22, నవంబర్ 2016, మంగళవారం

శ్రద్ధాంజలి డా. బాలమురళీకృష్ట్న, సంగీత కళానిధి.

కర్ణాటక సంగీతాన్ని ఖండాంతరాలకు వ్యాపింప చేసిన సంగీత మహానిధి మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారు.. కన్నుమూత..... ఆ మహానుభావుని ఆత్మ శాంతి కోసం ప్రార్ధిస్తు...
మౌనమే నీ భాష... ఓ మూగ మనసా
మౌనమే నీ భాష... ఓ మూగ మనసా
తలపులు యేన్నేన్నో కలలుగ కంటావు
తలపులు యేన్నేన్నో కలలుగ కంటావు
కల్లలు కాగానే కన్నీరౌతావు
మౌనమే నీ భాష... ఓ మూగ మనసా.. ఓ మూగ మనసా
చీకటి గుహ నీవు... చింతల చెలి నీవు
చీకటి గుహ నీవు... చింతల చెలి నీవు
నాటక రంగానివే మనసా... తెగిన పతంగానివే
ఎందుకు వలచేవో... ఎందుకు వగచేవో
ఎందుకు రగిలేవో... యేమై మిగిలేవో
మౌనమే నీ భాష... ఓ మూగ మనసా
తలపులు యేన్నేన్నో కలలుగ కంటావు
కల్లలు కాగానే కన్నీరౌతావు
మౌనమే నీ భాష... ఓ మూగ మనసా.. ఓ మూగ మనసా
కోర్కెల సెల నీవు కూరిమి వల నీవు
కోర్కెల సెల నీవు కూరిమి వల నీవు
ఊహల ఉయ్యాలవే మనసా... మాయల దెయ్యానివే
లేనిది కోరేవు.. ఉన్నది వదిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
మౌనమే నీ భాష... ఓ మూగ మనసా
తలపులు యేన్నేన్నో కలలుగ కంటావు
కల్లలు కాగానే కన్నీరౌతావు
మౌనమే నీ భాష... ఓ మూగ మనసా.. ఓ మూగ మనసా
https://youtu.be/x-Pt3Lh50L0

5 కామెంట్‌లు:

శ్యామలీయం చెప్పారు...

చాలా విచారకరమైన వార్త. బాలమురళిగారు ధన్యజీవి. బహుశః టివీ ఛానెళ్ళలో ఆయన గురించి కార్యక్రమాలు ఏమన్నా వేస్తున్నారేమో. రాత్రి పదకొండు దాటాక చూడటానికి ప్రయత్నిస్తాను.

(అంతవరకూ మా టీవీలో తెలుగుసీరియళ్ళు మారుమ్రోగుతూ ఉంటాయి నిర్విరామంగా - యుగప్రళయం వచ్చినా కరెంటు ఉన్నంతసేపూ అవి పూర్తిగా ఆడవలసిందే మాటీవీలో. అవి పూర్తయ్యే దాకా, నేను టీవీ చూడట అసాధ్యం మరి.)

SD చెప్పారు...

కొంతకాలం క్రితం ఇండియాలో ఏదో హాల్లో గుప్పెడు మనసు సినిమా వేస్తూంటే వెళ్ళాను. కాసేపటికి బోరు కొట్టడం మొదలైంది. ఎలాగరా భగవంతుడా అనుకుంటూ చూస్తూనే ఉన్నాను. ఇంతలో ఇదీ పాట గొంతు ఖంగుమంటూ. ఒక్క మూడు నిముషాలలో తలనెప్పీ, సినిమా బోరూ అన్నీ ఎగిరిపోయాయి. అప్పట్నుండి ఎప్పుడూ మళ్ళీ ఈ పాట వినలేదు కానీ మనసులో అలా ఉండిపోయింది. ఆయన చాలా సార్లు అమెరికా వచ్చారని తెలుసుకానీ ఎప్పుడూ చూడడం కుదరలేదు. అలాగే చిట్టిబాబు కూడా. ఆయన సంగీతం వినడమే తప్ప ఎప్పుడూ చూసింది లేదు - ఆఖరికి మా ఊరి కి వచ్చి కచేరీ చేసినా సరే. ప్రాప్తం ఉండొద్దూ?

SD చెప్పారు...

సినిమా పేరు తప్పు అయి ఉండొచ్చు కూడా. చాలా కాలం క్రితం చూసినది కనక.

శ్యామలీయం చెప్పారు...

'గుప్పెడు మనసు' సినిమాలోనిదే నండి ఈ‌పాట.
ఇక్కడ వినండి: https://www.youtube.com/watch?v=zPv2SJ5Q2KY

అజ్ఞాత చెప్పారు...

Sir I request you to draw a bigger and detailed sketch of Balamurali garu who is performing with a smile with full features. Grateful to you.

ముందు చూపు కలిగి - ఆటవెలది

ఎంత చక్కటి చిత్రమో 😍 ఆటవెలది // ముందు చూపు గలిగి ముందునిద్ర యనుచు  కన్ను మూసి మంచి కలలు గనుచు  హాయిననుభవించు రేయి పగలు  యంత దూర దృష్టి వింత...