19, నవంబర్ 2016, శనివారం

ప్రియతమా - కవిత - పెన్సిల్ చిత్రం



My Pencil drawing
సోదరి Velamuri Luxmi కవితకి స్పందించి నేను వేసిన పెన్సిల్ చిత్రం.
ప్రియతమా !
అనుకోని అతిథిలా ప్రవేశించావు ...
మనసేంటి జీవితమంతా అల్లుకుపోయావు ...
నువ్వు స్పష్టాష్పష్టపు ప్రేమతో ముంచెత్తినావు ...
నేనే..నువ్వన్నావు ..నువ్వే నేనన్నావు ...
కలలు చూపించినావు ..మెరిపించి మురిపించినావు ....
వేయి కళ్ళతో ఎదురుచూడమన్నావు ....
కనులువాల్చి తొంగి చూస్తే , గుండెనిండా నిండి వున్నావు ...
కనులుమూసివుంచితే ప్రత్యక్షమౌతున్నావు ....
తలెత్తి ఆకాశంవంక చూస్తే నువ్వే కనబడుతున్నావు ....
నీ రాకకై ఎదురు చూడమన్నావు ....
ఏదో " అద్భుతం " జరుగుతుందన్నావు ....
మన కలయిక సత్యమన్నావు ...
నేనూ నువ్వూ ఒకటన్నావు ....
మధ్యాహ్న మార్తాండుడు మండిపడుతున్నాడు ....
ఎక్కడో ఒక చెట్టుమీద ఒంటరి కాకి దాహంతో అరుస్తోంది ...
నాలో విరహాగ్నులు ఎగసి పడుతున్నాయి ....
ఎందుకు నాజీవితం లోనికి ప్రవేశించావు ....
ఎందుకు నన్ను పిచ్చిదాన్ని చేశావు .....
నిను చూడకుండా వుండ లేక పోతున్నాను ....
నను చూడలనిపించదా నీకు ...
చూడడం ఏమిటి ? తలవను కూడా తలవవేమో నువ్వు ..
ఏమిటో అతలాకుతలమైపోయింది నా మనస్సు ...
ఎందుకిలా నన్ను మోసం చేశావు ....
నన్నేమిటి ....నా వునికినే మరచిపోయేలా చేశావు ..
నీ వశమైన నా మనస్సు నిన్ను విడచి రానంటోంది ...
నీ ఇష్టం ఏం చేస్తావో చెయ్యి ......
నేస్తం అననా ? ప్రియతమా అననా ? ...
ఏమనను నిన్ను ...నా ప్రాణంగా భావించిన నిన్ను ....
ఇంతటి మోసమా ...ప్రియా ....

కామెంట్‌లు లేవు:

రాగ మాలిక - కథ

 మీ చిత్రం - నా కథ. రాగమాలిక రచన: మాలా కుమార్ మాలిక  కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేసరికి డ్రాయింగ్ రూం అంతా నీట్ గా సద్ది ఉంది. అమ్మ వంటింట్లో హడ...