24, మే 2022, మంగళవారం

"అఖిలలోకైకవంద్య హనుమంతుడా సీత- శిఖామణి రామునికి చేకొని తెచ్చితివి" - అనమయ్య కీర్తన - చిత్రం : పొన్నాడ మూర్తి


 

అఖిలలోకైకవంద్య హనుమంతుడా సీత-
శిఖామణి రామునికి చేకొని తెచ్చితివి ॥పల్లవి॥


అంభోధి లంఘించితివి హనుమంతుడా
కుంభినీజదూతవైతి గురు హనుమంతుడా
గంభీరప్రతాపమున కడగితివి
జంభారిచే వరములు చయ్యన నందితివి ॥అఖిల॥


అంజనీదేవికుమార హనుమంతుడా
కంజాప్తఫలహస్త ఘన హనుమంతుడా
సంజీవని దెచ్చిన శౌర్యుడవు
రంజిత వానరకుల రక్షకుండ వైతివి ॥అఖిల॥


అట లంక సాధించిన హనుమంతుడా
చటుల సత్త్వసమేత జయ హనుమంతుడా
ఘటన నలమేల్మంగకాంతు శ్రీవేంకటేశునకు
తటుకన బంటవై ధరణి నిల్చితివి ॥అఖిల॥

కామెంట్‌లు లేవు:

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...