23, ఆగస్టు 2023, బుధవారం

ముత్తులక్ష్మి రెడ్డి


Muttulakshmi Reddi - Charcoal pencil sketch


ముత్తులక్ష్మి రెడ్డి గొప్ప సంఘ సంస్కర్త, విద్యావేత్త, రాజకీయ వేత్త, స్త్రీ హక్కుల ఉద్యమశీలి, భారతదేశపు మొదటి మహిళా శాసనసభ్యురాలు. .


ముత్తులక్ష్మి రెడ్డి గారు 1886వ సంవత్సరం జూలై నెల 30 వ తేదీన పుదుక్కోటై సంస్ఠానంలో నారాయణ సామి, చంద్రమ్మాళ్ దంపతులకు జన్మించారు. ఆడ పిల్లల చదువుకు ఆంక్షలు ఉన్న ఆ కాలం లోనే ముత్తులక్ష్మి రెడ్డి గారు 1912వ సంవత్సరంలో  మద్రాసు వైద్య కళాశాల నుండి వైద్య పట్టా అందుకున్నరు.


శ్రీమతి సరోజని నాయుడు గారి ప్రేరణతో వీరు స్త్రీల సామాజిక, ఆర్థిక, రాజకీయ ఉన్నతికై పోరాడారు. వీరి సేవలను మెచ్చి నాటి  మద్రాస్ రాష్ట్ర ప్రభుత్వము శాసన మండలి సభ్యురాలిగా వీరిని 1927వ సంవత్సరంలో నియమించారు. ఆ విధంగా భారతదేశపు మొట్ట మొదటి మహిళా శాసన సభ్యురాలయ్యారు. శాసన మండలి సభ్యురాలిగా దేవదాసీ విధాన రద్దు, కనీస వివాహ వయసు పెంపు, నిర్బంధ వ్యభిచారం రద్దు, బాలల హక్కుల రక్షణ తదితర విషయాలపై పోరాడారు. 1931వ సంవత్సరం అఖిల భారత మహిళల సదస్సు (ఆల్ ఇండియా విమెన్స్ కాన్ఫరెన్స్) కు అధ్యక్షత వహించారు. ఈ సదస్సు తరపున మహిళల ఓటు హక్కుకై పోరాడారు.   గాంధీ  గారిచ్చిన ఉప్పు సత్యాగ్రహ పిలుపుతో శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు.


(సౌజన్యం : వికీపీడియా)



త్రిపురనేని గోపీచంద్

.

సాహితీవేత్త, సినిమా దర్శకుడు త్రిపురనేని గోపీచంద్ .. నా charcoal pencil sketch.

ఈ మహనీయుని గురించి నేను సేకరించిన వివరాలు క్రింద పొందుపరుస్తున్నాను.

వీరి గురించి 

ప్రముఖ తెలుగు నవలా రచయిత త్రిపురనేని గోపీచంద్ కి  నవలా  సాహిత్యంలో  సుస్థిర స్థానాన్ని సాధించి పెట్టిన అసమర్థుని జీవయాత్ర తెలుగులో మెట్టమొదటి మనో వైజ్ఞానిక నవల. ఈ నవల 1945-46లో రాశారు. ఆంధ్రరభ దినపత్రిక ఆదివారపు సాహిత్యానుబంధాలలో సీరియల్‌ నవలగా వెలువడింది. 

వీరి గురించి సూర్య దినపత్రిక వారు వివరాణాత్మక వ్యాసం ప్రచురించారు. ఈ క్రింది లింక్ క్లిక్ చేసి చదవగలరు.
పత్రిక యాజమాన్యానికి నా ధన్యవాదాలు. 


 https://suryaa.co.in/tripuraneni-gopichand/

19, ఆగస్టు 2023, శనివారం

పద్మశ్రీ అన్నవరపు రామస్వామి - charcoal pencil sketch


My charcoal pencil sketch of Padmasri Annavarapur Ramaswamy, 

ఎందరో మహానుభావులను నా చిత్రలేఖనంలో తీర్చిదిద్దుతున్నాను. అందులో భాగంగా ఈనాడు వయొలిన్ విద్వాంసులు చిత్రం చిత్రీకరించాను.  వారి గురించి నేను సేకరించిన వివరాలు ఈ క్రిందన పొందుపరుస్తున్నాను.


అన్నవరపు రామస్వామి
 లేదా అన్నవరపు (మార్చి 23, 1926) ఒక భారతీయ వాయోలిన్ విద్వాంసులు. ఆయన ప్రతిభకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2021 లో పద్మశ్రీ అవార్డ్ తో సత్కరించింది,  1996 లో ఈయనను సంగీత నాటక అకాడమీ పురస్కారంతో /సత్కరించింది.  ఆయన 1948 నుండి 1986 వరకు ఆల్ ఇండియా రేడియో (ఆకాశవాణి)కు తమ సేవలందించారు. 1988 లో, ఆల్-ఇండియా రేడియో (AIR) ఆయనను టాప్ గ్రేడ్ కర్ణాటక సంగీతకారుడిగా పేర్కొంది.[5] కర్ణాటక సంగీతకారులైన పారుపల్లి రామకృష్ణయ్య పాంతులు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, అరియకుడి రామానుజ అయ్యంగార్, చెంబై వైద్యనాథ భాగవతార్, జి.ఎన్. బాలసుబ్రమణ్యం, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, టి.ఆర్.మహాలింగం, సుందరం బాలచందర్కు వాయులీన సహకారం అందించారు. ఆయన పండిట్ వినాయకరావు పట్వర్ధన్, పండిట్ భీమ్సేన్ జోషి, పండిట్ జస్రాజ్ వంటి వివిధ హిందుస్తానీ సంగీతకారులకు వయోలిన్ సహకారం అందించారు. ఆయన సహకార వాద్యుడిగానేగాక స్వతంత్రంగా కూడా కచేరీలు చేశారు.

మరిన్ని వివరాలు ఈ క్రింది లింక్ క్లిక్ చేసి చదవండి.



8, ఆగస్టు 2023, మంగళవారం

ఆరుద్ర, తెలుగు కవి



ఆరుద్ర - charcoal pencil sketch 

ఆరుద్ర 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలో జన్మించాడు. విశాఖపట్నం ఎ.వి.యన్. కాలేజీ ఉన్నత పాఠశాల లో, తర్వాత విజయనగరంలో యం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు. క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‍లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. 1947-48 లో చెన్నై నుంచి వెలువడే వారపత్రిక ' ఆనందవాణి 'కి సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో శ్రీశ్రీ, చిత్తూరు బాలాజీ ఆరుద్ర వ్రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించాయి. అభ్యుదయ రచయితల సంఘం (అరసం) వ్యవస్థాపకుల్లో ఒకడైన ఆరుద్ర ఆ సంస్థ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఆరుద్ర మహాకవి శ్రీశ్రీ గారికి వేలువిడిచిన మేనల్లుడు. రచయిత చాగంటి సోమయాజులు (చాసో) మార్కిస్టు భావాలను నూరిపోశాడని, ఆరుద్ర కవితాధోరణిలో శ్రీశ్రీ ప్రభావం కొంతవరకూ ఉందని సాహితీ విమర్శకులు అంటారు.

6, ఆగస్టు 2023, ఆదివారం

బి. ఎన్. రెడ్డి


బి. ఎన్. రెడ్డి, charcoal pencil sketch. drawn by me.


బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి (బి.ఎన్.రెడ్డి) (నవంబర్ 16, 1908 - నవంబర్ 8, 1977) సినీ దర్శక నిర్మాత. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తొలి దక్షిణ భారతీయుడు. ఆయన సృష్టించిన మల్లీశ్వరి బహుళ ప్రజాదరణ పొందిన చిత్రం. బి.ఎన్.రెడ్డి తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తొలి దక్షిణ భారతీయుడు.[1] పద్మ భూషణ్ పురస్కార గ్రహీత.


మరిన్ని వివరాలు ఈ క్రింది లింక్ లో చదవండి. courtesy : Wikipedia


https://te.wikipedia.org/wiki/%E0%B0%AC%E0%B0%BF.%E0%B0%A8%E0%B0%BE%E0%B0%97%E0%B0%BF%E0%B0%B0%E0%B1%86%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B0%BF



డా. గోవిందరాజుల సుబ్బారావు



గోవిందరాజుల సుబ్బారావు - charcoal pencil sketch

డా. గోవిందరాజుల వెంకట సుబ్బారావు (1895 - 23 అక్టోబర్ 1959) ప్రముఖ తెలుగు నాటక మరియు  సినీరంగ ప్రముఖుడు.

గోవిందరాజు సుబ్బారావు తెలుగు సినిమాలలో, నాటకాలలో తొలితరం నటుడు. నాటక రంగంపై కన్యాశుల్కంలో లుబ్ధావధాన్లుగా, సినిమా రంగంలో మాలపిల్లలో సుందర రామశాస్త్రి పాత్రలోనూ, బాలనాగమ్మలో మాయల మరాఠీగానూ ప్రఖ్యాతుడయ్యాడు. రంగస్థలంపై అద్భుతమైన విజయాన్ని సాధించిన తరువాత, అతను మాలపిల్ల (1938) చిత్రంతో తెలుగు చలనచిత్ర రంగంలోకి ప్రవేశించాడు. తన 20 ఏళ్ల సినీ జీవితంలో డా.సుబ్బారావు 50కి పైగా చిత్రాల్లో నటించారు. అతను విజయవంతమైన వైద్య అభ్యాసకుడు కూడా.


(సేకరణ)

3, ఆగస్టు 2023, గురువారం

ఆదుర్తి సుబ్బారావు - తెలుగు సినిమా దర్శకుడు


ఆదుర్తి సుబ్బారావు - నా charcoal pencil sketch.


ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు. పలు విజయవంతమైన చిత్రాలు తెలుగు, హిందీ భాషలలో నిర్మించారు.


వారి గురించి వివరంగా ఈ క్రింద్ లింక్ క్లిక్ చేసి తెలుస్కోవచ్చు


https://te.wikipedia.org/wiki/%E0%B0%86%E0%A6%E0%B0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BF_%E0%B0%B8%E0%B1%81%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81

పాలగుమ్మి పద్మరాజు -- రచయిత

 పాలగుమ్మి పద్మరాజు రచయిత -  పెన్సిల్ స్కెచ్ పాలగుమ్మి పద్మరాజు ( జూన్ 24 , 1915 - ఫిబ్రవరి 17 , 1983 ) ప్రముఖ తెలుగు రచయిత, కేంద్ర సాహిత్...