29, ఆగస్టు 2023, మంగళవారం

తెలుగు భాషా దినోత్సవం


 తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు...మరియు

గిడుగు రామ్మూర్తి గారి జయంతి.. (pencil sketch)


ౠప్రజల బాసకై సతతము పరితపించి

తెలుగు బాషకు చక్కటి వెలుగు జూపి

ఉద్యమాలను నడిపిన ఉన్నతుండు

అట్టి గిడుగు వారిని కొల్తు నహరహమ్ము...


ఉ౹నన్నయ 'సంప్రసన్న కలనా కధనార్ధ'మరంద మాధురీ

సన్నుత వాక్ప్రసూన తత సౌరభ డోలల శైశవమ్మునన్

మన్నన యూగి,తిక్క కవి మౌళి 'రసాభ్యుచిత ప్రబంధ' దీ

వ్యన్నవ భూష శింజితము లాశల జేరగ దోగియాడి,యె

ఱ్ఱన్న'రసోక్తి చిత్ర' మలయానిల యాత రజస్సుగంధ శ

శ్వన్నవ నందనాళి పరువమ్ములు పొంగ మనోహరాకృతిన్

పున్నమి వెన్నెలల్ విరియు ముగ్ధ మనోజ్ఞ సుహాస రేఖల

కన్నె గులాబి యౌవనపు కాంతులు జిమ్ము "త్రిలింగ భారతీ!!!"....


సీ౹ కృష్ణా తటీ కుక్షి కేదార సుఖ సుప్త

వీరగాధల నాలపింపుమమ్మ

గోదావరీ పావనోదార చలదూర్మి

కలగానముల గొంతు కలుపుమమ్మ

తుంగభద్రా సముత్తంగ భంగీ మృదం

గా రావముల వెంట నడపుమమ్మ

శశ్వత్పినాకినీ ఝణఝణన్మంజీర

మందు పదధ్వనుల నర్తింపుమమ్మ

తే౹గీ౹౹తావకానూన కరుణా కటాక్ష వీక్ష

లలమి నా పైన దీవింపుమా మదీయ

కావ్య బంధోల్లసత్ప్రసంగముల యందు

చతుర జయధాటి 'నాంధ్రభాషా'వధూటి


రచన

ఎస్.ఏ.టి.ఎస్.ఆచార్య,

సంస్కృతాధ్యాపకుడు,

శ్రీ చైతన్య..మెయిన్ కాంపస్,

హైదరాబాద్...


సేకరణ...

పొన్నాడ మూర్తి, విశాఖపట్న

కామెంట్‌లు లేవు:

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...