నా పెన్సిల్ చిత్రం
బెంగుళూరు నాగరత్నమ్మ (నవంబరు 3, 1878 - మే 19, 1952) భరత నాట్యానికి, కర్ణాటక సంగీతమునకు, అంతరించిపోతున్న భారతదేశ కళ లకు ఎనలేని సేవ చేసి అజరామరమైన కీర్తి సాధించిన మహా వనిత. ఏటికి ఎదురీది, పట్టుదలతో తాదలచిన కార్యములు సాధించి తరువాయి తరముల మహిళలకు ఆదర్శప్రాయురాలైన గొప్ప విదుషీమణి. భోగినిగా జీవితము ఆరంభించి, తరువాత రాగిణిగా మారి, పిదప విరాగిణియై, చివరకు యోగినిగా తన బ్రతుకు ముగించింది.
మరిన్ని వివరాలు వికీపీడియా సౌజన్యంతో క్రింది లింకు క్లిక్ చేసి చదువగలరు.
నాగరత్నమ్మ ఫోటోలు చాలా తక్కువ. లభించిన ఫోటో ఆధారణంగా నా పెన్సిల్ సహాయంతో ఆమె చిత్రాన్ని చిత్రీకరించాను. కె, విశ్వనాథ్ గారి "శంకరాభరణం " చిత్రానికి ప్రేరణ ఈమె జీవిత చరిత్రేనన్న కధనం కూడా ఉంది. ఈ విషయం తెలిసాక నేను మరింత ఈమె గురించి శోధించాను. . ఈ క్రింది లింకు తెరచి వీటికి సంబంధించిన విషయాలు మీరు కూడా తెలుసుకోవచ్చు.
https://muchata.com/inspirational-story-of-sankarabharanam/
ధన్యవాదాలు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి