13, ఫిబ్రవరి 2024, మంగళవారం

గ్రహణం విడిచిన సుఖమిది! కుసుమం విరిసిన క్షణమిది! - తెలుగు గజల్


 

నా చిత్రానికి డా!! ఉమాదేవి ప్రసాదరావు జంధ్యాల గారు రచించిన గజల్

॥గజల్ ॥12 మాత్రలు 

~~~🔹❤️🔹~~~


గ్రహణం విడిచిన సుఖమిది!

కుసుమం విరిసిన క్షణమిది!


 తనదనుకొను యెదనవ్రాలి

 మైమరచిన శుభఘడియిది!


బ్రహ్మముడులతో బిగిసిన 

పచ్చనైన కాపురమిది!


అందం చందం కలిసిన  

పూలపూల గోపురమిది!


ఇరువురు ఒకటై లాగే 

 మన్మథుడెక్కిన  రథమిది! 

 

హృదయపు పేటిక నుంచిన  

ఎన్నడు తరగని ధనమిది!

~~~~~~~~~~~

డా. ఉమాదేవి జంధ్యాల

మైలవరపు గోపి - గీత రచయిత


మైలవరపు గోపి - నా charcoal pencil చిత్రం

మైలవరపు గోపి (ఆగస్టు 15, 1949 - సెప్టెంబర్ 8, 1996) తెలుగు సినిమా రంగంలో ఒక ఉత్తమమైన భావాలున్న రచయిత. వీరి పూర్తిపేరు మైలవరపు లక్ష్మీ గోపాలకృష్ణమూర్తి 

తెలుగు సినిమా రంగంలో ఉత్తమమైన భావాలున్న ఒక రచయిత గోపి. ఆత్రేయ అంతేవాసి, మరో మనసు కవి. మూడు దశాబ్దాలపాటు (1966-1996) విలువైన సినీసాహిత్యాన్ని సృజించాడు. ఆత్రేయ, రాజశ్రీ ల దగ్గర అసిస్టెంట్ గా పనిచేశాడు. 1965లో ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో ఆడిషన్‌ టెస్టులో ఎన్నికై కన్యాశుల్కం నాటకంలో గిరీశం శిష్యుడు వెంకటేశం పాత్రను పోషించాడు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, గోపి 1966 నుండే మంచి మిత్రులు. తొలినాళ్లలో ఇద్దరూ కలిసి, ఒకే గదిలో ఉండేవారు. గోపి ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోయాడు. ఇతడు మొత్తం 200 సినిమాలకుగాను 1500 పాటలు వ్రాశాడు. ఇరవై సినిమాలకు సంభాషణలు రచించాడు. మనసా కవ్వించకే అనే సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు రాయడంతో పాటు దర్శకత్వం కూడా నిర్వహించాడు.


మరిన్ని వివరాలు వికీపీడియాలో చూడగలరు. అయితే వీరి ఫోటో వికీపీడియాలో లేదు. వేరొకచోట లభిస్తే చూసే నా charcoal pencil తో చిత్రీకరించాను. 

12, ఫిబ్రవరి 2024, సోమవారం

పట్రాయని సీతారామ శాస్త్రి - ప్రముఖ సంగీత విద్వాంసుడు - charcoal pencil sketch

అలనాటి ఫోటో ఆధారంగా charcoal pencil తో  చిత్రీకరించిన చిత్రం ఇది.

వికీపీడియా ఆధారంగా నేను తెలుసుకున్న వివరాలు :

జననం : 20 మార్చి 1900 
మరణం 17 ఏప్రిల్ 1957 

పట్రాయని సీతారామశాస్త్రి - సుప్రసిద్ధ గాయకుడు, వాగ్గేయకారుడు. వీరు  సాలూరు చిన గురువుగా   ప్రసిద్ధులు . ఇతని తండ్రి  పత్రాయని నరసింహశాస్త్రి   (సాలూరు పెదగురువు) (1872-1931) వద్ద సంగీతం  నేర్చుకున్నాడు. ఇతని పూర్వీకులు ఒకాయన సైనిక అధిపతిగా పనిచేసి కీర్తి ప్రతిష్టలు సంపాదించాడు. పట్రాయుడు అంటే సైనికాధికారి అని అర్థం. వ్యాకరణ రీత్యా ఇంటి పేర్లన్నీ తెలుగుదనం సంతరించుకున్న నేపథ్యంలో పట్రాయడు అనే ఇంటిపేరు పట్రాయనిగా కనిపిస్తోంది.  వీరు బరంపురం లో   విద్యాభ్యాసం చేసి, తన పదహారవ ఏటనే పద్యాలు, కీర్తనలు  రచన చేశారు . దేవాలయంలో సంగీత పోటీల్లో తొలి కచేరి చేసి స్వర్ణ పతకం పొందిన ఘనుడు సీతారామశాస్త్రి గారు.

మరిన్ని వివరాలు క్రింది లింక్ లో క్లిక్ చేసి  చూడవచ్చు 


https://te.wikipedia.org/wiki/%E0%B0%AA%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AF%E0%B0%A8%E0%B0%BF_%E0%B0%B8%E0%B1%80%E0%B0%A4%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF



 

వంకాయల నరసింహం - మృదంగ విద్వాంసులు


ప్రముఖ మృదంగ విద్వాంసులు శ్రీ వంకాయల నరసింహం - CHARCOAL PENCIL SKETCH

వీరి గురించి ఈ క్రింది లింకు క్లిక్ చేసి చదవండి.

https://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%82%E0%B0%95%E0%B0%BE%E0%B0%AF%E0%B0%B2_%E0%B0%A8%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BF%E0%B0%82%E0%B0%B9%E0%B0%82
 

11, ఫిబ్రవరి 2024, ఆదివారం

రేడియో అక్కయ్య 'న్యాయపతి కామేశ్వరి'

న్యాయపతి కామేశ్వరి (రేడియో అక్కయ్య)
Charcoal pencil sketch

రేడియో అక్కయ్యగా పేరుపొందిన న్యాయపతి కామేశ్వరి గారు విజయనగరంలో 1908లో జన్మించారు. ఈమె తండ్రి పేరిని జగన్నాధ దాసు. వీరిది పండితుల, విద్వాంసుల కుటుంబం. ప్రాథమిక విద్యాభ్యాసం తరువాత విశాఖపట్నంలోని క్వీన్ మేరీ బాలికల ఉన్నత పాఠశాలలో చదివారు. మరల విజయనగరం వచ్చి మహారాజా కళాశాలలో డిగ్రీ 1932లో పూర్తిచేశారు. ఆ కాలంలో బి.ఎ. పాసైన మొట్టమొదటి మహిళ మన కామేశ్వరి గారు. తరువాత కొంతకాలం నూజివీడు సంస్ధానం లో కపిలేశ్వరపురం జమిందారిణి జగదీశ్వరమ్మ గారికి ఇంగ్లీషు నేర్పారు. 1934లో న్యాయపతి రాఘవరావు గారితో వివాహం జరిగింది. తరువాత 1937లో మద్రాసులోని వెల్లింగ్టన్ టీచర్ ట్రైనింగ్ కాలేజీ లో ఉపాధ్యాయ శిక్షణ (ఎల్.టి.) పూర్తిచేశారు. ఇద్దరి అభిప్రాయాలు కలియడంతో భర్తకు తోడుగా, చెన్నై రేడియో కార్యక్రమాలలోను, బాల పత్రిక నిర్వహణలోను చురుగ్గా పాల్గొన్నారు.

చెన్నై ఆకాశవాణి కేంద్రం వారు ఆటవిడుపు పేరుతో పిల్లల కార్యక్రమ నిర్వహణ చేపట్టి, ఆ కార్యక్రమ నిర్వహణ వీరికిచ్చారు. ఈమె ఆ విధంగా రేడియో అక్కయ్యగా స్తిరపడిపోయారు. రాఘవరావుగారు ఈమె భర్త అయినా, ఈమెతో పాటుగా రేడియో కార్యక్రమాన్ని నిర్వహిస్తూండటంతో, అతనికి రేడియో అన్నయ్యగా పేరొచ్చింది. తరువాత ఈ కార్యక్రమం బాలానందంగా రూపాంతరం చెంది ఆకాశవాణి హైదరాబాదు కేంద్రము నుండి అనేక సంవత్సరములు వీరిద్దరిచే నిర్వహించబడినది. రేడియో లో ప్రసారమయ్యె స్త్రీల కార్యక్రమాలతో తృప్తిచెందక గ్రామీణ స్త్రీల కోసం 50 మహిళా సంఘాలనూ ప్రారంభిచారట. తన భర్తతో కలసి బాలానంద సంఘాన్ని ఏర్పరిచారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన మోహన్ కందా ఈ సంఘంలో అతని చిన్నతనంలో సభ్యుడు. మంచి వ్యవహార జ్ఞానం గల విదుషీమణి రేడియో అక్కయ్య అక్టోబరు 23, 1980లో పరమపదించారు.

(సేకరణ)
 

9, ఫిబ్రవరి 2024, శుక్రవారం

తిరుమల రామచంద్ర, సంపాదకుడు, రచయిత, భాషావేత్త - charcoal pencil చిత్రం


నా charcoal పెన్సిల్ చిత్రం 


సంపాదకుడు, రచయిత, స్వాతంత్ర్యసమరయోధుడు, భాషావేత్త. తిరుమల రామచంద్ర మాతృభాష తెలుగుతో పాటు కన్నడ, తమిళ, సంస్కృతం, ప్రాకృతాది భాషల్లో ప్రావీణ్యం కలిగిన బహుభాషావేత్త. రకరకాల వృత్తులు చేసి, వివిధ అనుభవాలు సంపాదించి విస్తృత లోకానుభవశాలి ఐన రామచంద్ర తనను తాను వినమ్రంగా భాషాసేవకుడు అని అభివర్ణించుకునేవారు. అనంతపురం జిల్లా ధర్మవరం తాలూకా రేగటిపల్లె లో 1913 జూన్ 17 న జన్మించిన రామచంద్ర హంపీ శిథిలాలలోని గ్రామమైన కమలాపురంలో తన బాల్యం గడిపారు వీరు సాక్షాత్తూ విజయనగర సామ్రాజ్యంలో కానవచ్చే తాతాచార్యుల వంశీయులు. సంస్కృత భాష, శాస్త్రాలను గురుశుశ్రూష చేసి నేర్చుకోవడం ప్రారంభించాక కారణాంతరాల వల్ల తిరుపతిలోని కళాశాలలో చేరారు. తెలుగు, సంస్కృతాలలో విద్వాన్ గా హిందీలో ప్రభాకరగా పట్టాలు పొందారు.

ద్వితీయ ప్రపంచ యుద్ద కాలంలో సైన్యంలో హవాల్దార్ గుమస్తాగా ,ఆపై భారతి మాసపత్రిక ఇన్ఛార్జ్ ఎడిటర్ గా పనిచేసారు వేటూరి ప్రభాకర శాస్త్రి గారికి ఏకలవ్య శిష్యునిగా చెప్పుకునేవారు .ఆంధ్రప్రభ ,పత్రిక ,ఆంధ్రభూమి ,హిందూస్తాన్ సమాచార్ పత్రికలలోనూ పనిచేసారు .పరిశోధన అనే ద్వైమాసపత్రిక 1953 -66 మధ్యకాలంలో సంపాదకత్వం వహించి ప్రచురించారు సాహితీ సుగతుని స్వగతం ,మన లిపి పుట్టు పూర్వోత్తరాలు ,నుడి -నానుడి ,తెలుగు పత్రికల సాహిత్య చరిత్ర ,మనవి మాటలు ,అహంభో అభివాదయే ,మరపురానిమనీషులు ,హిందువుల పండుగలు ,హాల గాధలు ,కాటమరాజు కథ ,హంపి నుండి హరప్పా వంటి గ్రంథాలు రచించారు 1993 లో తెలుగు విశ్వ విద్యాలయ విశిష్ట పురస్కారం పొందారు 84 ఏళ్ల వయసులో 1997 అక్టోబర్ 12 న తిరుమల రామచంద్ర అస్తమించారు.

విషయ సేకరణ సౌజన్యం : తెలుగు గ్లోబల్ 

8, ఫిబ్రవరి 2024, గురువారం

ప|| రామభద్ర రఘువీర రవివంశతిలక నీ- | నామమే కామధేనువు నమో నమో || - అన్నమయ్య కీర్తన


 

ప|| రామభద్ర రఘువీర రవివంశతిలక నీ- | 

నామమే కామధేనువు నమో నమో ||


చ|| కౌసల్యానందవర్ధన ఘన దశరథసుత | 

భాసురయజ్ఞరక్షక భరతాగ్రజ |

రాసికెక్కు కోదండరచన విద్యాగురువ | 

వాసితో సురలు నిను పడి మెచ్చేరయ్యా ||

చ|| మారీచసుబాహు మర్దన తాటకాంతక | 

దారుణ వీరశేఖర ధర్మపాలక |

కారుణ్యరత్నాకర కాకాసురవరద | 

సారెకు వేదములు జయవెట్టేరయ్యా ||

చ|| సీతారమణ రాజశేఖరశిరోమణి | 

భూతలపుటయోధ్యా పురనిలయా |

యీతల శ్రీవేంకటాద్రి నిరవయినరాఘవ | 

ఘాత నీప్రతాపమెల్లా గడు నిండెనయ్యా ||

పాలగుమ్మి పద్మరాజు -- రచయిత

 పాలగుమ్మి పద్మరాజు రచయిత -  పెన్సిల్ స్కెచ్ పాలగుమ్మి పద్మరాజు ( జూన్ 24 , 1915 - ఫిబ్రవరి 17 , 1983 ) ప్రముఖ తెలుగు రచయిత, కేంద్ర సాహిత్...