14, జనవరి 2024, ఆదివారం

నీ నవ్వుల జల్లులతో వచ్చెనులే సంక్రాంతులు - గజల్


మిత్రులు శ్రీ Madhav Rao Koruprolu  గారు ఈ చిత్రానికి రచించిన అద్భుతమైన గజల్. వారికి నా ధన్యవాదాలు.


ఆత్మీయ మిత్రులు నిరుపమ చిత్రకారుడు మాన్యశ్రీ Pvr Murty గారికి అంకితంగా.. 🌹🙏🌹🌹🙏🌹👍💖😊😊💖🦜

5644..గజల్ 


నీ నవ్వుల జల్లులతో..వచ్చునులే సంక్రాంతులు..! 

నీ వలపుల కళకళతో..వెలుగునులే సంక్రాంతులు..! 


నీ సిగ్గుల గంధమెంత..మనోహరమొ ఏంచెప్పను.. 

నీ తలపుల వెన్నెలతో..పొంగునులే సంక్రాంతులు..!


ఆకుపచ్చ సోయగాల..పసిడిరాశి నీవె చెలీ.. 

నీ వాడని సొగసులతో..పండునులే సంక్రాంతులు..! 


నిత్యపూర్ణ మకరరాశి..నీతోడుగ ఉన్నదిలే.. 

నీ అందెల సడిసాక్షిగ..పాడునులే సంక్రాంతులు..! 


మరువతగని పారిజాత..గంధరాశి నీ మనస్సు.. 

నను వీడక అలరించగ..చూడునులే సంక్రాంతులు..! 


నిజతులసీ వనసీమవు..నీవన్నది రుజువైనది.. 

పవిత్రతా పవనాలను..పంచునులే సంక్రాంతులు..! 


మాధవ గజలై విరిసే..'మూర్తి'మత్వ తేజోనిధి.. 

'పీవియారు'చెలికన్నుల..నింపునులే సంక్రాంతులు..!

కామెంట్‌లు లేవు:

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...