28, జనవరి 2018, ఆదివారం

పుస్తకం

పుస్తకమొక్కటి చదివిన
మస్తకమందున విషయము మదినల రించున్
హస్తము నందది భూషణ

మస్తిత్త్వము కల్గుబుధులకందరి నడుమన్!! (FB లో Sri Kantharao Pulipaka గారి స్పందన)


సుప్రసిద్ధ ఉర్దూ కవి గుల్జార్ రాసినట్టు.. పుస్తకం పుటల మధ్య ఒత్తిగిలి దొరికే పూల సువాసనల పరిమళాలు, పుస్తకం జారిపడిందనో, పుస్తకం ఇచ్చిపుచ్చుకునే నెపం మీదో మాటలు కలిపి, ఏర్పరుచుకునే ప్రేమ బంధాలు ఇక కనిపించవేమో. ఆధునిక కాలంలో పుస్తక ప్రాధాన్యం తగ్గిపోవడాన్ని చూస్తూ కవి పడ్డ బాధ అది. (Mere Mehboob చిత్రంలో 'మేరే మెహబూబ్ తుఝే' పాటలో రాజేంద్రకుమార్-సాధన ల మధ్య చిత్రీకరించిన అద్భుత సన్నివేశం గుల్జార్ గారికి గుర్తుకి వచ్చిందేమో మరి!)

- పొన్నాడ మూర్తి


23, జనవరి 2018, మంగళవారం

సుభాష్ చంద్రబోస్ = నివాళి


నా కలం చిత్రం ద్వారా శుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా నా నివాళి.

"వేవేల తారల్లో ఏచోటనున్నా వేగిరమై నాకొరకు ఇలపైకి రావా"... కవిత


Pvr Murty గారి చిత్రం
ధన్యవాదాలతో అనూశ్రీ....
వేవేల తారల్లో ఏచోటనున్నా
వేగిరమై నాకొరకు ఇలపైకి రావా...
వేదనతో మది వేగిపోతోంది
వేడుకై నామదిని తడమగా లేవా...
వేచి ఉన్న మనసు తలచింది నిన్ను
వేణువై తీయగా పిలవగా లేవా....
వేంచేయు దారినే కాపు కాచెను చూపు
వేల కాంతులు కన్నుల్లొ నింపగాలేవా..
వేడుకుంటూ పరిమళాల స్తుతిస్తున్నవి నిన్ను
వేణిలో విరజాజుల సవరించ రావా.....!!
అనూశ్రీ

5, జనవరి 2018, శుక్రవారం

కొంటె గోపాల కొరి నిన్ను చెరితి రా కోరికలే తీర!



బాపు గారు వేసిన చిత్రాన్ని అనుకరిస్తూ సుమారు 20 సం.ల క్రితం నేను వేసుకున్న బొమ్మ. దీనిని పటం కట్టించి మా పెద్దమ్మాయికి ఇచ్చాను. ఇప్పుడు రంగులు కొంచెం fade అవుతున్నాయి. ఎందుకయినా మంచిదని photo తీసుకుని ఇలా నా బ్లాగులో బధ్రపరచుకుంటున్నాను. ఈ బొమ్మ కి facebook లో చక్కని కవిత రాసిన శ్రీ శ్రీనివాసమూర్తి గంజాం గారికి నా ధన్యవాదాలు.

కొంటె గోపాల
కొరి నిన్ను చెరితి రా 

కోరికలే తీర!

కోసరికొసరి ముద్దుకోర 
కసరి కొట్టినానని
కోప గించు కోకురా 
కామినీ చొర!

కలువ లాంటి కనులేమో
కలలు కనె నీ కోసము
కరిగి పోనీయకురా
కలలో నీ కౌగిలింత!

వెన్నపూస లాంటి మనసు
వన్నె చిన్నె లున్న సొగసు
వలపంతా నీకు తెలుసు
వేచి వుంది నా వయసు!

కొంగుపట్టి లాగకురా
కొంటె గోపాలా!

శ్రీనివాసమూర్తి గంజాం

27, డిసెంబర్ 2017, బుధవారం

ముగ్ధమందారం - కవిత



నా చిత్రానికి Anu Sree కవిత

ముగ్థమందారపు అందాలమోము
ముంగురుల అలల తేలే వేళ......
ముసినవ్వుల సింగారం మెత్తగా
మురిపించే పెదవుల రువ్వు వేళ...
ముసురుకున్న కలలన్నీ కన్నుల్లో చేరి
మూసి ఉన్న రెప్పల్లో మెదులు వేళ...
ముడిపడిన జడను ఒదగలేని విరులన్నీ
ముంచుకొచ్చే సిగ్గులల్లే బుగ్గల్లో చేరువేళ..
ముసుగు విడని మనసు బిడియాల ఒడిచేరి
ముచ్చటైన కాంతిలా మెరిసేటి వేళ...
మూగబోయిన రాగ మాలిక తీరు
ముత్యాల జల్లు మదిని కురిసేను ఈవేళ..
అనూశ్రీ...

26, డిసెంబర్ 2017, మంగళవారం

చిరునవ్వుకు సిగ్గేసి - కవిత రచన : అనుశ్రీ


'@[100002637341011:2048:Pvr Murty] గారి చిత్రం..

చిరునవ్వుకు సిగ్గేసి
అరచేతుల దాగింది...

బుగ్గల్లో కెంపురంగు
కన్నుల్లో మెరిసింది....

ఓపలేని బిడియాలు
చీరచెంగు ముడిని చేరి..

చిటికెడంత చిలిపితనం
చక్కదనమై నవ్వుతోంది...

సంతోషాల సమయాన
నేనెదురుచూచు తరుణాన..

యదలోని నీరూపం
ఎదురుగా నిలవగా...

ఆనందాల వెల్లువై
మురిసిపోతోంది మానసం...!!

     అనూశ్రీ...'
Pvr Murty గారి చిత్రం..

చిరునవ్వుకు సిగ్గేసి
అరచేతుల దాగింది...

బుగ్గల్లో కెంపురంగు
కన్నుల్లో మెరిసింది....

ఓపలేని బిడియాలు
చీరచెంగు ముడిని చేరి..

చిటికెడంత చిలిపితనం
చక్కదనమై నవ్వుతోంది...

సంతోషాల సమయాన
నేనెదురుచూచు తరుణాన..

యదలోని నీరూపం
ఎదురుగా నిలవగా...

ఆనందాల వెల్లువై
మురిసిపోతోంది మానసం...!!

అనూశ్రీ...

20, డిసెంబర్ 2017, బుధవారం

ప్రియతమా .....నీ నవ్వు .- కవిత




సోదరి Velamuri Luxmi నైరాశ్యపు కవితకి నా పెన్సిల్ చిత్రం.

ప్రియతమా .....నీ నవ్వు .

" అంతే లేని ఆలోచన సాగి పోయింది ......
ఏదో రహస్యం నన్నావరించుకుంది .....
ఏమీ తోచక భయంతో కళ్లు మూసుకున్నాను .....
అపుడు ...నీ నవ్వు ....నా గుండె క్రింద వినపడింది .....
రెప్ప రెప్పనీ తడిపింది .....కన్నీటి చుక్క... 
నాకే ఎరుగని నా మనస్సు నాలోనే చెదిరింది ....
ఆకాశపు అంచులో ...వొంపులో ....ఆర్ద్రత వెనుక ....
క్షితిజ రేఖపై నీ నవ్వు వినిపించింది .....
పాతాళ లోకాల్లో ...ప్రతిధ్వనించ సాగింది ......
అంధకారపు సంద్రానికి ఆవలి వొడ్దున నీ రూపం .....
అస్పష్టంగా అగుపించింది ....అగుపించింది .....
అందుకో లేని నిన్ను నా చూపు ఆశగా ..ఆశగా చూసింది ....
తరతరాల నిస్ప్రుహ నన్నావహించింది .....
నాకే తెలియని రహస్యం నన్ను తన వశం చేసుకుంది ......
నిదురలో ..కంటికొస నుంచి కన్నీటి చుక్క రాలినట్టుగా .....
నా.....కలం లోంచి ....శిరా జాలువారుతోంది .....
ఏవో సవ్వడులు నాలో నాకే వినిపిస్తున్నాయి .....
మ్రుత్యువనే .....మైదానం ...పిలుస్తోంది .....
నిన్ను విడచి మనస్సు రానని మొరాయిస్థొంది .....
ఒక వెన్నెల బిందువు కొబ్బరి మొవ్వలోకి జారింది .....
ఆ నాటి తీపి గురుతులు ....గురుతొస్తున్నాయి ..మేమున్నామంటూ ....
ఆ నాటి స్వప్న వంశీ రవమ్ములు వినిపిస్తున్నాయి .....
మనం నడచిన దారికీ తెలుసు ...
మనం చెప్పుకున్న రహస్యాలు .....
విచ్చుకుంటున్న మల్లెలకూ తెలుసు....
మన గుస గుసలు .....
వూరి చివరనున్న మామిడి తోపుకూ తెలుసు..... 
మనం దాని క్రింద కూచుని కన్న కలలు .....
మన ఇంటివెనుక నున్న గన్నేరు చెట్టుకూ తెలుసు .....
సంజె కెంజాయల ముసురులలో .....
కలిసిన మన పెదవుల నిశ్వాసాలు .....
ఎక్కడ ప్రియతమా ....వుమర్ ఖయ్యాం రుబాయీలు .....
ఎక్కడ గాలిబ్ గీతాల్లాంటి ....ప్రేమ పలుకులు ......
ఎవరు హరియించారు ప్రియతమా ......
నాటి హేమంత శైత్యానికి .....కాదు ...
నీ నిరాకరణ పైత్యానికి ....గడ్డ కట్టిన నా మనస్సు .....
కేవలం ......నాటి వసంత విహారాలు ....
తలచుకుంటూ .......అవైనా మిగిలాయని ....
ఒక్క జీవ కణం రగిలి త్రుప్తి పడుతోంది .....నా మనస్సు.... 
పగిలిన నా హ్రుదయం.... 
కానీ నీ నవ్వు ....నా గుండెని చీలుస్తోంది ....
ప్రియతమా ....ఎంత నిర్దయ....."

పాలగుమ్మి పద్మరాజు -- రచయిత

 పాలగుమ్మి పద్మరాజు రచయిత -  పెన్సిల్ స్కెచ్ పాలగుమ్మి పద్మరాజు ( జూన్ 24 , 1915 - ఫిబ్రవరి 17 , 1983 ) ప్రముఖ తెలుగు రచయిత, కేంద్ర సాహిత్...