4, డిసెంబర్ 2016, ఆదివారం

తీరం చేరని నావ - కవిత - పెన్సిల్ చిత్రం


నా పెన్సిల్ చిత్రం, కవిత courtesy సోదరి Velamuri Luxmi
కన్నీరు తుడవడానికో హస్తం కావాలి ....
బాధను వినే ఓ హృదయం కావాలి ...
ఓదార్చే ఓ మనసు కావాలి ....
అర్థం చేసుకునే ఓ మది వుండాలి ...
ఒంటరి జీవన యానంలో ఓ తోడు కావాలి ...
సేద తీరడానికో నీడ కావాలి ...
ఆపదలో ఆదుకునే ఓ ఆపన్న హస్తం కావాలి ....
బాధకు స్పందించే ఓ మనసు కావాలి ...
ఎడారిలో ఓ ఒయాసిస్సులా ..నీ స్నేహం కావాలి ....
వెన్నెలకు వెలుగులా ...
రేయికి తిమిరంలా ...
ఆకాశానికి శూన్యంలా ....
ఇంద్రధనుస్సుకు రంగుల్లా....
నీ పెదవిపై చెరగని చిరునవ్వులా ...
నీ కళ్ళల్లో ఆరని తడిలా ....
కడలికి అలల్లా...
పూవుకు తావిలా ...
శ్యామలాంగుని శ్యామలవర్ణం లా ...
వీణకు నాదంలా ....
కంటికి రెప్పలా ...
నీ హృదయ సామ్రాజ్యానికి -- నీ జీవితానికి రాజ్ఞిలా ...
నీ పురుషాధిక్యతకు లోనై --
నీలో నేనై -- నేనే నీవై ....
నాస్త్రీత్వాన్ని నీ కర్పిస్తూ ....
తాదాత్మ్యం చెందుతూ ....
నా జన్మను నీ కంకితమిస్తూ ....
నే తరిద్దామనుకున్నా ....
కానీ ..." ఫో " ' ఫో మ్మని ...తర్జనిచూపిస్తూ ..
అల్లంత దూరంలో ఆపేశావు ....
ఆశల్ని తుంచేశావు ....
ఆశయాల మేడల్ని కూల్చేశావు ....
నడిసంద్రంలో వొదిలేశావు ....
ఎన్నెన్ని ఆశల్ని కల్పించావు ....
నిర్దయగా ....కాలదన్నావు ...
ఏ తీరం చేరనుందో ...
ఈ జీవన నావ ....
ఎటు తేలనుందో ఈ బ్రతుకు ....
ఎంతటి నిర్దయ ప్రియతమా ....!

కామెంట్‌లు లేవు:

The power of 'Will' Usage - English grammar - illustration

  When we use will to make a promise 🤝 or an offer 💡, we are usually deciding to do something at the very moment we are speaking. It shows...