశ్రీ గారికి వేలువిడిచిన మేనల్లుడు. రచయిత చాగంటి సోమయాజులు (చాసో) మార్కిస్టు భావాలను నూరిపోశాడని, ఆరుద్ర కవితాధోరణిలో శ్రీశ్రీ ప్రభావం కొంతవరకూ ఉందని సాహితీ విమర్శకులు అంటారు.

6, ఆగస్టు 2023, ఆదివారం

బి. ఎన్. రెడ్డి


బి. ఎన్. రెడ్డి, charcoal pencil sketch. drawn by me.


బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి (బి.ఎన్.రెడ్డి) (నవంబర్ 161908 - నవంబర్ 81977) సినీ దర్శక నిర్మాత. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తొలి దక్షిణ భారతీయుడు. ఆయన సృష్టించిన మల్లీశ్వరి బహుళ ప్రజాదరణ పొందిన చిత్రం. బి.ఎన్.రెడ్డి తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తొలి దక్షిణ భారతీయుడు.[1] పద్మ భూషణ్ పురస్కార గ్రహీత.


మరిన్ని వివరాలు ఈ క్రింది లింక్ లో చదవండి. courtesy : Wikipedia


https://te.wikipedia.org/wiki/%E0%B0%AC%E0%B0%BF.%E0%B0%A8%E0%B0%BE%E0%B0%97%E0%B0%BF%E0%B0%B0%E0%B1%86%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B0%BF



డా. గోవిందరాజుల సుబ్బారావు



గోవిందరాజుల సుబ్బారావు - charcoal pencil sketch

డా. గోవిందరాజుల వెంకట సుబ్బారావు (1895 - 23 అక్టోబర్ 1959) ప్రముఖ తెలుగు నాటక మరియు  సినీరంగ ప్రముఖుడు.

గోవిందరాజు సుబ్బారావు తెలుగు సినిమాలలో, నాటకాలలో తొలితరం నటుడు. నాటక రంగంపై కన్యాశుల్కంలో లుబ్ధావధాన్లుగా, సినిమా రంగంలో మాలపిల్లలో సుందర రామశాస్త్రి పాత్రలోనూ, బాలనాగమ్మలో మాయల మరాఠీగానూ ప్రఖ్యాతుడయ్యాడు. రంగస్థలంపై అద్భుతమైన విజయాన్ని సాధించిన తరువాత, అతను మాలపిల్ల (1938) చిత్రంతో తెలుగు చలనచిత్ర రంగంలోకి ప్రవేశించాడు. తన 20 ఏళ్ల సినీ జీవితంలో డా.సుబ్బారావు 50కి పైగా చిత్రాల్లో నటించారు. అతను విజయవంతమైన వైద్య అభ్యాసకుడు కూడా.


(సేకరణ)

3, ఆగస్టు 2023, గురువారం

ఆదుర్తి సుబ్బారావు - తెలుగు సినిమా దర్శకుడు


ఆదుర్తి సుబ్బారావు - నా charcoal pencil sketch.


ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు. పలు విజయవంతమైన చిత్రాలు తెలుగు, హిందీ భాషలలో నిర్మించారు.


వారి గురించి వివరంగా ఈ క్రింద్ లింక్ క్లిక్ చేసి తెలుస్కోవచ్చు


https://te.wikipedia.org/wiki/%E0%B0%86%E0%A6%E0%B0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BF_%E0%B0%B8%E0%B1%81%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81

ఎన్టీఆర్ - చిత్రాలు, కవితలు

నిమ్మకూరు నందీ జగమున పుట్టి చలన చిత్ర సీమన అడుగు పెట్టి నటవిశ్వరూపము చాటి చూపెట్టి నటసార్వభౌమ బిరుదము చేపట్టి ఏకఛత్రమున ఏబదేండ్లు ఏలినట్టి జ...