5, ఫిబ్రవరి 2019, మంగళవారం




వహీదా రెహమాన్ - నా pencil sketch.


వహీదా రెహమాన్ అంతరంగం - శ్రీ ప్రసాద్ KV గారికి కృతజ్ఞతలతో ..

*నిన్ననే...బొంబాయి నుండి మద్రాస్ వచ్చాను....ఎంతో హాయిగా...ఆనందంగా. మళ్ళీ ఇప్పుడు ఈ ఫ్లైట్

ఎక్కాల్సొచ్చింది....ఇది అనుకోని పయనం. కళ్ళలో నీళ్ళు నిండుకుంటున్నా...గుండె చిక్కబట్టుకుని....గీతాదత్ ఇంటికి చేరుకున్నా!*
*అప్పుడే....అంతిమయాత్ర మొదలయ్యింది. పేటిక గుమ్మం దాటివచ్చేస్తుంది. వెనకాల శోకమూర్తిలా గీత....తనకు ఓదార్పునిస్తూ..భుజాలను పట్టుకుని....మీనాజీ! చివరిచూపు కూడా సరిగ్గా చూడలేదు! వీడ్కోలు పలికేందుకొచ్చిన వారు ఏదో ఓదార్పు మాటలంటున్నారు. కానీ....తనతో ఎవ్వరూ మాట్లాడటం లేదు! గురు...ఆత్మహత్య కు....నేనే కారణమన్నట్లు....ఆ చూపులు గుచ్చుకుంటున్నాయి!అక్కడ ఉండలేక...తిరుగు టపా అయ్యాను!*
*ఇది 11 అక్టోబర్ 1964 నాటి ప్రఖ్యత నటదర్శకుడు...గురుదత్ ఆత్మహత్యతో...నా.. అనుభవం!*
*జీవితం ఓ కలలా....అనిపిస్తుంది! మొన్ననే....చెంగల్పట్టు లో సోదరి షహీదా తో కలిసి భరత నాట్యం నేర్చుకున్నట్లుంది. ముస్లిం లలో అది అంత ఈజీ కాదు. గొప్పనాన్న...కమీషనర్...పరదా ముసుగు తీసి...స్వేఛ్ఛ నిచ్చారు. టీన్స్ లోనే...నాన్న పోవడం....సోదరి తో కలిసి మద్రాస్ లో ఆరంగేట్రం చేయడం...అది చూసి...మొట్టమొదటి సినిమా డాన్స్ చాన్స్ రావడం....
*ఏరువాక సాగారో రన్నో చిన్నన్న*.....దేశాన్నే ఓ ఊపు ఊపేసిన గర్వం...వెంటనే...ఎన్.టి.ఆర్....జయసిం హ లో రాకుమారి రోల్. రోజులు మారాయి శతదినోత్సవం రోజున గురుదత్ పరిచయం...ఆయన తన మూవీ సి.ఐ.డి. లో వాంప్ రోల్ ఆఫర్ ఇవ్వడం....అందులో హీరోయిన్ షకీలా కంటే...తనకే ఎక్కువ పేరు రావడం....వెంట వెంటనే....హిందీ సినిమాల ఆఫర్లు జోరుగా రావడం....అదో వైభవం! ఆ రోజులిక మళ్ళీ రావు!*
*నిజమే నా మెంటర్ గా గురు ను ఒప్పుకుంటాను. ప్యాసా(57), కాగజ్ కె ఫూల్(59).....కాగజ్ కె ఫూల్ విడుదలైనప్పుడు....డిజాస్టర్ అయ్యి గురు ను డిప్రెస్ చేసింది. ఇప్పుడందరూ క్లాసిక్ అని మెచ్చుకుంటున్నారు! గురు ఎప్పుడూ...కాలంతో పయనించడు. ఓ పది అడుగులు ముందే ఉండేవాడు! వర్తమానం అనవసరం! ఓ స్వాప్నికుడు! విదేశీయుల కుండే స్వేఛ్ఛ....ఇండియాలో లేదంటాడు. సమాజం...ప్రక్కవారి గురించి పెద్దగా పట్టించుకోని స్వభావం....లివింగ్ టుగెదర్ లు....విదేశాలలో సాధ్యం. ఇప్పుడంటే....ఆ సంస్కృతి ఇక్కడకొచ్చేసింది కానీ...అప్పట్లో అది నాకు నచ్చేది కాదు. అక్కడే స్పర్ధలోచ్చాయి గురుతో!
*ఎవరి మూవీస్ వారికున్నాయి. వాటితో దూరం పెరిగింది. సోల్వా సాల్(58),12ఒ క్లాక్(58),కాలాబజార్(60),ఏక్ ఫూల్ చార్ కాంటే(60),గర్ల్ ఫ్రెండ్(60)...షూటింగ్ లతో బిజీ గా ఉన్న నాకు చౌంద్వీ కా చాంద్(60)లో మళ్ళీ గురు తో నటించే ఛాన్స్ వచ్చినా......మనసులో ఏర్పడ్డ దూరం....దూరం గానే ఉంది!*
*రూప్ కి రాణి చోరో కా రాజా(61),బీస్ సాల్ బాద్(62).....మళ్ళీ సాహిబ్ బిబీ ఔర్ గులాం(62) లో గురుదత్ తో కలిసి నటించడం. నా చుట్టూ ఓ గోడ కట్టేసుకున్నా. కెరీర్...ఇంత మంచి స్థితిలో ఉండగా...పెళ్ళంటే విముఖత లేదు గానీ...ప్రాక్టికల్ గా ఉంటూ...సర్దుకు పోయే మంచి వాడు కావాలి నాకు. ఎటువంటి పరిస్థితిలో ఈ కెరీర్ ను త్యాగం చేయలేను.*
*జూలై- 27- 1963....నా జీవితం లో మరచిపోలేను! మొట్టమొదట టి.వి. చూడగలిగాను. బెర్లిన్ చలనచిత్రొత్సవం కు సాహిబ్ బీబి ఔర్ గులాం ప్రదర్శనకు వెళ్ళి...ఆ రోజు ఉదయమే...టి.వి. లో మొట్టమొదట...అమెరికా ప్రెసిడెంట్ కెన్నెడీని చూశాను. ఆ సాయంత్రమే మా మూవీ ప్రదర్శన జరిగింది. పెద్దగా నచ్చలేదు విదేశీయులకు మా మూవీ. గురూ...షరా మామూలే. బాగా డిప్రెస్ అయ్యాడు.*
*ఇక బాగా బిజీ అయిపోయాను......షూటింగ్ లతో. ఉన్నట్లుండి ఈ గురు సూయిసైడ్ వార్త! ఆ తరువాత......నన్ను నేను మర్చిపోయేంతగా......షూటింగ్స్ తో బిజీ అయ్యాను. కొహ్రా,గైడ్, రాం ఔర్ శ్యాం,పథ్తర్ కె సనం,నీల్ కమల్, షగున్.......ఇలా ఎన్నో... రోల్స్ చూజ్ చేసుకునేంతగా ఎదిగాను.*
*ఎర్లీ 70 వ దశకం దాకా....తిరుగులేకుండా నటించాను! ఇక కాస్త వెరైటీగా ఉండాలని రేష్మ ఔర్ షేర(71) చేశాక...73 లో వెరైటీ రోల్ అని జయబాధురి కి తల్లిగా...ఫాగున్..నటించడం పొరబాటైంది! ఇక అప్పటి నుండి ....అన్నీ అలాంటి రోల్సే....ఆఫర్స్. బోర్ అనిపిస్తోంది. అప్పుడే ఫరీద్ అహమ్మద్ సిద్దిక్ తో ఎంగేజ్ మెంట్ అయ్యింది. కారణాలేమైతేనేం.....నా పెళ్ళి మాత్రం కమల్ జీత్ తో జరిగింది....సింపుల్ గా బాంద్రా లోని నా ఇంట్లోనే! కమల్ జీత్ ...నాతో షగున్ (64) లో నటించాడు. జూలై- 27- 1974....అంటే పదేళ్ళ తరువాత పెళ్ళి జరిగింది!*
*కుమారుడు సొహైల్(75), కుమార్తె కాశ్వి(76) లతో....హౌస్ వైఫ్ గా కాలం గడిచిపోయింది. వారి ఫార్మ్ బెంగుళూర్ లో ఉండటం తో అక్కడకు షిఫ్ట్ చేశాం ఫామిలీ ని. అప్పుడప్పుడు సపోర్టింగ్ రోల్స్ చేశాను.కభీ కభీ, నంకీన్, నమక్ హలాల్(82), మషాల్(84),చాంద్నీ(89), లమ్హే(91)...ఇలా!
*2000- సరిగ్గా జూలై- 27 న....నా హస్బెండ్ స్వర్గస్తులయ్యారు! అందుకే *జూలై- 27*....డేట్ ను మర్చిపోలేను!*
*పరుగులు తీస్తున్న కాలంతో....నేనూ చేయికలిపి...ఇంకా నటిస్తూనే ఉన్నా! కారెక్టర్ రోల్స్ లో.అడాప్టబులిటీ. ఇది నాకు దేవుడిచ్చిన వరం.
వాటర్(2005),15త్- పార్క్ ఎవెన్యూ(2005),రంగ్ దె బసంతి(2006),చుక్కల్లో చంద్రుడు(2006),డిల్లీ-6(2009), ద సాంగ్ ఆఫ్ స్కార్పియన్స్(2017), లేటెస్ట్ గా విశ్వరూపం- 2 లో కూడా నటించా!*
*పిల్లలు సెటిల్ అవ్చడమే కాదు...గ్రాండ్ చిల్డ్రెన్ కూడా పెద్దవాళ్ళౌతున్నారు. ఇంకా నటించాలనే నా కోరిక! అప్పట్లో సినిమా షూటింగ్ లో స్నేహపూర్వక వాతావరణం ఉండేది! ఇప్పుడది లేదు! కానీ డిల్లీ- 6...షూటింగ్ మాత్రం ఎంతో ఎంజాయ్ చేశా! అదో పండుగ లా అనిపించింది!
*ఎన్ని మూవీస్ చేసినా....నా మనస్సుకు నచ్చినవంటే.....ప్యాసా, తీస్రీ కసం, గైడ్ & ఖామోషి లను చెప్తాను.*
*ఈ 81 వ పుట్టిన రోజున....ఆ సృష్టికర్త నొక్కటే కోరేది....నటిస్తూనే....ప్రశాంతంగా నిష్క్రమించాలి...ఈ జీవిత నాటక రంగం నుండి....అని.*

కామెంట్‌లు లేవు:

బి. గోపాలం - సంగీత దర్శకుడు, , నటుడు

బి గోపాలం - సంగీత దర్శకుడు గాయకుడు నటుడు  (my charcoal pencil sketch)  Facebook మిత్రులు వీర నరసింహారాజు గారి వాల్ నుండి సేకరణ యధాతధంగా. వార...