30, డిసెంబర్ 2013, సోమవారం
28, డిసెంబర్ 2013, శనివారం
ప|| కానరటె పెంచరటె కటకట బిడ్డలను | నేను మీవలెనే కంటి నెయ్యమైన బిడ్డని
ఈ కీర్తనలో యశోద తన కొడుకు అల్లరి పనులను మాత్రు మమకారంతో ఎలా సమర్దిస్తోందో చూడండి. అన్నమయ్య ఎంత లోతుగా ఆలోచించి సహజమైన మాత్రు మమకారాన్ని యశోదకి ఎంత చక్కగా అన్వయించాడో!!
మీరు పిల్లల్ని కనలేదా? పెంచాలేదా?? నేనూ మీవలనే బిడ్డని కన్నాను. పెంచుతున్నాను.
పైన పెట్టిన పాలు వెన్నలలో చిన్న పిల్లలు చేయి పెట్టకుండా ఉంటారా? మీ జాగ్రత్తలు మీరు చూసుకోక అనవసరంగా పసి బిడ్డని నిందిస్త...ున్నారు. మూసిన కాగుల నెయ్యి, ముందటి పెరుగులు ఆశపడకుండా ఉంటారా ఆడుకునే పిల్లలు? మీరు గోరంతలు కొండతలు చేసి నా బిడ్డని ఆడిపోసుకుంటున్నారు. జున్నులు. జిన్నులు దొరికితే వదులుతారా చిన్నపిల్లలు? పూజలు చేసి మెప్పించవచ్చు కదా వేంకటేశుడు అయిన బిడ్డని. ఇదండీ అన్నమయ్య ఆంతర్యం!
ప|| కానరటె పెంచరటె కటకట బిడ్డలను | నేను మీవలెనే కంటి నెయ్యమైన బిడ్డని
చ|| బాయిట బారవేసిన పాలు వెన్నలును | చేయి వెట్టకుందురా చిన్నిబిడ్డలు |
మీయిండ్లు జతనాలు మీరుసేసికొనక | పాయక దూరేరేల ప్రతిలేని బిడ్డను ||
చ|| మూసిన కాగులనే యీముంగిట పెరుగులూ | ఆశపడకుందురా ఆబిడ్డలు |
వోసరించి మోసపోక వుండలేక మీరు | సేసేరింతేని దూరు చెప్పరాని బిడ్డని ||
చ|| చొక్కమైన కొప్పెరల జున్నులు జిన్నులును | చిక్కిన విడుతురా చిన్నిబిడ్డలు |
మిక్కిలి పూజలుసేసి మెచ్చ్చించదగదా | యెక్కువైన తిరువేంకటేశుడైన బిడ్డని ||
(courtesy: శ్రీమతి పొన్నాడ లక్ష్మి)

27, డిసెంబర్ 2013, శుక్రవారం
26, డిసెంబర్ 2013, గురువారం
Post : courtesy Smt. Ponnada Lakshmi in facebook.
అర్జునుడు ద్వారకనుండి వచ్చి ధర్మజునితో శ్రీకృష్ణ నిర్యాణం వార్తా తెలియబరుస్తూ చెప్పిన పద్యం.
చెలికాడ! రమ్మని చీరు నన్నొకవేళ మన్నించు నొకవేళ మరది యనుచు
బంధుభావంబున బాటించు నొకవేళ దాతవై యొకవేళ ధనము లిచ్చు ,
మంత్రియై యొకవేళ మంత్ర మాదేసించు, బోధి యై యొకవేళ బుద్ధిసెప్పు,
సారధ్య మొనరించు జన విచ్చి యొకవేళ గ్రీడించు... నొకవేళ , గెలిసేయు,
నొక్క సయ్యాసనంబున నుండు గన్న తండ్రి కైవడి జేసిన తప్పు గాచు,
హస్తములు వట్టి పొత్తున నారగించు, మనుజవల్లభ! మాధవు మరవ రాదు.
శ్రీకృష్ణునికి తనపై గల అభిమానం, వాత్సల్యం, చనువు తలచుకుని అర్జునుడు దుఖిస్తాడు. ఒకమాటు చెలికాడా అని ఆత్మీయంగా పిలిచి, ఒకమాటు గురువై కర్తవ్యాన్ని బోధించి, ఇంకొకమాటు మంత్రియై హితోపదేశం చేసి, మరొకమాటు ఒక శయ్యపై కూర్చోబెట్టుకుని కన్నతండ్రి వలె తప్పులు సరిదిద్ది ఆదరించేవాడు. అటువంటి మాధవుని మరచిపోవడం ఎలా అని విచారిస్తాడు.
ఇంచుమించు ఇదే భావం అన్నమయ్య ఈ కీర్తనలో వ్యక్తీకిరించాడు:
వేరొక్కరూ లేరు విశ్వమంతా నీ మహిమే
ఏ రీతి నీవే కలవు ఇతరము లేదు !!
తల్లివై రక్షింతువు తండ్రివై పోషింతువు
ఇల్లాలివై మోహం ఇత్తువు నాకు
వొళ్లయిపెరుగుదువు ఒగి పొర వ్రతమవుదువు
ఇల్లుమున్గిలై ఉందువు ఇంతా నీ మహిమే !!
గురుడవై బోధింతువు కొడుకువై ఈడేర్తువు
అరుదై నిదానమౌ అవుదువు నీవే
దొరవై నన్నేలుదువు దూతవై పనిచేయుదువు
ఇరవై సిరులిత్తువు ఇంతా నీ మహిమే !!
దేవుడవై పూజగొందువు దిక్కు ప్రాణమవుదువు
కావలసినట్లవుదువు కామిన్చినట్లు
శ్రీ వెంకటేశ నీవే చిత్తము లోపలినుండి
ఈవల వైకుంఠమిత్తువు ఇంతా నీ మహిమే !!

21, డిసెంబర్ 2013, శనివారం
బమ్మెర పోతన భాగవతం లో ఓ పద్యం facebook లో పోస్ట్ చేస్తూ నా శ్రీమతి పొన్నాడ లక్ష్మి చేసిన వ్యాఖ్య:
పుట్టంధుడవు, పెద్దవాడవు, మహాభోన్గంబులా లేవు, నీ
పట్టేలం జెడిపోయె; దుస్సహ జరాభారంబు ఫైగప్పె, నీ
చుట్టాలెల్లను బోయి; రాలు మగడున్ శోకంబునన్ మగ్నులై
కట్టా! దాయాల పంచ నుండదగవే గౌరవ్యవంశాగ్రాణీ
(పోతన మహాకవి పద్యం, భాగవతం)
వార్ధక్యం పైబడి, జవసత్వాలు ఉడిగిపోయి, వైభావాలన్నీ అంతరించిపోయి, దాయాదుల పంచన కాలం గడుపుతున్న ధృతరాష్ట్రునితో విదురుడు పలికిన పలుకులివి. విదురిని చేత చెప్పించుకుంటే గాని ధృతరాష్ట్రుని జ్ఞాననేత్రం విప్పారలేదు. విపత్కర పరిస్థితులలో కూడా వ్యామోహాన్ని చంపుకోలేక, జ్ఞానవైరాగ్య మార్గాలని అవలంబించుకోలేక మదనపడే వారికి చక్కని సందేశం ఇది.

నా శ్రీమతి పొన్నాడ లక్ష్మి facebook లో చేసిన పోస్ట్. నా శ్రీమతి అన్నమయ్య అభిమాని:
శ్రీ మహావిష్ణువు చుట్టరికాలు
పరమాత్ముడు ఎవరికీ ఏవిధంగా చుట్టమో ఈ కీర్తనలో అన్నమయ్య చాలా అందంగా విశదీకరించాడు.
లక్ష్మీదేవికి భర్త, సముద్రునికి అల్లుడు, బ్రహ్మకి తండ్రి, పార్వతికి సోదరుడు, శివునికి బావ, దేవేంద్రునికి అనుజుడు, చంద్రునికి బావమరిది, అదితికి కొడుకు, సురాసురాలకు తాత, ప్రాణులన్నిటికీ బంధువు, వాణికి మామగారు. ఇంతటితో ఆగక మనతో కూడా చుట్టరింకం కలుపుకోవడానికి వేంకటాచల రమణుడుగా తిరుమల గిరిమ...ీద వెలసి వున్నాడు.
కీర్తన
తలచిచూడ పరతత్వంబితడు
వలసినవారికి వరదుడితడు
సిరికి మగడమృతసింధువునకు నల్లుడు
సరుస పార్వతికి సయిదోడు
గరిమెల బ్రహ్మకుఁ గన్న తండ్రి యితడు
పరగి శివునకు బావ యితడు
అల దేవేంద్రుని యనుజుడితడు
మలసి చంద్రుని మఱదితడు
కులమున నదితికి కొడుకూ నితడు
తలపు సురాసురలతాతయు నితడు
ప్రాణుల కెల్లా బంధుడితడు
వాణికి మామగు వావి యితడు
జాణ శ్రీవేంకటాచల రమణుడితడు
మాణికపు మన్మథుడితడు

18, డిసెంబర్ 2013, బుధవారం
17, డిసెంబర్ 2013, మంగళవారం
Rajkapoor - My pencil sketch
చరిత్ర సృష్టించిన అలనాటి మహానటుడు, దర్శకుడు
రాజ్ కపూర్ కి తెలుగు వారితో కూడా అనుబంధం వుంది. వీరు నిర్మించిన ‘ఆహ్’
చిత్రం తెలుగులో ‘ప్రేమలేఖలు’ పేరుతొ అనువదించారు. ఈ చిత్రం
తెలుగులో ఘన విజయం సాధించింది. ఈ చిత్రంలో పాటలు ‘ఎకాంతమో సాయంత్రమో’, ‘పందిట్లో
పెళ్లవుతున్నది’ ‘పాడు జీవితమో యవ్వనం’
వంటి పాటలు తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఈ చిత్రానికి శంకర్
జైకిషన్ సంగీతం సమకూర్చారు. ఆ రోజుల్లో కూడా సినీ కవులకి పారితోషకం ఎగవెయ్యడంలో
కొందరు నిర్మాతలు సిద్ధహస్తులు. కాని రాజ్ కపూర్ గారు ఈ పాటలు వ్రాసిన
ఆరుద్రగారికి తన స్వహస్తాలతో చెక్కు రూపేణ కొంచెం
పెద్ద మొత్తానికే పారితోషకం అందించి కృతజ్ఞతలు తెలుపుకున్నారట! రాజ్ కాపూర్
గారి ఔదార్యం గురించి ప్రస్తావిస్తూ ప్రముఖ రచయిత్రి, ఆరుద్ర గారి సతీమణి కే. రామలక్ష్మి గారు ఒక వ్యాసం లో
తెలియబరిచారు.
5, డిసెంబర్ 2013, గురువారం
1, డిసెంబర్ 2013, ఆదివారం
గత ఆదివారం పిక్నిక్ లో ప్రఖ్యాత రచయిత గన్నవరపు నరసింహమూర్తి గారి పరిచయ భాగ్యం కలిగింది. వారి రెండు కదా సంపుటాలతో పాటు 'మా కధలు 2012' పుస్తకాలు బహుకరించారు. వీరివి ఓ రెండు కధలు చదివాను. సరళమయిన భాషలో మధ్యతరగతి కుటుంబాల ఒడిదుడుకులని చక్కగా వ్రాసారు. మన facebook మిత్రురాలు ప్రఖ్యాత రచయిత్రి శ్రీమతి Sammeta Umadevi గారి 'వాన' కధ కూడా చదివాను. మంచి ఉపమానాలతో తెలంగాణా మాండలీక సంభాషణలతో ఆద్యంతం ఆసక్తిగా సాగింది ఈ కధ. మీరూ చదవండి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
పండు వాళ్ళ నాన్న - కథ
నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న' 'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...
-
మిత్రులు మాధవరావు కొరుప్రోలు గారు రచించిన గజల్ : పలుకుతేనె పాటలలో..రాశి పో''సినారె'' భళారే..! తెలుగువీణియ శృతి..తెల...
-
Dr. C. Narayana Reddy - My pencil sketch పద్మభూషణ్ జ్ఞానపీఠఅవార్డ్ గ్రహీత డా. సి.నా.రె వర్థంతి నాడు వారికి అంజలి ఘటిస్తూ రచనలనుండి కొ...
-
పద్మభూషణ్ జ్ఞానపీఠఅవార్డ్ గ్రహీత డా. సి.నా.రె కి అంజలి ఘటిస్తూ రచనలనుండి కొన్ని భాగాలు ప్రపంచ పదులు ➿➿➿➿➿➿➿ సముద్రానికి చమురు పూస్తే నల్ల ...