23, మార్చి 2024, శనివారం

యామిజాల పద్మనాభస్వామి - బహుముఖ ప్రజ్ఞాశాలి, సంస్కృతాంధ్ర పండితుడు, స్వాతంత్ర్య సమర యోధుడు


నా పెన్సిల్ చిత్రం - (స్పష్టత లేని పురాతన  ఫోటో ఆధారంగా చిత్రీకరించిన చిత్రం)


యామిజాల పద్మనాభస్వామి బహుముఖ ప్రజ్ఞాశాలి, సంస్కృతాంధ్ర పండితుడు, స్వాతంత్ర్య సమర యోధుడు.

ఇతడు విజయనగరం  జిల్లా, గరుగుబిల్లి మండలం, శివరాంపురం గ్రామంలో 1915జూన్ 12వ తేదీన కామేశ్వరి, లక్ష్మీనరసింహశాస్త్రి దంపతులకు జన్మించాడు. ఇతని తండ్రి లక్ష్మీనరసింహశాస్త్రి నిరతాన్నదాతగా ఆ ప్రాంతంలో ప్రసిద్ధుడు. యామిజాల పద్మనాభస్వామి చాలా చిన్నవయసులోనే ఇంటివద్ద ఉండి దేవులపల్లి సీతారామశాస్త్రి వద్ద కాళిదాస త్రయం అభ్యసించాడు. తన స్వగ్రామానికి సమీపంలో ఉన్న జామిలో మోతికుర్తి సత్యనారాయణశాస్త్రి వద్ద కౌముది నేర్చుకున్నాడు. 1930లో కడియం  వెళ్లి చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి వద్ద రెండు సంవత్సరాలు శిష్యరికం చేసి కవిత్వ రహస్యాలు తెలుసుకున్నాడు. 1933లో విజయనగరం ప్ర్రాచ్యకళాశాలలో చేరి 1938వరకు అక్కడే చదివి ప్రాచ్యభాషా పట్టాను పొందాడు. ఆ సమయంలోనే   ఆదిభట్ల నారాయణదాసును   సేవించి జ్యోతిష శాస్త్ర పట్టులెన్నో గ్రహించాడు.  వారు  ఇతడిని కావ్యకంఠ గణపతిమునికి పరిచయం చేయగా అతనికి శుశ్రూష చేసి మంత్రశాస్త్రం నేర్చుకున్నాడు. 

గాంధీజీ ప్రభావం, తెన్నేటి విశ్వనాథం బాంధవ్యం ఇతడిని స్వాతంత్ర్యోద్యమం వైపుకు ఆకర్షించింది. స్వయంగా రచించిన దేశభక్తి గేయాలను, పద్యాలను పాడుతూ స్వైరవిహారం చేస్తున్న ఇతడిని ప్రాచ్యకళాశాలనుండి తొలగించారు. కానీ ప్రతిభావంతుడిని పోగొట్టుకోవడ ఇష్టం లేక తిరిగి విద్యార్థిగా చేర్చుకున్నారు. విశ్వదాత కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఇతనికి నెలనెలా విద్యార్థివేతనం ఇచ్చాడు. ఇతని కవితాశక్తి గురించి విన్న జయపురం మహారాజా ఇతడిని ఆహ్వానించి తన సంస్థానంలో ఆస్థానకవిగా నియమించాడు. అమరజీవి పొట్టి శ్రీరాములు  వెంట కొంతకాలం తిరిగి హరిజనసేవకు నిధులు సేకరించాడు. 1948లో  మద్రాసులోని  శ్రీరామకృష్ణ విద్యాసంస్థలలో ఆంధ్రోపాధ్యాయుడిగా ప్రవేశించి 1974లో పదవీ విరమణ చేశాడు. ఇతని సంపాదకత్వంలో మద్రాసు  నుండి అమృతవాణి అనే సాహిత్యమాసపత్రిక కొన్నాళ్లు వెలువడింది.


సౌజన్యం : వికీపీడియా 



13, మార్చి 2024, బుధవారం

నిరీక్షణ


"బొమ్మ నాది భావాలు మీవి" అనే శీర్షికకు  నా ఈ  చిత్రానికి బావుక ఫేస్బుక్ గ్రూప్ లో పలువురు తమ రచనలతో స్పందిస్తున్నారు. పైన ఇచ్చిన చిత్రానికి మీకు గాని ఫేస్బుక్ అకౌంట్ ఉంటే ఈ క్రింది లింక్ క్లిక్ చేసి చూడగలరు. ధన్యవాదాలు


https://www.facebook.com/share/p/H4oHt5pTzUYwDiA1/?mibextid=oFDknk

5, మార్చి 2024, మంగళవారం

మహాభాష్యం చిత్తరంజన్, రచయిత, సంగీత దర్శకుడు - charcoal pencil sketch


charcoal pencil sketch drawn by me.


చిత్రకారునిగా నేను ఈ రోజు చిత్రీకరించిన చిత్రం.


మహాభాష్యం చిత్తరంజన్ (1938 ఆగస్టు 25 - 2023 జూలై 21) ప్రముఖ లలిత గీతాల రచయిత , సంగీత దర్శకుడు. ఆయన ఆల్ ఇండియా రేడియో లో చాలాకాలం పనిచేశాడు. ఆకాశవాణిలో  ప్రసారమైన అనేక లలితగీతాలకు స్వరకల్పన చేశారు. నిజాం ప్రభుత్వ హయాంలోని దక్కన్‌ రేడియోలో పాడటం మొదలుపెట్టిన ఆయన ఆరు దశాబ్దాలకు పైగా లలిత సంగీతానికి సేవలందించారు . 1972లో ఆలిండియా రేడియోలో ‘ఏ’ గ్రేడ్‌ గాయకుడిగా గుర్తింపు పొందాడు. 2008లో ఆంధ్రప్రదేశ్‌ సాంస్కృతిక మండలి ఆయనను కళారత్న బిరుదుతో సత్కరించింది.


Credit : Wikipedia


మరిన్ని వివరాలు అంతర్జాలంలో చదివి తెలుసుకోగలరు. 


ధన్యవాదాలు 

-- పొన్నాడ మూర్తి 



3, మార్చి 2024, ఆదివారం

నీ హృదిపై వాలకనే...సేదతీరలేనులే - గజల్!


నా చిత్రానికి శ్రీ మాధవరావు కొరుప్రోలు గారు రచించిన గజల్యధాతధంగా. వారికి నా ధన్యవాదాలు


 @#పివిఆర్ మూర్తిగారికి హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్సుమాలతో వారి అపూర్వ చిత్రరాజమునకు స్పందనగా.. 🌹🙏🌹🌹🙏🌹😊😊👍💖🦜

5699..గజల్ 


నీ హృదిపై వాలకనే...సేదతీరలేనులే..! 

స్వర్గమేదొ ఇంకెచటో..అసలు వెతకలేనులే..! 


మాటలన్ని మూగబోయె..నిన్ను చేరినంతనే.. 

అక్షరాల ఈ హాయికి..స్వరము కూర్చలేనులే..! 


మీదపడే వయసువలన..పసితనమే వచ్చునో.. 

గుండెలోన దిగులుగూడు..కట్టి నిలుపలేనులే..! 


ఏలేసిన రసరాజ్యపు..సరిహద్దులు చెరుగునా.. 

జ్ఞాపకాల మధువనితో..చెలిమి వీడలేనులే..! 


నీవు తోడులేని వేళ..ఈ ఉనికియె మాయమో.. 

వలపువీణ రాగధునికి..సెలవు ఇవ్వలేనులే..! 


చిత్రమైన సంసారపు..మాయగాక గురువేది.. 

మరులవేణు రవములతో..రణము సల్పలేనులే..! 


మరిమాధవ హాసమదే..మనప్రేమకు జీవమోయ్.. 

పెదవులింటి అలజడులకు..సర్ది చెప్పలేనులే..!

2, మార్చి 2024, శనివారం

బెంగుళూరు నాగరత్నమ్మ

నా పెన్సిల్ చిత్రం 

బెంగుళూరు నాగరత్నమ్మ (నవంబరు 31878 - మే 191952) భరత నాట్యానికి, కర్ణాటక సంగీతమునకు, అంతరించిపోతున్న భారతదేశ కళ లకు ఎనలేని సేవ చేసి అజరామరమైన కీర్తి సాధించిన మహా వనిత. ఏటికి ఎదురీది, పట్టుదలతో తాదలచిన కార్యములు సాధించి తరువాయి తరముల మహిళలకు ఆదర్శప్రాయురాలైన గొప్ప విదుషీమణి. భోగినిగా జీవితము ఆరంభించి, తరువాత రాగిణిగా మారి, పిదప విరాగిణియై, చివరకు యోగినిగా తన బ్రతుకు ముగించింది.

మరిన్ని వివరాలు వికీపీడియా సౌజన్యంతో క్రింది లింకు క్లిక్ చేసి చదువగలరు. 


కె, విశ్వనాథ్ గారి "శంకరాభరణం " చిత్రానికి ప్రేరణ ఈమె జీవిత చరిత్రేనన్న కధనం   కూడా ఉంది. ఈ విషయం తెలిసాక నేను మరింత ఈమె గురించి శోధించాను. . 


నాగరత్నమ్మ ఫోటోలు చాలా తక్కువ. లభించిన ఫోటో ఆధారణంగా నా పెన్సిల్ సహాయంతో ఆమె చిత్రాన్ని చిత్రీకరించాను. కె, విశ్వనాథ్ గారి "శంకరాభరణం " చిత్రానికి ప్రేరణ ఈమె జీవిత చరిత్రేనన్న కధనం   కూడా ఉంది. ఈ విషయం తెలిసాక నేను మరింత ఈమె గురించి శోధించాను. . ఈ క్రింది లింకు తెరచి వీటికి సంబంధించిన విషయాలు మీరు కూడా తెలుసుకోవచ్చు. 

https://muchata.com/inspirational-story-of-sankarabharanam/

ధన్యవాదాలు 


 
 

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...