21, డిసెంబర్ 2013, శనివారం

నా శ్రీమతి పొన్నాడ లక్ష్మి facebook లో చేసిన పోస్ట్. నా శ్రీమతి అన్నమయ్య అభిమాని:

శ్రీ మహావిష్ణువు చుట్టరికాలు
పరమాత్ముడు ఎవరికీ ఏవిధంగా చుట్టమో ఈ కీర్తనలో అన్నమయ్య చాలా అందంగా విశదీకరించాడు.
లక్ష్మీదేవికి భర్త, సముద్రునికి అల్లుడు, బ్రహ్మకి తండ్రి, పార్వతికి సోదరుడు, శివునికి బావ, దేవేంద్రునికి అనుజుడు, చంద్రునికి బావమరిది, అదితికి కొడుకు, సురాసురాలకు తాత, ప్రాణులన్నిటికీ బంధువు, వాణికి మామగారు. ఇంతటితో ఆగక మనతో కూడా చుట్టరింకం కలుపుకోవడానికి వేంకటాచల రమణుడుగా తిరుమల గిరిమ...ీద వెలసి వున్నాడు.
కీర్తన
తలచిచూడ పరతత్వంబితడు
వలసినవారికి వరదుడితడు

సిరికి మగడమృతసింధువునకు నల్లుడు
సరుస పార్వతికి సయిదోడు
గరిమెల బ్రహ్మకుఁ గన్న తండ్రి యితడు
పరగి శివునకు బావ యితడు

అల దేవేంద్రుని యనుజుడితడు
మలసి చంద్రుని మఱదితడు
కులమున నదితికి కొడుకూ నితడు
తలపు సురాసురలతాతయు నితడు

ప్రాణుల కెల్లా బంధుడితడు
వాణికి మామగు వావి యితడు
జాణ శ్రీవేంకటాచల రమణుడితడు
మాణికపు మన్మథుడితడు

కామెంట్‌లు లేవు:

ఈ తరం అమ్మాయి - కథ

 శీర్షిక : " ఈ తరం అమ్మాయి " రచన:   భవానికుమారి బెల్లంకొండ (ఇది నా స్వీయ రచన. PVR  మూర్తి గారి రెండు స్కెచెస్ మీ ఆధారంగా రాసిన కథ)...