28, డిసెంబర్ 2013, శనివారం

ప|| కానరటె పెంచరటె కటకట బిడ్డలను | నేను మీవలెనే కంటి నెయ్యమైన బిడ్డని

ఈ కీర్తనలో యశోద తన కొడుకు అల్లరి పనులను మాత్రు మమకారంతో ఎలా సమర్దిస్తోందో చూడండి. అన్నమయ్య ఎంత లోతుగా ఆలోచించి సహజమైన మాత్రు మమకారాన్ని యశోదకి ఎంత చక్కగా అన్వయించాడో!!

మీరు పిల్లల్ని కనలేదా? పెంచాలేదా?? నేనూ మీవలనే బిడ్డని కన్నాను. పెంచుతున్నాను.
పైన పెట్టిన పాలు వెన్నలలో చిన్న పిల్లలు చేయి పెట్టకుండా ఉంటారా? మీ జాగ్రత్తలు మీరు చూసుకోక అనవసరంగా పసి బిడ్డని నిందిస్త...ున్నారు. మూసిన కాగుల నెయ్యి, ముందటి పెరుగులు ఆశపడకుండా ఉంటారా ఆడుకునే పిల్లలు? మీరు గోరంతలు కొండతలు చేసి నా బిడ్డని ఆడిపోసుకుంటున్నారు. జున్నులు. జిన్నులు దొరికితే వదులుతారా చిన్నపిల్లలు? పూజలు చేసి మెప్పించవచ్చు కదా వేంకటేశుడు అయిన బిడ్డని. ఇదండీ అన్నమయ్య ఆంతర్యం!

ప|| కానరటె పెంచరటె కటకట బిడ్డలను | నేను మీవలెనే కంటి నెయ్యమైన బిడ్డని

 చ|| బాయిట బారవేసిన పాలు వెన్నలును | చేయి వెట్టకుందురా చిన్నిబిడ్డలు |
మీయిండ్లు జతనాలు మీరుసేసికొనక | పాయక దూరేరేల ప్రతిలేని బిడ్డను ||


చ|| మూసిన కాగులనే యీముంగిట పెరుగులూ | ఆశపడకుందురా ఆబిడ్డలు |
వోసరించి మోసపోక వుండలేక మీరు | సేసేరింతేని దూరు చెప్పరాని బిడ్డని ||

చ|| చొక్కమైన కొప్పెరల జున్నులు జిన్నులును | చిక్కిన విడుతురా చిన్నిబిడ్డలు |
మిక్కిలి పూజలుసేసి మెచ్చ్చించదగదా | యెక్కువైన తిరువేంకటేశుడైన బిడ్డని ||
 
(courtesy: శ్రీమతి పొన్నాడ లక్ష్మి)

కామెంట్‌లు లేవు:

కెరటాలు వేరనీ సాగరం వేరనీ ఆలోచనే తప్పు! - తెలుగు గజల్

 ॥తాజా గజల్॥  నా pencil చిత్రానికి Dr. ఉమాదేవి గారి గజల్ ~~~~🔹🔸🔹~~~~ కెరటాలు వేరనీ సాగరం వేరనీ ఆలోచనే తప్పు! పోరాట మేలేని జీవితం కోసమై అన...