బుజ్జాయి - కలం చిత్రం
ప్రముఖ కార్టూనిస్ట్, చిత్రకారుడు, రచయిత 'బుజ్జాయి'. అసలు పేరు దేవులపల్లి సుబ్బరాయ శాస్త్రి.
వీరు దేవులపల్లి కృష్ణశాస్త్రి, రాజహంస దంపతులకు సెప్టెంబరు 11 1931లో జన్మించారు. బుజ్జాయి గారిని కృష్ణశాస్త్రి గారు అందరిలా పాఠశాలకు పంపకపోవడంతో, ఆయనకి సంప్రదాయ పద్ధతుల్లో విద్యాభ్యాసం జరుగలేదు. సాంప్రదాయక చదువులు చదవకపోయినా ఆయన తనకంటూ ఓ ప్రత్యేక పేరును సంపాదించుకున్నారు. ఆయన తండ్రి వెన్నంటే ఉండేవారు.
శ్రీశ్రీ, విశ్వనాథ సత్యన్నారాయణ వంటి కవుల, రచయితల, యితర ప్రముఖులతో ఆయన తన అనుభవాలను "నాన్న-నేను" అనే పుస్తకంలో కథలుగా వివరించారు. పంచతంత్ర కామిక్స్ ను మొట్టమొదట ఆంగ్లం లో ఆయన రాసారు.
17 సంవత్సరాల వయసులో బుజ్జాయి "బానిస పిల్ల" అన్న బొమ్మల పుస్తకం ప్రచురించి 'కామిక్ స్ట్రిప్' పుస్తకాలకు దేశంలోనే ఆద్యుడిగా పేరుపొందారు. బాపు రమణల బుడుగు లాంటి క్యారెక్టర్ డుంబు సృష్టికర్త ఈయనే. పంచతంత్ర కథలకు ముచ్చటైన బొమ్మలు వేసి ఇలస్ట్రేటెడ్ వీక్లీలో 1963 నుంచి 68 వరకూ సీరియల్ గా ప్రచురించారు. లక్షలమందిని ఆకట్టుకున్నారు. ఈ ఇంగ్లిష్ కామిక్స్ 5 పుస్తకాలుగా వచ్చాయి. మిత్రలాభం, మిత్రభేదం పుస్తకాలుగా ఇవి తెలుగులోనూ దొరుకుతున్నాయి. ఆయన డుంబు, భైరవ్, పెత్తందార్ కామిక్ స్ట్రిప్పులను వేసారు.
91 యేళ్ళ వయసులో దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి వృద్ధాప్య సమస్యలతో పాటు కొంత కాలం అనారోగ్యంతో బాధపడుతూ 27 జనవరి 2022న చెన్నైలోని స్వగృహంలో కన్నుమూశారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి