5, డిసెంబర్ 2016, సోమవారం

పితృదేవోభవ - కవిత - Line Drawing


శ్రీమతి పొన్నాడ లక్ష్మి గారి కవితకి నా line drawing.
పితృదేవోభవ
మా ‘అమ్మ’ మళ్ళీ నా ఇంట్లో పుట్టిందని మురిసిపోయిన నాన్నగారు
వాళ్ళమ్మ పేరు పెట్టుకుని ‘అమ్మా’ అని పిలుస్తూ ఆప్యాయతనందించిన నాన్నగారు
అమ్మ ఎప్పుడయినా కసిరితే ‘మా అమ్మని కోప్పడకు’ అని మందలించిన నాన్నగారు
అర్ధరాత్రి లేచి మందులువేసి భుజంమీద వేసుకుని తిప్పి నిద్రపుచ్చిన నాన్నగారు
తనతోపాటు నన్ను వెంటతిప్పుకుని విజ్ఞానాన్ని పంచి పెంచిన నాన్నగారు
బంగారు పాపాయి బహుమతులు పొందాలి అని నన్ను చూసి పాడుకునే నాన్నగారు
చిన్న వయస్సులోనే పుట్టెడు బాధతో తీరని బాధ్యతలతో మందులేని
కర్కటరోగంతో వైకుంఠ ఏకాదశినాడు కన్నుమూసిన నాన్నగారు
(మా నాన్నగారి జ్ఞాపకాలతో – పొన్నాడ లక్ష్మి)
(చిత్రలేఖనం : మా శ్రీవారు Pvr Murty )

4, డిసెంబర్ 2016, ఆదివారం

ఘంటసాల - నివాళి

ఈనాడు అమర గాయకుడు ఘంటసాల గారి జయంతి. వారికి నా నివాళి. గతంలో నేను వేసుకున్న  ఘంటసాల వారి పెన్సిల్ చిత్రం. వారి గురించి మన కవులు ఏమన్నారో చూడండి మరి !!

అతడు కోట్ల తెలుగుల ఎద
అంచుల ఊగిన ఉయాల
తీయని గాంధర్వ హేల
గాయకమణి ఘంటసాల --    సి.నారాయణరెడ్డి
ఘంటసాలవారి కమనీయ కంఠాన
పలుకనట్టి రాగభావమేది!
ఘంటసాలవారి గాన ధారలలోన
తడియనట్టి తెలుగు టెడద యేది!  --  దాశరథి
అతడు ప్రసన్న మధుర భావార్ద్రమూర్తి
సరస సంగీత సామ్రాజ్య చక్రవర్తి
లలిత గాంధర్వ దేవత కొలువుదీరు
కలికి ముత్యాలశాల మా ఘంటసాల  --  కరుణశ్రీ

తీరం చేరని నావ - కవిత - పెన్సిల్ చిత్రం


నా పెన్సిల్ చిత్రం, కవిత courtesy సోదరి Velamuri Luxmi
కన్నీరు తుడవడానికో హస్తం కావాలి ....
బాధను వినే ఓ హృదయం కావాలి ...
ఓదార్చే ఓ మనసు కావాలి ....
అర్థం చేసుకునే ఓ మది వుండాలి ...
ఒంటరి జీవన యానంలో ఓ తోడు కావాలి ...
సేద తీరడానికో నీడ కావాలి ...
ఆపదలో ఆదుకునే ఓ ఆపన్న హస్తం కావాలి ....
బాధకు స్పందించే ఓ మనసు కావాలి ...
ఎడారిలో ఓ ఒయాసిస్సులా ..నీ స్నేహం కావాలి ....
వెన్నెలకు వెలుగులా ...
రేయికి తిమిరంలా ...
ఆకాశానికి శూన్యంలా ....
ఇంద్రధనుస్సుకు రంగుల్లా....
నీ పెదవిపై చెరగని చిరునవ్వులా ...
నీ కళ్ళల్లో ఆరని తడిలా ....
కడలికి అలల్లా...
పూవుకు తావిలా ...
శ్యామలాంగుని శ్యామలవర్ణం లా ...
వీణకు నాదంలా ....
కంటికి రెప్పలా ...
నీ హృదయ సామ్రాజ్యానికి -- నీ జీవితానికి రాజ్ఞిలా ...
నీ పురుషాధిక్యతకు లోనై --
నీలో నేనై -- నేనే నీవై ....
నాస్త్రీత్వాన్ని నీ కర్పిస్తూ ....
తాదాత్మ్యం చెందుతూ ....
నా జన్మను నీ కంకితమిస్తూ ....
నే తరిద్దామనుకున్నా ....
కానీ ..." ఫో " ' ఫో మ్మని ...తర్జనిచూపిస్తూ ..
అల్లంత దూరంలో ఆపేశావు ....
ఆశల్ని తుంచేశావు ....
ఆశయాల మేడల్ని కూల్చేశావు ....
నడిసంద్రంలో వొదిలేశావు ....
ఎన్నెన్ని ఆశల్ని కల్పించావు ....
నిర్దయగా ....కాలదన్నావు ...
ఏ తీరం చేరనుందో ...
ఈ జీవన నావ ....
ఎటు తేలనుందో ఈ బ్రతుకు ....
ఎంతటి నిర్దయ ప్రియతమా ....!

1, డిసెంబర్ 2016, గురువారం

హృదయస్పందన - శ్రీమతి వేలమూరి లక్ష్మి కవిత - Pencil sketch


సోదరి Velamuri Luxmi కవితకి నా బొమ్మ.

హృదయస్పందన

మరో సారి ...మరోసారి ....
నా ఒంటరి హృదయంలోనికి 
బాధలు , నీ జ్ఞాపకాలూ , నీ నిష్క్రమణ ....
అడుగుపెడతాయి ...అంతులేని ....
బాధను కలిగిస్తాయి .....
వెతుకుతున్నా ...వెతుకుతున్నా ....
శూన్యంలోనికి ...వీటినుంచి తప్పించుకునే దారిని ....
ఎంతకీ కనపడదేం ....
ఎక్కడా కనపడదేం .....
సద్దుకాకుండా వస్తుంది ...బాధ ....
సద్దు చేయకుండా వస్తుంది ఆవేదన ....
సద్దుచేయకుండా కారుతాయి కన్నీళ్ళు .....
సద్దు సేయకుండా ఎగసిపడతాయి నా గుండెలో మంటలు ....
సద్దు లేకుండా నిండిపోతుంది ..నీ రూపు నా మదిలో ....
సద్దు సేయకుండా నీ ప్రేమ పూర్వక వాక్కుల జ్ఞాపకాలకు వస్తాయి ...
సద్దులేకుండా మెత్తగా నా హృదయాన్ని తాకుతాయి ....
కానీ ...కానీ ...అన్నీ కాస్సేపే .... మాయమౌతావు మరుక్షణంలో ....మెరుపులా ....
వస్తావు పిల్లతెమ్మెరలా ....పల్కరించి వెళ్తావు .....
కానీ , నీ వూహలు ..బాధలు .....
నా గుండెలు మంటలే నా శాశ్వత నేస్తాలు .......

ప్రియతమా .. ! - శ్రీమతి పొన్నాడ లక్ష్మి గారి కవిత - Pencil sketch


శ్రీమతి పొన్నాడ లక్ష్మి గారి కవిత కి నా పెన్సిల్ చిత్రం

ప్రియతమా!
ఒక్కోసారి వెల్లువలా వచ్చి నన్నల్లుకుని అంతులేని అనురాగంలో ముంచెత్తుతావు. 
ఒక్కోసారి అంతులేని దూరానికి నన్ను నెట్టేసి నిర్లిప్తంగా మారిపోతావు.
అప్పుడే నాకు కలుగుతుందో చిన్న సందేహం!
నీమదిలో ‘నేను’ నేను మాత్రమె ఉన్నానుకొంటే అదొక మదురమైన మరపురాని అనుభూతి
వేరొకరు నీ ఆలోచనల్లోనైనా చోటుచేసుకున్నారనిపిస్తే అంతులేని ఆవేదన నాకు.
నిన్ను నిలదీస్తే నాదంతా ఒట్టిభ్రమ అంటావు.
భ్రమే అనుకో! దరిచేర్చుకుని నీ ప్రేమపాశంతో బంధించి లాలించ వచ్చుగా!
కానీ నీలో కనిపించే నిర్లక్ష్యబావన నన్ను నిలువునా దహించివేస్తూంది.
నా సేవలు నిన్ను తృప్తి పరచటం లేదా? నా అనురాగంలో వెలితి కనిపిస్తూందా?
ఏమిటి నా నేరం? ఎందుకు నాకీ శిక్ష!

కనుల ముందు నీవుంటే కవిత పొంగి పారదా..






కనుల ముందు నీవుంటే కవిత పొంగి పారదా...

బాపు గారి బొమ్మ ప్రేరణ తో గతంలో ఓ బొమ్మ వేసుకున్నాను. దానికి రంగులద్దాను. facebook లో 'భావుక' బృందం ఓ సభ్యురాలు ఈ పల్లవి వ్రాసి మిగతావి పూరించమన్నారు. చక్కని స్పందన వచ్చింది. ఈ టపా కి చెందిన లింకు ఇక్కడ ఇస్తున్నాను. దయచేసి ఆస్వాదించండి.

https://www.facebook.com/photo.php?fbid=590103454506575&set=gm.1182665988437221&type=3&theater

30, నవంబర్ 2016, బుధవారం

డా. బాలమురళి కృష్ణ - pen sketch


మనవడు మృదంగం వాయిస్తుంటే ముసిముసి నవ్వులతో తన్మయత్వం చెందుతున్న ఇటీవల భువినుండి దివికేగిన కర్ణాటక సంగీత కళానిధి డా. బాలమురళి కృష్ణ - నా pen చిత్రం.

అమ్మకే అమ్మ అమ్మమ్మ

 ​ అమ్మకే అమ్మ అమ్మమ్మ (pen sketch) ఆ గుండె చప్పుడు వింటూ ఒదిగిపోతా, నీ దీవెనల నీడలో పెరిగి పెద్దవుతా. తరాలు దాటిన మన ప్రేమానుబంధం, ఈ సృష్టి...