18, నవంబర్ 2016, శుక్రవారం

వి. శాంతారాం - చిత్ర నిర్మాత, దర్శకుడు, నటుడు - పెన్సిల్ చిత్రం.

 ఈ రోజు భారతదేశపు చలనచిత్ర రంగంలో చరిత్ర సృష్టించిన అద్భుత చిత్ర నిర్మాత, దర్శకుడు, నటుడు వి. శాంతారామ్ జయంతి. ఈ సందర్భంగా నేను వేసిన పెన్సిల్ చిత్రం. ఈ అద్భుత వ్యక్తి గురించి వికీపీడియా వారు ఏమంటున్నారో ఈ క్రింది లింకు క్లిక్ చేసి తెలుసుకుందాం.

https://te.wikipedia.org/wiki/వి._శాంతారాం

శాంతారామ్ గురించి శ్రీమతి పొన్నాడ లక్ష్మి గారు facebook లో ఇలా వ్రాశారు.

"శాంతారాం గారి సినిమాలంటే నాకు చాలా ఇష్టం. అయన ఒక కళాతపస్వి. అతను తీసిన చిత్రాలన్నీ ఆణిముత్యాలే. ప్రతీ చిత్రంలో ఎదో ఒక కళకు ప్రాముఖ్యత ఇచ్చి నిర్మిస్తారు.' ఝనక్ ఝనక్ పాయల్ బాజేలో' నృత్యానికి, 'నవరంగ్' లో కవిత్వానికి, 'గీత్ గాయా పత్తరోన్' చిత్రంలో(ఇది మన 'అమరశిల్పి జక్కన' చిత్రానికి ఆధారం. చక్కగా సాంఘిక చిత్రంగా మలిచారు) శిల్పానికి, ఇలా ఎన్నో కళలని దృశ్యకావ్యాలుగా మనకి అందించారు. వారి చిత్రాలలో పాటలు అమృత గుళికలు. 'జల్ బిన్ మచిలీ' చిత్రంలో ఒక పాము డాన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది . అది మన తెలుగుచిత్రం 'అగ్నిపూలు' లో జయప్రద గారు చేసారు కూడా. అంతే కాదు వారి చిత్రాలు సందేశాత్మకంగా ఉండి ప్రజలని ఆలోచింపజేసేలా ఉంటాయి. ఉదాహరణకి 'తూఫాన్ అవుర్ దియా' చిత్రంలో ఎన్నికష్టాలు వచ్చినా ఎదుర్కొని నిలబడాలని, 'దో ఆంఖేన్ బారాహాత్' చిత్రంలో మంచితనంతో ఎంత దుర్మార్గులనైనా మార్చవచ్చనీ, 'సుభా క తారా' చిత్రంలో విధవా వివాహ సంస్కకరణ గురించి చెప్పారు.. ఇలా ఎన్నో అద్భుత చిత్రాలు వారి దర్సకత్వంలో వెలువడ్డాయి.వారికి మన ప్రభుత్వం 'పద్మవిభూషణ్' 'దాదా సాహెబ్ ఫాల్కే' వంటి అత్యుత్తమ పురస్కారాలు అందించి సత్కరించింది."

కామెంట్‌లు లేవు:

The power of 'Will' Usage - English grammar - illustration

  When we use will to make a promise 🤝 or an offer 💡, we are usually deciding to do something at the very moment we are speaking. It shows...