నా charcoal పెన్సిల్ చిత్రం
సంపాదకుడు, రచయిత, స్వాతంత్ర్యసమరయోధుడు, భాషావేత్త. తిరుమల రామచంద్ర మాతృభాష తెలుగుతో పాటు కన్నడ, తమిళ, సంస్కృతం, ప్రాకృతాది భాషల్లో ప్రావీణ్యం కలిగిన బహుభాషావేత్త. రకరకాల వృత్తులు చేసి, వివిధ అనుభవాలు సంపాదించి విస్తృత లోకానుభవశాలి ఐన రామచంద్ర తనను తాను వినమ్రంగా భాషాసేవకుడు అని అభివర్ణించుకునేవారు. అనంతపురం జిల్లా ధర్మవరం తాలూకా రేగటిపల్లె లో 1913 జూన్ 17 న జన్మించిన రామచంద్ర హంపీ శిథిలాలలోని గ్రామమైన కమలాపురంలో తన బాల్యం గడిపారు వీరు సాక్షాత్తూ విజయనగర సామ్రాజ్యంలో కానవచ్చే తాతాచార్యుల వంశీయులు. సంస్కృత భాష, శాస్త్రాలను గురుశుశ్రూష చేసి నేర్చుకోవడం ప్రారంభించాక కారణాంతరాల వల్ల తిరుపతిలోని కళాశాలలో చేరారు. తెలుగు, సంస్కృతాలలో విద్వాన్ గా హిందీలో ప్రభాకరగా పట్టాలు పొందారు.
ద్వితీయ ప్రపంచ యుద్ద కాలంలో సైన్యంలో హవాల్దార్ గుమస్తాగా ,ఆపై భారతి మాసపత్రిక ఇన్ఛార్జ్ ఎడిటర్ గా పనిచేసారు వేటూరి ప్రభాకర శాస్త్రి గారికి ఏకలవ్య శిష్యునిగా చెప్పుకునేవారు .ఆంధ్రప్రభ ,పత్రిక ,ఆంధ్రభూమి ,హిందూస్తాన్ సమాచార్ పత్రికలలోనూ పనిచేసారు .పరిశోధన అనే ద్వైమాసపత్రిక 1953 -66 మధ్యకాలంలో సంపాదకత్వం వహించి ప్రచురించారు సాహితీ సుగతుని స్వగతం ,మన లిపి పుట్టు పూర్వోత్తరాలు ,నుడి -నానుడి ,తెలుగు పత్రికల సాహిత్య చరిత్ర ,మనవి మాటలు ,అహంభో అభివాదయే ,మరపురానిమనీషులు ,హిందువుల పండుగలు ,హాల గాధలు ,కాటమరాజు కథ ,హంపి నుండి హరప్పా వంటి గ్రంథాలు రచించారు 1993 లో తెలుగు విశ్వ విద్యాలయ విశిష్ట పురస్కారం పొందారు 84 ఏళ్ల వయసులో 1997 అక్టోబర్ 12 న తిరుమల రామచంద్ర అస్తమించారు.
విషయ సేకరణ సౌజన్యం : తెలుగు గ్లోబల్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి