6, డిసెంబర్ 2015, ఆదివారం

మహానటి సావిత్రి - ఆటవెలది పద్యాల రచన శ్రీమతి శశికళ వోలేటి



ఆటవెలదులు::::::

1.పల్లవించె నచట పావురమును బ్రోలు,
పంచ వన్నె చిలుక వగలు లొలక.
సీమ మరచి పోయె సినిమా ప్రపంచము,
ఎల్ల లెరుగ నికళ లెంచ జూడ.
2. రాజ్ఞి వోలె నేలె రస రమ్య నటనతో,
రాశి పోసిన సొగసు రాచ జన్మె.
రారు ఎవరిక సరి, 'రావు'లందరి సిరి.
నవ రస ముల కెలవు నవ్వు మోము.
3. అన్య భాష లందు అన్నన్ని పాత్రలు,
ఆమె కొరకె వ్రాయ యలసి పోయె.
విధికి కన్ను గుట్టె వేదన మొదలాయె.
మధువు నాశ్రయించె మనసు కుదుర.
4. చేతి కెముక లేక చేజారె కృషియంత,
నటియె కాదు వితరణ మదె గనుమ.
వెలుగు నీడల బ్రతుకు న్వెలసి పోయె వెలుగు.
జాతి కొదలి పోయె చాల చరిత్ర.
5. కులుకు మిస్సు, చూడు గుండమ్మ కూతురు.
మాయ శశిగ మనల మాయ జేయు.
నవ రసము లను గను నవరాత్రి యందునా,
నటనకు చిరు నామ నాయి కామె.
6. వెండి తెరల పైన మెండైన నాయకీ
కండ్ల బాస తోనే కలలు రేపె.
కల్ల లాయె గాద కలహంస కలలన్ని
నేడు, నాడు, రేపు నెపుడు నామె!!!
7. కోట్ల జనుల మదిని కొల్ల గొట్టి యిలను,
సావిత్రి ముద్ర కైవ సమును కాగ,
ముద్దు లొలుకు ముదిత మోము మరవ లేము.
చలన చిత్రము చివరి ఛాయ యామె.
- శశికళ వోలేటి

2 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

మహానటి సావిత్రి గారి పుట్టినరోజు, మరణించినరోజు రెండూ డిసెంబర్ నెలలోనే కదా.
శ్రీమతి శశికళ వోలేటి గారు తగిన నివాళి వ్రాసారు. మీరు గీసిన చిత్రం బాగుంది.

Ponnada Murty చెప్పారు...

ధన్యవాదాలండీ

యామిజాల పద్మనాభస్వామి - బహుముఖ ప్రజ్ఞాశాలి, సంస్కృతాంధ్ర పండితుడు, స్వాతంత్ర్య సమర యోధుడు

నా పెన్సిల్ చిత్రం - (స్పష్టత లేని పురాతన  ఫోటో ఆధారంగా చిత్రీకరించిన చిత్రం) యామిజాల పద్మనాభస్వామి  బహుముఖ ప్రజ్ఞాశాలి, సంస్కృతాంధ్ర పండితు...