30, నవంబర్ 2016, బుధవారం

డా. బాలమురళి కృష్ణ - pen sketch


మనవడు మృదంగం వాయిస్తుంటే ముసిముసి నవ్వులతో తన్మయత్వం చెందుతున్న ఇటీవల భువినుండి దివికేగిన కర్ణాటక సంగీత కళానిధి డా. బాలమురళి కృష్ణ - నా pen చిత్రం.

29, నవంబర్ 2016, మంగళవారం

విజయరాఘవ రావు - పెన్సిల్ చిత్రం


ఈ రోజు తెలుగువారు గర్వించదగ్గ బహుముఖ ప్రజ్ఞాశాలి విజయరాఘవ రావు గారి వర్ధంతి. వారిని స్మరించుకుంటూ నేను వేసుకున్న పెన్సిల్ చిత్రం. అప్పటిరోజుల్లో సినిమా ప్రదర్శనకి ముందు సినిమా హాళ్ళలో news reel, documentaries ప్రదర్శించేవారు. Documentary titles లో సంగీతం సమకూర్చిన వారుగా 'విజయరాఘవ రావు' గారి పేరు కనిపించేది. వీరు ఎన్నో documentaries కి సంగీతం సమకూర్చారు. టూకీగా వారి గురుంచి నేను సేకరించిన వివరాలు క్రింద పొందుపరుస్తున్నాను.

My pencil work of Pandit Vijaya Raghava Rao on the eve of his death anniversary on Nov. 30. My tribute.
He was an Indian flutist, composer, choreographer, musicologist, poet, fiction writer, etc. He was awarded the Padma Sri by Govt. of India and the Sangeet Natak Akademy in Creative and Experimental music category. He composed music for numerous documentaries of Films Division.
Panditji’s creative works in the realms of dance, orchestral composition and film music are recognized for an energizing originality that is often perceived to extend the boundaries of the artistic idiom. His compositions in dance and music have set trends, recognized worldwide with awards, and permeated musical expression in cultural media such as film, ballet and recordings. Panditji’s scores for Mrinal Sen’s ‘Bhuvan Shome’, painter M.F. Hussain’s ‘Through the Eyes of a Painter’ and Mrinal Sen’sl ‘Oka Oori Kadha’ in Telugu are a few examples of such brilliance. He worked as a music coordinator/musician for Richard Attenborough’s ‘Gandhi’. As a poet, Panditji has published five well- received anthologies of poems and short stories in English and Telugu.
కీ.శే. విజయరాఘవరావు గారు ఆంధ్రప్రదేశ్ లో నర్సరావుపేట కి చెందినవారు.
వారి సంగీతవిజయాలు అసంఖ్యేయాలు. రిచర్డ్ ఆటెన్ బరో గారి "గాంధీ" ఆంగ్లచిత్రానికి ఆయన music coordinator గా పనిచేసిన సంగతి, అందులోని మనసులకు హత్తుకొనిపోయే ఫ్లూట్ బిట్ విషయం చాలామందికి తెలియదు. ఆ చిత్రనిర్మాణంతర్వాత శ్రీ ఆటెన్ బరో గారు వీరి ప్రతిభను మెచ్చుకొంటూ వ్రాసిన లేఖ ఒక జాతీయ పురస్కారానికన్నాఎంతో విలువైన దనిపిస్తుంది.
మృణాళ్ సేన్ గారి "భువన్ షోమ్" చిత్రానికిజాతీయ సంగీత దర్శకునిగా ప్రభుత్వ పురస్కారాన్ని అందుకోవటం; ఎం.ఎఫ్. హుసేన్ గారు నిర్మించిన అజరామరమైన దృశ్యకావ్యం "Through the eyes of a painter "చిత్రానికి ఆయన అంతర్జాతీయ గోల్డెన్ బేర్ సంగీత దర్శక పురస్కారాన్నిగెలుపొందటం; రుడ్యార్డ్కిప్లింగ్ "జంగిల్బుక్" చిత్రానికి సంగీత రచన; తెలుగులో మృణాళ్ సేన్ గారి "ఒక వూరి కథ"కుఇచ్చిన అద్భుతమైన సంగీతం;"రెయిన్ బో" సంగీత ప్రయోగం; జెకోస్లావియన్ భారతీయ-పాశ్చాత్య సంహితాత్మక సంగీత సమ్మేళనాలు; ఆయన కనిపెట్టినహిందూస్తానీ కొత్త రాగాలు వంటివి ఇంటర్నెట్ లో లేకపోవటం వల్ల చాలా విశేషాలు ఈనాటి యువతీ యువకులకు తెలియకపోవటంలో ఆశ్చర్యంలేదు. 'రఘుపతి రాఘవ రాజారాం' భజన కూడా వీరు స్వరపరచినదేట. (వివరాలు వికీపీడియా నుండి, నర్సరావుపేట బ్లాగునుండి సేకరించినవి.)

25, నవంబర్ 2016, శుక్రవారం

ద్వారం వేంకటస్వామి నాయుడు - పెన్సిల్ చిత్రం.


My pencil work to pay tribute to the legendary violinist of Andhrapradesh Dwaram Venkataswami Naidu on his death anniversary today.

తెలుగువారు గర్వించదగా అత్యద్భుత వాయులీన విద్వాంసుడు ద్వారం వేంకటస్వామి నాయుడు. ఆ మహనీయుని గుర్తు తెచ్చుకుంటూ నేను వేసుకున్న పెన్సిల్ చిత్రం.


24, నవంబర్ 2016, గురువారం

కనులు కనులు కలిసెను... కన్నె వయసు పిలిచెను - Pencil sketch


కనులు కనులు కలిసెను... కన్నె వయసు పిలిచెను
విసురులన్ని పైపైనే... అసలు మనసు తెలిసెను...
అసలు మనసు తెలిసెను
Pencil sketch

22, నవంబర్ 2016, మంగళవారం

శ్రద్ధాంజలి డా. బాలమురళీకృష్ట్న, సంగీత కళానిధి.

కర్ణాటక సంగీతాన్ని ఖండాంతరాలకు వ్యాపింప చేసిన సంగీత మహానిధి మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారు.. కన్నుమూత..... ఆ మహానుభావుని ఆత్మ శాంతి కోసం ప్రార్ధిస్తు...
మౌనమే నీ భాష... ఓ మూగ మనసా
మౌనమే నీ భాష... ఓ మూగ మనసా
తలపులు యేన్నేన్నో కలలుగ కంటావు
తలపులు యేన్నేన్నో కలలుగ కంటావు
కల్లలు కాగానే కన్నీరౌతావు
మౌనమే నీ భాష... ఓ మూగ మనసా.. ఓ మూగ మనసా
చీకటి గుహ నీవు... చింతల చెలి నీవు
చీకటి గుహ నీవు... చింతల చెలి నీవు
నాటక రంగానివే మనసా... తెగిన పతంగానివే
ఎందుకు వలచేవో... ఎందుకు వగచేవో
ఎందుకు రగిలేవో... యేమై మిగిలేవో
మౌనమే నీ భాష... ఓ మూగ మనసా
తలపులు యేన్నేన్నో కలలుగ కంటావు
కల్లలు కాగానే కన్నీరౌతావు
మౌనమే నీ భాష... ఓ మూగ మనసా.. ఓ మూగ మనసా
కోర్కెల సెల నీవు కూరిమి వల నీవు
కోర్కెల సెల నీవు కూరిమి వల నీవు
ఊహల ఉయ్యాలవే మనసా... మాయల దెయ్యానివే
లేనిది కోరేవు.. ఉన్నది వదిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
మౌనమే నీ భాష... ఓ మూగ మనసా
తలపులు యేన్నేన్నో కలలుగ కంటావు
కల్లలు కాగానే కన్నీరౌతావు
మౌనమే నీ భాష... ఓ మూగ మనసా.. ఓ మూగ మనసా
https://youtu.be/x-Pt3Lh50L0

20, నవంబర్ 2016, ఆదివారం

ఎస్. పి. బాలసుబ్రమణ్యం - SP Balasubramanyam - Pencil sketch.



తెలుగు వారు గర్వించదగ్గ గాన గాంధర్వుడు శ్రీ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గారిని 'Centenery Award for Indian Film Personality of the Year' పురస్కారం తో ప్రభుత్వం సత్కరించిన సందర్భంగా వారికి నా హృదయపూర్వక అభినందనలు. ఈ  పురస్కారాన్నికేంద్ర అమాత్యులు శ్రీ వెంకయ్యనాయుడు గారి చేతులమీదుగా గొవాలో జరుగుతున్న 47వ. అంతర్జాతీయ Film Festival లో బహుకరించారు. ఇటీవల  హైదరాబాద్ లో MS Music Academy ప్రారంభోత్సవ సభలో వారిని కలుసుకుని నా పెన్సిల్ చిత్రం వారికి సమర్పించుకునే భాగ్యం నాకు కలిగింది. -- పొన్నాడ మూర్తి.

19, నవంబర్ 2016, శనివారం

ప్రియతమా - కవిత - పెన్సిల్ చిత్రం



My Pencil drawing
సోదరి Velamuri Luxmi కవితకి స్పందించి నేను వేసిన పెన్సిల్ చిత్రం.
ప్రియతమా !
అనుకోని అతిథిలా ప్రవేశించావు ...
మనసేంటి జీవితమంతా అల్లుకుపోయావు ...
నువ్వు స్పష్టాష్పష్టపు ప్రేమతో ముంచెత్తినావు ...
నేనే..నువ్వన్నావు ..నువ్వే నేనన్నావు ...
కలలు చూపించినావు ..మెరిపించి మురిపించినావు ....
వేయి కళ్ళతో ఎదురుచూడమన్నావు ....
కనులువాల్చి తొంగి చూస్తే , గుండెనిండా నిండి వున్నావు ...
కనులుమూసివుంచితే ప్రత్యక్షమౌతున్నావు ....
తలెత్తి ఆకాశంవంక చూస్తే నువ్వే కనబడుతున్నావు ....
నీ రాకకై ఎదురు చూడమన్నావు ....
ఏదో " అద్భుతం " జరుగుతుందన్నావు ....
మన కలయిక సత్యమన్నావు ...
నేనూ నువ్వూ ఒకటన్నావు ....
మధ్యాహ్న మార్తాండుడు మండిపడుతున్నాడు ....
ఎక్కడో ఒక చెట్టుమీద ఒంటరి కాకి దాహంతో అరుస్తోంది ...
నాలో విరహాగ్నులు ఎగసి పడుతున్నాయి ....
ఎందుకు నాజీవితం లోనికి ప్రవేశించావు ....
ఎందుకు నన్ను పిచ్చిదాన్ని చేశావు .....
నిను చూడకుండా వుండ లేక పోతున్నాను ....
నను చూడలనిపించదా నీకు ...
చూడడం ఏమిటి ? తలవను కూడా తలవవేమో నువ్వు ..
ఏమిటో అతలాకుతలమైపోయింది నా మనస్సు ...
ఎందుకిలా నన్ను మోసం చేశావు ....
నన్నేమిటి ....నా వునికినే మరచిపోయేలా చేశావు ..
నీ వశమైన నా మనస్సు నిన్ను విడచి రానంటోంది ...
నీ ఇష్టం ఏం చేస్తావో చెయ్యి ......
నేస్తం అననా ? ప్రియతమా అననా ? ...
ఏమనను నిన్ను ...నా ప్రాణంగా భావించిన నిన్ను ....
ఇంతటి మోసమా ...ప్రియా ....

18, నవంబర్ 2016, శుక్రవారం

వి. శాంతారాం - చిత్ర నిర్మాత, దర్శకుడు, నటుడు - పెన్సిల్ చిత్రం.

 ఈ రోజు భారతదేశపు చలనచిత్ర రంగంలో చరిత్ర సృష్టించిన అద్భుత చిత్ర నిర్మాత, దర్శకుడు, నటుడు వి. శాంతారామ్ జయంతి. ఈ సందర్భంగా నేను వేసిన పెన్సిల్ చిత్రం. ఈ అద్భుత వ్యక్తి గురించి వికీపీడియా వారు ఏమంటున్నారో ఈ క్రింది లింకు క్లిక్ చేసి తెలుసుకుందాం.

https://te.wikipedia.org/wiki/వి._శాంతారాం

శాంతారామ్ గురించి శ్రీమతి పొన్నాడ లక్ష్మి గారు facebook లో ఇలా వ్రాశారు.

"శాంతారాం గారి సినిమాలంటే నాకు చాలా ఇష్టం. అయన ఒక కళాతపస్వి. అతను తీసిన చిత్రాలన్నీ ఆణిముత్యాలే. ప్రతీ చిత్రంలో ఎదో ఒక కళకు ప్రాముఖ్యత ఇచ్చి నిర్మిస్తారు.' ఝనక్ ఝనక్ పాయల్ బాజేలో' నృత్యానికి, 'నవరంగ్' లో కవిత్వానికి, 'గీత్ గాయా పత్తరోన్' చిత్రంలో(ఇది మన 'అమరశిల్పి జక్కన' చిత్రానికి ఆధారం. చక్కగా సాంఘిక చిత్రంగా మలిచారు) శిల్పానికి, ఇలా ఎన్నో కళలని దృశ్యకావ్యాలుగా మనకి అందించారు. వారి చిత్రాలలో పాటలు అమృత గుళికలు. 'జల్ బిన్ మచిలీ' చిత్రంలో ఒక పాము డాన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది . అది మన తెలుగుచిత్రం 'అగ్నిపూలు' లో జయప్రద గారు చేసారు కూడా. అంతే కాదు వారి చిత్రాలు సందేశాత్మకంగా ఉండి ప్రజలని ఆలోచింపజేసేలా ఉంటాయి. ఉదాహరణకి 'తూఫాన్ అవుర్ దియా' చిత్రంలో ఎన్నికష్టాలు వచ్చినా ఎదుర్కొని నిలబడాలని, 'దో ఆంఖేన్ బారాహాత్' చిత్రంలో మంచితనంతో ఎంత దుర్మార్గులనైనా మార్చవచ్చనీ, 'సుభా క తారా' చిత్రంలో విధవా వివాహ సంస్కకరణ గురించి చెప్పారు.. ఇలా ఎన్నో అద్భుత చిత్రాలు వారి దర్సకత్వంలో వెలువడ్డాయి.వారికి మన ప్రభుత్వం 'పద్మవిభూషణ్' 'దాదా సాహెబ్ ఫాల్కే' వంటి అత్యుత్తమ పురస్కారాలు అందించి సత్కరించింది."

8, నవంబర్ 2016, మంగళవారం

లింగాష్టకం - పొన్నాడ లక్ష్మి

కార్తీక మాసం సందర్భంగా వీణ మీద నా శ్రీమతి పొన్నాడ లక్ష్మి పలికించిన లింగాష్టకం. దయచేసి ఈ క్రింది లింకు క్లిక్ చేసి వినంది.

https://www.facebook.com/ponnada.lakshmi/videos/989040981241610/

6, నవంబర్ 2016, ఆదివారం

మనదాంపత్యము సత్యమౌ ప్రణయసామ్రాజ్యమ్ము లోలోతులన్ - కరుణశ్రీ పద్యం - పెన్సిల్ చిత్రం.

మనదాంపత్యము సత్యమౌ ప్రణయసామ్రాజ్యమ్ము లోలోతులన్
గనియెన్; సాగెను భాగ్యనౌక కవితా కాళిందిలో; నవ్య జీ
వన బృందావన దివ్యసీమ విహరింపన్ రమ్ము! నే కొల్ల గొం
దును నీ కోమల బాహుబంధనములందున్ కోటి స్వర్గమ్ములన్;
(నా పెన్సిల్ చిత్రం - కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పద్యం)

5, నవంబర్ 2016, శనివారం

భూపెన్ హజారిక - బహుముహ ప్రజ్ఞ్నాశాలి - పెన్సిల్ చిత్రం


బహుముఖ ప్రజ్ఞాశాలి భూపెన్ హజారిక - సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు, పాత్రికేయుడు, సినీ నిర్మాత - ఒకటేమిటి, ఎన్నో రంగాల్లో నిష్ట్నాతుడు. వీరికి కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషన్, దాదా ఫాల్కె వంటి పురస్కారాలు అందించింది. వీరిని మకుటంలేని మహారాజు గా North-Eastern India ప్రజలు అభివర్ణించుకుంటూ ఉంటారు. ఈ మహావ్యక్తి ని వారి జయంతి సందర్భంగా నా పెన్సిల్ ద్వారా ఇలా చిత్రీకరించుకున్నాను.
వీరు పాడిన 'గంగా తుమ్ బెహతీ హొ క్యొం' అన్న పాట విశిష్ట ప్రజాదరణ పొందింది. Youtube లో ఈ పాటను మీరు కూడా వినవచ్చును..

3, నవంబర్ 2016, గురువారం

అలనాటి మేటి గాయని జిక్కి కృష్ట్నవేణి - Jikki - పెన్సిల్ చిత్రం

ఈ రోజు అలనాటి అద్బుత గాయని జిక్కి గారి జయంతి. ఆ మహా గాయనికి నివాళి అర్పిస్తూ నేను వేసుకున్న పెన్సిల్ చిత్రం. వికీపీడియా వారు జిక్కి గురించి ఏమంటున్నారో తెలుసుకుందాం.


జిక్కి అని ముద్దుగా పిలుచుకునే పి.జి.కృష్ణవేణి (నవంబరు 31938 - ఆగష్టు 162004) తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, సింహళ మరియు హిందీ భాషలలో ప్రసిద్ధ సినీ గాయకురాలు. మూడు దశాబ్దాల పాటు పదివేలకు పైగా పాటలు పాడారు. చిత్తూరు జిల్లాలోని చంద్రగిరిలో జన్మించిన జిక్కి ఏ సంగీత శిక్షణ లేక పోయినా వినికిడి జ్ఞానంతో పాడటం నేర్చుకొన్నది. జిక్కి తండ్రి మద్రాసులో స్టూడియోలో చిన్నాచితక పనులు చేస్తుంటే ఆమె ఎప్పుడైనా వెళ్లినపుడు అదంతా తిరిగేది. అలా తిరుగుతున్నపుడు చూసిన ప్రముఖ దర్శకులు గూడవల్లి రామబ్రహ్మంపంతులమ్మ (1943) సినిమాలో చిన్నవేషంతో పాటు పాట పాడే అవకాశం కల్పించారు. జిక్కి అప్పట్లో ప్రముఖగాయకుడైన ఏ.ఎమ్.రాజాను ప్రేమవివాహం చేసుకున్నది. వీరికి ఆరుగురు సంతానం. అరవయ్యేళ్లు దాటాక కూడా ఆమె ఆదిత్య 369 సినిమాలో జాణవులే... అనే పాట పాడి తన గొంతులో ఇంకా వాడి తగ్గలేదని నిరూపించారు

ప్రాచుర్యం పొందిన గీతాలు


1, నవంబర్ 2016, మంగళవారం

తెలుగు సినిమా పాట





ఈ ఉదయం facebook లో శ్రీమతి Devaki Yagalla గారి post చదివాక వెంటనే ఓ సంగీతపరమయిన బొమ్మ వేసుకోవాలనిపించింది. వేసేసాను. 'సినిమా పాటలేనా.' అని కొంతమంది కొట్టిపారేస్తారు. కాని ఒక పాట కి బాణీ కట్టాలంటే దాని వెనుక ఎంత కధ ఉంటుందో కదా..!! దేవకి గారి post యధాతధంగా ఈ క్రింద పొందుపరుస్తున్నాను
"దరువుల వెనుకే పదాల పరుగులు అత్యథిక శాతం సినీమా పాటలలో .. అవునా.
ఆరుద్రవారు "ముద్దంటేచేదా" అని రాసినదిచూసి కళ్ళుమూసుకుని రెండు నిమిషాలు ఆలోచించి, "ముమ్ముమ్ముమ్ముమ్ముమ్ముద్దంటే చేదా" అని మారిస్తే తాళానికి సరిపోతుందని సూచించారట మహాదేవన్‌ సారు.
ఆ పాట ఎంత ప్రజాదరణ పొందిందో మనకందరికీ తెలుసుగా మరి:))
సినీమా పాటలలోని లయ విన్యాసాలను డాక్టర్ కొడవగంటి రోహిణీప్రసాద్ గారు ఎంచక్కగా విశదీకరించారో పొందు పరిచాను.
ఓ సారి మీరూ చదవండి.
కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ గురించి:
కొడవటిగంటి రోహిణీప్రసాద్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన సంగీతజ్ఞుడు, ప్రముఖ శాస్త్రవేత్త, సమర్థుడైన రచయిత. పాపులర్ సైన్సు, సంగీతం మరియు ఇతర విషయాల గురించి తన మాతృభాషైన తెలుగులోను, ఆంగ్లంలోను పలు వ్యాసాలు రాశాడు. ఆయన ప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావు కుమారుడు.
రాగాన్ని విని ఆనందించడానికి కొంత పరిజ్ఞానం అవసరమేమో కాని లయబద్ధమైన సంగీతం అందరికీ సులువుగా బోధపడుతుంది.
సైన్యం కవాతులో గుర్రాలు కూడా భేరీల మోతను విని అడుగులు వేస్తాయి. రాగం, స్వరాలకన్నా పాటకు ఉండే లయ, లేక గతి ఎక్కువ మౌలికమైనది. ఆధునిక కవిత్వాన్ని రాగవరసలో కాకుండా కేవలం ఛందస్సు, లయ ప్రధానంగా చదివితేనే బావుంటుంది.
శ్రీశ్రీ రాసిన కవితల్లో ఎక్కువగా ఇటువంటివే.
పొలాలనన్నీ హలాల దున్నీ
ఇలాతలంలో హేమం పిండగ…
అలాగే ఆరుద్ర కూనలమ్మ పదాలకు పరిచయం రాస్తూ వాటిలోని అయిదక్షరాల ఖండగతిని ప్రస్తావించారు.
“నేను చెపుతా కవిత” అన్నా
“నేను చెప్పెద కవిత” అన్నా నడకలో మార్పు ఉండదు అన్నారు.
శ్రీశ్రీ రాసిన మరొక కవితలో ప్రతి పంక్తికీ చివర ఒక “ఘాత”(దెబ్బ)ను ఊహించుకోవచ్చు.
ఏ దేశ చరిత్ర చూసినా
ఏమున్నది గర్వకారణం
అని చదివినా చివర మరొక అక్షరం చేర్చినా లయలో మార్పుండదు. ఉదాహరణకు లయ చెడకుండా దాన్ని ఇలా కూడా చదవవచ్చు (పాపము శమించుగాక!)
ఏ దేశ చరిత్ర చూసినా (నూ)
ఏమున్నది గర్వకారణం (లే)
మాత్రా ఛందస్సును చక్కగా పాటించిన ఇతర ఆధునిక కవులలో దేవులపల్లి, దాశరథి, నారాయణరెడ్డి ప్రముఖులు.
గజ్జెల మల్లారెడ్డి తదితరులు కూడా ఉన్నారు.
చదివినది మనసుకు హత్తుకుపోవడానికి మాత్రా ఛందస్సు బాగా సహాయపడుందని ఇటువంటి ఉదాహరణల ద్వారా తెలుస్తుంది.
సీస పద్యాల్లోనూ, జానపద గీతాల్లోనూ తరుచుగా వినబడే ఝంపె నడకలో చాలా తెలుగుదనం ఉంది. త్వరితగతిలో సాగే ఘంటసాల పాట రావోయి బంగారి మావా వంటివి వాటిలో ఎన్నో ఉన్నాయి.
పైన ఉదహరించినవి కాక ఏడక్షరాల నడకలో రాసిన కవితలు కూడా ఉన్నాయి. దాశరథి రాశారు
వలపునై నీ హృదయసీమల నిలువవలెనని ఉన్నది
పిలుపునై నీ అధరవీథుల పలుకవలెనని ఉన్నది
ఇక సంగీతం గురించి చెప్పాలంటే రాగవరసలో చదివే వచనమూ,పద్యాలూ, ఆలాపన తప్పిస్తే మిగతావన్నీ ఏదో ఒక ఛందస్సులోనే సాగుతాయనేది తెలిసినదే. శాస్త్రీయసంగీతంలో (ముఖ్యంగా కర్ణాటకంలో) తాళప్రకరణం చాలా సంక్లిష్టమైనది.
నడకలోని క్లిష్టతనుబట్టి చూస్తే ప్రపంచంలో మృదంగానికి సరితూగగల తాళవాద్యం ఉండదేమో. ఏది ఏమైనా శాస్త్రీయ సంగీత రచనల సంగతే వేరు. త్యాగరాజంతటివాడే తాళం ముఖ్యమనుకున్నప్పుడు సాహిత్యాన్ని అంతగా లక్ష్యపెట్ట లేదు.
ఉదాహరణకు పక్కలనిలబడి అనే కీర్తనను తాళాన్ని అనుసరించి పక్కాలానీలాబాడీ అని పాడక తప్పడంలేదు. జానపద సంగీతంలోనూ, పల్లెపాటల్లోనూ దరువుకోసం పదాల్ని సాగదీసి పాడే సందర్భాలున్నాయి.
మనం వినే సినిమాపాటలన్నీ త్రిశ్ర (ఆరు), చతురశ్ర (నాలుగు లేదా ఎనిమిది), ఖండ (అయిదు) లేక మిశ్ర (ఏడు) అక్షరాల నడక (లయ)కు చెందినవే అయిఉంటాయి. వీటిలో మొదటి రెంటికీ లెక్కలేనన్ని ఉదాహరణలున్నాయి.
5, 7 మాత్రల్లో పాటలు స్వరపరిచి జనాదరణ పొందడం సంగీతదర్శకులకు కాస్త కష్టమే.
హిందీలో శంకర్‌జైకిషన్‌ ఖండగతిలో ఆఁసూ భరీహై (ముకేశ్‌),ఆవాజ్‌ దేకర్‌ (రఫీ, లతా) మొదలైన మంచిపాటలను తయారుచేశారు.
అలాగే ఏడు మాత్రల్లో అజీ రూఠ్‌కర్‌ కహాఁ జాయియేగా (లతా) అనే పాటను స్వరపరిచారు.
తెలుగులో కొన్ని ఉదాహరణలు చూద్దాం.
త్రిశ్ర పగలే వెన్నెలా, జగమే మాయ వగైరా
చతురశ్ర ఏరువాక సాగరో, చెట్టులెక్కగలవా వగైరా
ఖండ శిలలపై శిల్పాలు చెక్కినారు, నీలాల ఓ మేఘమాల వగైరా
మిశ్రపాడమని నన్నడగవలెనా, రాయినైనా కాకపోతిని, శ్రీజానకీదేవి సీమంత మలరే(మిస్సమ్మ), జగదీశ్వరా (సువర్ణసుందరి)
కె.వి.మహాదేవన్‌ తాను స్వరపరిచిన
ఈనాటి ఈబంధమేనాటిదో,రావమ్మామహాలక్ష్మీ
వంటి పాటల్లో ఒక్కొక్క చరణానికీ ఒక్కొక్క తాళం వాడారు. లయకూ తాళానికీ తేడా ఏమిటంటే ఇన్ని మాత్రల తరవాత మొదటికి రావాలని తాళంలో నిబంధన ఉంటుంది. ఉదాహరణకు ఆదితాళానికి ఎనిమిది మాత్రలు.
పాటల విషయానికొస్తే పైన చెప్పిన ఛందస్సుల్లోని దరువుల్లో కొంత వైవిధ్యం కనిపిస్తుంది. ఉదాహరణకు సినీ సంగీతపు పరిభాషలో 6/8 పద్ధతిలో సాగే పాటల్లో టౌనుపక్క కెళ్ళద్దురో, చిలకా గోరింకా (చెంచులక్ష్మి) వంటి పాటలు “దాద్రా”లో ఉంటే, జగమే మారినది, ఎంత ఘాటు ప్రేమయో వంటివి “వాల్ట్‌జ్‌”లో ఉంటాయి. మూగవైననేమిలే (అప్పుచేసి పప్పుకూడు), జోరుగా హుషారుగా వంటివి “స్వింగ్‌”లో ఉంటాయి. దరువుల్లోని ఈ తేడాలవల్ల పాట భావానికి తగిన “ఊపు” లభిస్తుంది. చతురశ్రంలో ఏరువాకసాగారో వంటివి మనదేశపు భాంగ్రా శైలిలో ఉంటే, రావేరావే బాలావంటి హుషారు పాటలు వెస్టర్న్‌ పద్ధతిలో వినిపిస్తాయి. పాటకుపల్లవిప్రాణంవంటివి హిందూస్తానీ “తీన్‌తాల్‌”లో ఉంటే మది శారదాదేవివంటివి ఆదితాళంలో ఉంటాయి. ఏడక్షరాల పాటల్లో పాడమని నన్నడగవలెనా హిందూస్తానీ “రూపక్‌” తాళంలో ఉంటే చెలియ లేదు వంటివి “దీప్‌చందీ” తాళంలో వినిపిస్తాయి. ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం తదితరులు నిర్వహించిన టివీ పాటల పోటీ కార్యక్రమాల్లో ఒక పాటను రకరకాల తాళాల్లో పాడి వినిపించడం ఒక అంశంగా ఉండేది. దానివల్ల రచనకూ, ట్యూన్‌కూ, లయకూ ఉన్న సంబంధం చక్కగా తెలుస్తుంది.
కవి ఒక ఛందస్సులో రాస్తే సంగీతదర్శకుడు దాన్నే అనుసరించాలనిలేదు. నీలిమేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించునేవేళ అన్నకవిత అయిదక్షరాల ఖండగతిలో ఉన్నప్పటికీ పాట చతురశ్రంలోనే సాగుతుంది. ముందు ట్యూన్‌ చేశాక పాట రాసినప్పుడు మాత్రం గీతం స్వరాలకు లోబడే ఉంటుంది గనక ఇటువంటిది జరగదు. సి.ఆర్‌.సుబ్బరామన్‌ ఏ గీతానికీ ట్యూన్‌
చేసినట్టు అనిపించదు. అన్నీ సముద్రాలవారు “కిట్టించిన” రచనలే. ఆదినారాయణరావు సరేసరి. ఆయనకు ట్యూన్‌, లయ చాలా ముఖ్యం. జగదీశ్వరా పాహి పరమేశ్వరా వంటి రచనలన్నీ ట్యూన్‌కు రాసినవేనని తెలిసిపోతూ ఉంటుంది. రాజేశ్వరరావు తదితరులు స్వయంగా “స్టార్లు” అయిన తరవాత వారి ట్యూన్లకు అంతులేని ప్రజాదరణ లభించింది. ఒక్క దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి విషయంలో తప్ప (ఆయనను శాసించగలిగిన సాహసం ఎవరికీ ఉండేదికాదేమో) తక్కిన కవులందరికీ ట్యూన్‌ ప్రకారమే పాటలు రాయడం తప్పలేదు. దాశరథి వంటి గొప్ప కవులు కూడా స్వరాల ననుసరించి ఖుషీ ఖుషీగా నవ్వుతూ వంటి పాటలు రాశారు. డబ్బింగ్‌ సినీమాల్లో పాటలు రాయడమనేది ఎంత బాగా చెయ్యవచ్చునో శ్రీశ్రీ, ఆరుద్ర తదితరులు చూపించారు. ప్రేమించి చూడులో శ్రీశ్రీ రాసిన దొరికేరు దొరగారు అన్న పాటలోని సాహిత్యం ట్యూన్‌కు రాసినదే అయినా తమిళంలోని ఒరిజినల్‌్‌ కన్నా గొప్ప రచన.
తాను తమిళుడైనా కె.వి.మహాదేవన్‌ మాత్రం ఎప్పుడూ తెలుగులో రచన జరిగాకనే స్వరపరిచేవారట. మహాదేవన్‌ బోంగో వంటి మామూలు డ్రమ్స్‌తో జనాదరణ పొందిన చాలా పాటలు రచించారు. ఉదాహరణకు బుద్ధిమంతుడు సినిమాలోని టాటా వీడుకోలు అనే పాట. లయలేకుండా ఆంధ్ర పత్రిక ఎడిటోరియల్‌లా ఉంటాయని అనిపించుకున్న ఆత్రేయ పాటల్నికూడా ఆయన లయబద్ధం చేసి అందంగా రూపొందించాడు. ఆరుద్ర ముద్దంటేచేదా అని రాసినదిచూసి కళ్ళుమూసుకుని రెండు నిమిషాలు ఆలోచించి, ముమ్ముమ్ముమ్ముమ్ముమ్ముద్దంటే చేదా అని మారిస్తే తాళానికి సరిపోతుందని సూచించారట మహాదేవన్‌. ఆ పాట ఎంత ప్రజాదరణ పొందిందో మనకందరికీ తెలుసు.
తాళం, లయ, దరువుతోబాటు పాట నెమ్మదిగా సాగుతుందా వేగంగా నడుస్తుందా అనేది కూడా భావానికి దోహదం చేస్తుంది. హిందీలో నౌషాద్‌వంటి మహామహులు కొన్ని విషాద గీతాలను చాలా నెమ్మదిగా నడిపించిన సందర్భాలున్నాయి. పాత పాటల్లో ఇవన్నీ కొంత సహజత్వంతో జరిగేవి. దర్శకుడు తాను చూపే ఘట్టంలో ఏం చెప్పదలుచుకున్నాడో సంగీతదర్శకుడికీ, పాటల రచయితకూ బాగా అర్థం అయినట్టు కనిపించేది. అందువల్లనే కె.వి.రెడ్డి, పింగళి నాగేంద్రరావు వంటి “ద్వయాలు” పాతాళభైరవి, మాయాబజార్‌ వంటివి విజయవంతంగా తీయగలిగారు. మామూలుగా పాటలు విని ఆస్వాదించేవారికి ఇంతగా విశ్లేషణ చేసే అవసరం ఉండకపోవచ్చుగాని వారు లయబద్ధంగా చేతులూ, కాళ్ళూ కదిపి ఆనందిస్తున్నారంటే అది పాటను తయారుచేసిన వారందరి గొప్పతనమే.
హిందీ పాటల ప్రభావంవల్ల పాత తెలుగు పాటల్లో మధ్యలో తాళం ఆగిపోయి “సాకీ” వినబడేది. ఉదాహరణకు ప్రేమే నేరమౌనా, నెలరాజా వెన్నెల రాజా, కావాలంటే ఇస్తాలే వంటి పాటలు. ఈ ధోరణి తరవాతి కాలంలో తగ్గింది.
సినిమా పాటల్లో ఉపయోగించే తాళవాయిద్యాలూ, వాటి పోకడలూ, వాటి శబ్దాల తీవ్రతా వినేవారికి ఆనందాన్నిచేకూర్చాలి. ఉదాహరణకు సంతానం సినిమాలో భూపాలరాగంలో ఘంటసాల పాడిన కనుమూసినా అనేపాట ఎంతో మంచిదైనప్పటికీ అందులో దరువులు అంత గట్టిగా ఉండకపోతే బావుండుననిపిస్తుంది. రాజేశ్వరరావు సినిమా పాట రిహార్సల్‌లో “మెలొడీ” లేకుండా వాయిస్తున్నాడని తబలా ఆర్టిస్టును కోప్పడ్డం నేను విన్నాను. తబలాలో మెలొడీ ఉంటుందని మనబోటి సామాన్యులకు వెంటనే తట్టదు.
మంచి తబలా కళాకారులు ఎక్కువగా ఉన్న బొంబాయిలో హిందీ పాటల్లోని తబలా మన పాటలకన్నా అందంగా వినిపించడంలో ఆశ్చర్యం లేదు. నౌషాద్‌, నయ్యర్‌, శంకర్‌ జైకిషన్‌ ్‌, మదన్‌మోహన్‌ తదితరులు గొప్ప తబలా ఆర్టిస్టులను వాడుకున్నారు. ఎస్‌.డి.బర్మన్‌ రఫీ చేత పాడించిన “నాచే మన్‌ మోరా మగన్‌” పాటలో ప్రముఖ విద్వాంసుడు పండిత్‌ శాంతాప్రసాద్‌ తబలాతో అద్భుతంగా సహకరించాడు. అలాగే తమిళ సినిమా మృదంగ చక్రవర్తిలో ఉమయాళ్‌పురం శివరామన్‌ మృదంగం వాయించారు. ఇటువంటివి అరుదుగా జరుగుతాయి కాని పేరు తెలియకపోయినా లయవాద్యాలు చక్కగా వాయించేవారి సహకారం పాటలకు చాలా ముఖ్యం.
ఈ రోజుల్లో ఏ పాట విన్నా అమెరికావంటి దేశాల్లో (మనవాళ్ళు కూడా) ప్రేక్షకులు లేచి నాట్యం చేస్తూ ఉంటారు. వారికి ఒకే దరువులో పాట సాగితే వీలుగా ఉంటుంది. బహుశా ఈ కారణం వల్లనే “ఆధునిక సంగీతం”లో పాట మొదలయాక దరువులో మార్పు లేకపోవడం కనబడుతూంది.
పాట అనేది ఒక కవీ, సంగీతకారుడూ కలిసి చేసిన కళాసృష్టి అనే భావన ముఖ్యం కానప్పుడు పాటల్లోని సాహిత్యం, రాగంతో బాటు, తాళంకూడా ప్రాధాన్యత కోల్పోక తప్పదేమో.
శుభోదయం ఇండియా!"

దేవులపల్లి కృష్ట్నశాస్త్రి - Devulapalli Krishna Sastri - Pencil Drawing


ఈ రోజు తెలుగువెలుగు దేవులపల్లి కృష్ట్నశాస్త్రి గారి జయంతి. ఈ మహాకవి నా పెన్సిల్ చిత్రం ద్వారా ఇలా చిత్రీకరించుకున్నాను. వీరి గురించి క్లుప్తంగా వికీపీడియా వారు ఏమంటున్నారో  చదివి తెలుసుకుందాం.
దేవులపల్లి కృష్ణశాస్త్ (నవంబర్ 11897 - ఫిబ్రవరి 241980) ప్రసిద్ధ తెలుగు కవి. తెలుగు భావ కవితా రంగంలో కృష్ణశాస్త్రి ఒక ప్రముఖ అధ్యాయం. ఆయన రేడియాలో లలితగీతాలు, నాటికలు, సినిమాల్లో పాటలు రాయడం ద్వారా ప్రఖ్యాతి పొందాడు. చిన్న వయసునుండే రచనలు ఆరంభించాడు. 1929 లో రవీంద్రనాధ టాగూరును కలసిన తరువాత ఆయన కవిత్వంలో భావుకత వెల్లివిరిసింది. 1945లో ఆకాశవాణిలో చేరి అనేక పాటలు, నాటికలు రచించాడు
దేవులపల్లి కృష్ణశాస్త్రి తూర్పు గోదావరి జిల్లాపిఠాపురం దగ్గరలోని రావు వారి చంద్రపాలెం అనే గ్రామంలో ఒక పండిత కుటుంబంలో 1897 నవంబరు 1నజన్మించాడు. అతని తండ్రి, పెదతండ్రి గొప్ప పండితులు. వారింట్లో నిరంతరం ఏదో సాహిత్యగోష్ఠి జరుగుతూ ఉండేది. కృష్ణశాస్త్రి చిన్న వయసునుండే రచనలు ఆరంభించాడు. పిఠాపురం హైస్కూలులో అతని విద్యాభ్యాసం సాగింది. పాఠశాలలో తన గురువులు కూచి నరసింహంరఘుపతి వెంకటరత్నం ఆంగ్ల సాహిత్యంలోతనకు అభిరుచి కల్పించారని దేవులపల్లి చెప్పుకొన్నాడు. 1918లో విజయనగరం వెళ్ళి డిగ్రీ పూర్తి చేసి తిరిగి కాకినాడ పట్టణం చేరాడు. పెద్దాపురం మిషన్ హైస్కూలులో ఉపాధ్యాయవృత్తి చేపట్టాడు.
ఆ కాలంలో వ్యావహారిక భాషావాదంబ్రహ్మసమాజం వంటి ఉద్యమాలు ప్రబలంగా ఉన్నాయి. కృష్ణశాస్త్రి తన అధ్యాపకవృత్తిని వదలి బ్రహ్మసమాజంలో చురుకుగా పాల్గొన్నాడు. అదే సమయంలో సాహితీ వ్యాసంగం కూడా కొనసాగించాడు. 1920లో వైద్యంకోసం రైలులో బళ్ళారి వెళుతూండగా ప్రకృతినుండి లభించిన ప్రేరణ కారణంగా "కృష్ణపక్షం కావ్యం" రూపు దిద్దుకొంది. 1922లో భార్యా వియోగానంతరం అతని రచనలలో విషాదం అధికమయ్యింది.
తరువాత మళ్ళీ వివాహం చేసుకొని, పిఠాపురం హైస్కూలులో అధ్యాపకునిగా చేరాడు. కాని పిఠాపురం రాజుగారికి కృష్ణశాస్త్రి భావాలు నచ్చలేదు. కృష్ణశాస్త్రి ఆ ఉద్యోగం వదలి బ్రహ్మసమాజంలోను, నవ్య సాహితీసమితిలోను సభ్యునిగా, భావ కవిత్వోద్యమ ప్రవర్తకునిగా దేశమంతటా ప్రచారంలో పాల్గొన్నాడు. ఈ సమయంలో ఎందరో కవులతోను, పండితులతోను పరిచయాలు కలిగాయి. ప్రాచ్య, పాశ్చాత్య సాహిత్యాన్ని అధ్యయనం చేశాడు. పిఠాపురంలోని హరిజన వసతి గృహంతో సంబంధం ఏర్పరచుకొని హరిజనోద్ధరణ కార్యక్రమాలలో పాల్గొన్నందున బంధువులు అతనిని వెలివేశారు. అయినా వెనుకాడని కృష్ణశాస్త్రి వేశ్యావివాహ సంస్థను ఏర్పాటు చేసి ఎందరో కళావంతులకు వివాహాలు నిర్వహించాడు. సంఘ సంస్కరణా కార్యక్రమాలు నిర్వహిస్తూనే "ఊర్వశి" అనే కావ్యం వ్రాశాడు.

1929లో విశ్వకవి రవీంద్రనాధ టాగూరుతో పరిచయం ఏర్పడింది. వారిద్దరి మధ్య సాహితీ సంబంధాలు ఏర్పడ్డాయి. 1933-41 మధ్య కాలంలో కాకినాడ కాలేజీలో తిరిగి అధ్యాపకవృత్తిని చేపట్టాడు. 1942లో బి.ఎన్.రెడ్డి ప్రోత్సాహంతో మల్లీశ్వరి చిత్రానికి పాటలు వ్రాశాడు. తరువాత అనేక చిత్రాలకు సాహిత్యం అందించాడు. 1957లో[ఆధారం కోరబడినది] ఆకాశవాణిలో చేరి తెలుగు సాహిత్య ప్రయోక్తగా అనేక గేయాలు, నాటికలు, ప్రసంగాలు అందించాడు.
భావ కవిగా, ‘ఆంధ్రా షెల్లీ ’గా ప్రసిద్ధులైన దేవులపల్లి వేంకట కృష్ణశాస్ర్తి... బి.ఎన్.రెడ్డి ప్రోత్సాహంతో ‘మల్లీశ్వరి (1951)’తో చిత్రరంగంలో అడుగుపెట్టారు. సినిమా పాటకు కావ్య గౌరవం కలిగించారు. ఆపాత మధురమైన కృష్ణశాస్ర్తి సాహిత్యం ఇక్షురసార్ణవం వంటిదని శ్రీశ్రీ శ్లాఘించారు. లాలిత్యం, సారళ్యం, ప్రకృతి సౌందర్యం - కృష్ణశాస్ర్తి పాటల్లోని ప్రధాన లక్షణాలు. భావోద్వేగాలకు, హృదయ స్పందనలకు అక్షర రూపమిచ్చి భావ కవితలంత సుకుమారంగా ప్రణయ విరహ గీతాల్ని రాసిన కవి. ఆత్మ నివేదన, ఆరాధన గల భక్తిగీతాలు కూడా అనేకం. రాజమకుటం, సుఖదుఃఖాలు, కలిసిన మనసులు, అమెరికా అమ్మాయి, గోరింటాకు మొదలైన చిత్రాల్లో 170 పాటలు మాత్రమే రాసిన కృష్ణశాస్ర్తి, ఈ పన్నెండుగురు పద నిర్దేశకుల్లోనూ తక్కువ పాటలు రాసిన కవి.
‘భక్త ప్రహ్లాద (1931)’తో ప్రారంభమైన తెలుగు సినిమా పాట ఎనభయ్యో పడిలో అడుగుపెట్టింది. ఈ ఎనిమిది పదుల కాలంలో సుమారు 400 మంది కవులు దాదాపు 34 వేల పాటల్ని (అనువాద గీతాల్ని మినహాయించి) రాశారు. ముఖ్యమైన జాబితా లో ఎవరు ఎంపిక చేసినా మహా అయితే మరో ఏడెనిమిది మంది కవుల కంటే ఆ జాబితాలో చోటు చేసుకోరు. ఇలా గుర్తింపు పొందిన కవులను కూడా జల్లెడ పడితే, తమ ప్రత్యేకతలతో తెలుగు సినిమా పాటకు దిశానిర్దేశం చేసిన కవులు 12 మంది మాత్రమే అంటే కించిత్ ఆశ్చర్యం కలగక మానదు. అందులో ఒకరు ...దేవులపల్లి కృష్ణశాస్త్రి.
గొప్ప వక్తగా, రచయితగా, భావకవుల ప్రతినిధిగా పేరుపొందిన కృష్ణశాస్త్రి గొంతు 1963లో అనారోగ్యకారణంగా మూగవోయింది. కాని అతని రచనా పరంపర కొనసాగింది. అతనికి అనేక సన్మానాలు ప్రశంసలు లభించాయి. 1980 ఫిబ్రవరి 24న కృష్ణశాస్త్రి మరణించాడు.
కృష్ణశాస్త్రి మేనగోడలే కర్ణాటక, లలిత, జానపద సంగీత కళానిధి, వింజమూరి సోదరీమణులలో ఒకరైన కళాప్రపూర్ణ అవసరాల (వింజమూరి) అనసూయాదేవి.
  • కృష్ణ పక్షము : ఇది కృష్ణశాస్త్రి కవితా ప్రస్థానంలోనూ, తెలుగు సాహితీ చరిత్రలోనూ ఒక ముఖ్య ఘట్టం. ఒకసారి ఆయన బెజవాడ నుండి బళ్ళారికి రైలులో వెళుతుండగా చుట్టూ ఉన్న పొలాల సౌందర్యానికీ, రైలు లయకూ పరవశించి "ఆకులో ఆకునై, పూవులో పూవునై" అని పలవరించారట. అది తెలుగు భావకవితా యుగంలో ఒక ముఖ్య క్షణం. 1922లో సంభవించిన భార్యా వియోగం ఆయన కవితలను మరింత వేదనా భరితం చేసింది.ఊహా ప్రేయసి, ఆత్మాశ్రయత్వం, ప్రవాసము, ఊర్వశి వంటి కవితలు ఈ ఖండకావ్యసంపుటిలో ఉన్నాయి.
  • ఊర్వశి కావ్యము,
  • అమృతవీణ - 1992 - గేయమాలిక
  • అమూల్యాభిప్రాయాలు - వ్యాసావళి
  • బహుకాల దర్శనం - నాటికలు,కథలు
  • ధనుర్దాసు - నాలుగు భక్తీ నాటికలు,
  • కృష్ణశాస్త్రి వ్యాసావళి - 4 భాగాలు
  • మంగళకాహళి - దేశభక్తి గీతాలు
  • శర్మిష్ఠ - 6 శ్రవ్య (రేడియో) నాటికలు
  • శ్రీ ఆండాళ్ళు తిరుప్పావు కీర్తనలు, నాటిక 1993
  • మేఘమాల - సినిమా పాటల సంకలనం - 1996
  • శ్రీ విద్యావతి - శృంగార నాటికలు
  • యక్షగానాలు - అతిథిశాల - సంగీత రూపకాలు
  • మహాతి
  • వెండితెర పాటలు - 2008

సినిమా పాటలు[మార్చు]

మల్లీశ్వరితో ప్రారంభించి కృష్ణశాస్త్రి ఎన్నో చక్కని సినిమా పాటలు అందించారు. అవి సామాన్యులనూ, పండితులనూ కూడా మెప్పించే సాహితీ పుష్పాలు. ఉదాహరణకు

మల్లీశ్వరి సినిమానుండి[మార్చు]

మనసున మల్లెల మాలలూగెనే -
కనుల వెన్నెల డొలలూగెనే -
ఎంత హాయు ఈరేయి నిండెనో -
ఎన్నినాళ్ళకీ బ్రతుకు పండెనో -
కొమ్మల గువ్వల సవ్వడి వినినా -
రెమ్మల గాలుల సవ్వడి వినినా -
ఆలలు కొలనులొ గలగల మనినా -
డవుల వేణువు సవ్వడి వినినా -
నీవు వచ్చెవని నీపిలుపె విని -
కన్నుల నీరెడి కలయ చూచితిని -
గడియె యుక విడిచి పోకుమ -
ఎగసిన హృదయము పగులనీకుమ -
ఎన్నినాళ్ళకీ బ్రతుకు పండునో -
ఎంత హాయు ఈరేయి నిండెనో -

ఒక దేశభక్తి గీతం---భారత మాత[మార్చు]

జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ, దివ్యధాత్రి!
జయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయనేత్రి!
జయ జయ జయ.....
జయ జయ సశ్యామల సుశ్యామల చలచ్చేలాంచల!
జయ వసంత కుసుమలతా చలిత లలిత చూర్ణ కుంతల!
జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగళా!
జయ జయ జయ.......
జయ దిశాంత గత శకుంత దివ్య గాన పరితోషణ!
జయ గాయక వైతాళిక గళవిశాల పథవిహరణ!
జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణ!
జయ జయ జయ.......
ఈ గీతాన్ని ఆయన కాకినాడ ప్రభుత్వ కళాశాలలో లక్చరర్ గా పనిచేస్తున్నపుడు వారి విద్యార్థుల కోసం వ్రాసారు.

కృష్ణపక్షము నుండి[మార్చు]

నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు ?
నా యిచ్చయే గాక నా కేటి వెరపు ?
కాలవిహంగమ పక్షముల దేలియాడి
తారకా మణులలో తారనై మెరసి
మాయ మయ్యెదను నా మధురగానమున!
నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు ? (స్వేచ్ఛాగానము)
తలిరాకు జొంపముల సం
దులత్రోవల నేల వాలు తుహినకిరణ కో
మల రేఖవొ! పువుదీవవొ!
వెలదీ, యెవ్వతెవు నీపవిటపీ వనిలోన్ ? (అన్వేషణము)
సౌరభములేల చిమ్ము పుష్పవ్రజంబు?
చంద్రికలనేల వెదజల్లు చందమామ?
ఏల సలిలంబు పారు? గాడ్పేల విసరు?
ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను? (ఏల ప్రేమింతును?)

ప్రసిద్ధి చెందిన సినిమా పాటలు[మార్చు]

ఎన్టీఆర్ - చిత్రాలు, కవితలు

నిమ్మకూరు నందీ జగమున పుట్టి చలన చిత్ర సీమన అడుగు పెట్టి నటవిశ్వరూపము చాటి చూపెట్టి నటసార్వభౌమ బిరుదము చేపట్టి ఏకఛత్రమున ఏబదేండ్లు ఏలినట్టి జ...