My charcoal pencil sketch of Padmasri Annavarapur Ramaswamy,
ఎందరో మహానుభావులను నా చిత్రలేఖనంలో తీర్చిదిద్దుతున్నాను. అందులో భాగంగా ఈనాడు వయొలిన్ విద్వాంసులు చిత్రం చిత్రీకరించాను. వారి గురించి నేను సేకరించిన వివరాలు ఈ క్రిందన పొందుపరుస్తున్నాను.
అన్నవరపు రామస్వామి లేదా అన్నవరపు (మార్చి 23, 1926) ఒక భారతీయ వాయోలిన్ విద్వాంసులు. ఆయన ప్రతిభకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2021 లో పద్మశ్రీ అవార్డ్ తో సత్కరించింది, 1996 లో ఈయనను సంగీత నాటక అకాడమీ పురస్కారంతో /సత్కరించింది. ఆయన 1948 నుండి 1986 వరకు ఆల్ ఇండియా రేడియో (ఆకాశవాణి)కు తమ సేవలందించారు. 1988 లో, ఆల్-ఇండియా రేడియో (AIR) ఆయనను టాప్ గ్రేడ్ కర్ణాటక సంగీతకారుడిగా పేర్కొంది.[5] కర్ణాటక సంగీతకారులైన పారుపల్లి రామకృష్ణయ్య పాంతులు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, అరియకుడి రామానుజ అయ్యంగార్, చెంబై వైద్యనాథ భాగవతార్, జి.ఎన్. బాలసుబ్రమణ్యం, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, టి.ఆర్.మహాలింగం, సుందరం బాలచందర్కు వాయులీన సహకారం అందించారు. ఆయన పండిట్ వినాయకరావు పట్వర్ధన్, పండిట్ భీమ్సేన్ జోషి, పండిట్ జస్రాజ్ వంటి వివిధ హిందుస్తానీ సంగీతకారులకు వయోలిన్ సహకారం అందించారు. ఆయన సహకార వాద్యుడిగానేగాక స్వతంత్రంగా కూడా కచేరీలు చేశారు.
మరిన్ని వివరాలు ఈ క్రింది లింక్ క్లిక్ చేసి చదవండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి