18, ఏప్రిల్ 2021, ఆదివారం

కవి సామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ vs. Ernest Hemingway




కవి సామ్రాట విశ్వనాథ సత్యనారాయణ vs నోబుల్ పురస్కార గ్రహీత Ernest Hemingway

(ఇది నా సేకరణ మాత్రమే .. నేను వేసిన ఈ మహానుభావుల చిత్రాలు జోడించాను, అంతే.. మిత్రుల ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్న ఉత్సాహంతో ఈ పోస్ట్ పెడుతున్నాను, ధన్యవాదాలు - పొన్నాడ మూర్తి)

రఛయితలు ప్రపంచస్థాయి ప్రమాణాలను ఎలా అందుకోగలరు?
ఒకసారి ఏదో రేడియో ప్రసంగంకోసం విజయవాడ వచ్చి, విశ్వనాథ వారిని చూసి వెళ్దామని రిక్షాలో వారిఇంటికి వెళ్తుండగా, ఆయన నడిచి వస్తున్నాడు. నేను రిక్షాదిగి నమస్కారం చేశాను. ఏమయ్యా? ఇలావస్తున్నావు అన్నాడు. మిమ్మల్ని చూడడానికి వస్తున్నా అన్నాను. చూశావుగా అన్నాడు. ఆయన మాట అలాగే ఉండేది. అంటే వెళ్లిపొమ్మంటారా? అన్నా. వెళ్దువుగానిలే,రా! అంటూ భుజంమీద చేయివేసి ఇంటివైపు తిరిగాడు. నాలుగడుగులు వేసినతర్వాత 'ఈ ఏడాది నోబెల్ బహుమతి ఎవరికి వచ్చింది?' అని అడిగాడు. హెమింగ్వే కి వచ్చింది అన్నాను.
దేనికి?
'ఓల్డ్ మాన్ అండ్ ది సీ' కి.
చదివావా?
ఎక్కడ చదువుతామండీ? ఆయన అమెరికన్ రచయిత. ఇంకా ఇండియన్ ఎడిషన్ రాలేదు. అన్నాను.
నువ్వేం ఇంగ్లీషు లెక్చరర్ వయ్యా? ఇలా రా! అని ఇంట్లోకి తీసుకుపోయి, ఆ పుస్తకం చేతిలో పెట్టి "తీసుకొనివెళ్లి చదువు" అన్నాడు. ఆయన తెలుగు లెక్చరరు. ఆయన అమెరికాకు ఉత్తరంవ్రాసి తెప్పించు కున్నాడు. అప్పటికి ఇండియా మొత్తంమీద ఏ ఇంగ్లీషు లెక్చరరూ దానిని ప్రత్యేకంగా తెప్పించుకొని చదివి ఉండడు.అలాంటి ఆయనను ఛాందసు డని మనం ముద్ర వేశాం.
చదువుతానన్నాను. మళ్లీ వచ్చినప్పుడు డిస్కస్ చేయా లన్నాడు. సరే చదివాను. ఇంతక్రితం చెప్పానే? పట్టకం (ప్రిజం)లో ప్రవేశించిన కాంతి విశ్లేషింపబడి ఏడురంగుల్లో వస్తుందని..ఆపద్ధతిలో విశ్లేషించుకొంటూ చదివాను. నాటకీయత, పాత్ర చిత్రణ, శైలి, సంఘటనలు,...ఇవన్నీ దట్టించి వ్రాసుకొన్న నోట్సుతో ఆరునెలల తర్వాత మళ్లీ పనిమీద వచ్చినపుడు ఆయన దగ్గరకు వెళ్ళాను.
చదివావా?
చదివాను.
ఏమిటికథ?
ఒకముసలివాడు చేపలుపట్టడానికి సముద్రంలోకి వెళ్లివచ్చేవాడు. వాడు తన పదహారో ఏటనుండి అరవయ్యో, డెబ్బయ్యో వచ్చేదాకా- పెద్ద చేపను ఎవరూ చూసిఉండనంత పెద్ద చేపను పట్టుకొస్తానని అంటూ ఉండేవాడు. కథ ఎక్కడ మొదలవు తుందంటే .. ఏంవోయ్? అరవై ఏళ్లనుండి అంటున్నావు పెద్ద చేపను పట్తానని, పట్టావా? అని తోటివాళ్ల అడగటంతో.
పట్తానోయ్, అంటూ సముద్రంలోకి పడవలో వెళ్లిపోయాడు. అతనితోపాటు ఎనిమిదేళ్ల వయస్సున్న అతని మనవడూ ఉన్నాడా పడవలో.
సముద్రంలో పెద్దతుఫాను.. హడావుడి.. అంతా వర్ణించాడు. కథంతా అదే. అక్కడ ఒకచేప తగుల్తుంది. కాని లొంగదు. పగ్గం విసిరి, దానిని బంధించి, ఇటువైపు కొసను నావకు కట్టాడు. వెను తిరిగి ఒడ్డుకు వస్తుంటే, అది వెనుకకు లాగుతూ ఉంటుంది. ఈ చిన్న నావతో ముందుకు రావటం చాలా కష్టంగా ఉంటుంది. ఇంతలో తిమింగలాలు వచ్చి ఆ చేపను కొట్టి ఇంతింత మాంసం లాక్కొని పోతుంటాయి. బాధ భరించలేక చేప ఎగిరెగిరి పడుతుంటుంది. పడవ ఊగిపోతూ ఉంటుంది. తిరగబడబోతుంది...
మొత్తానికి ఒడ్డుదగ్గరకు చేరారు. ముసలివాని ప్రాణాలు కడబట్టిపోతుంటాయి. "ఏరా ముసలోడా! పట్తానన్నావు, పట్టావా? అని అడుగుతారు ఒడ్డునున్న గ్రామస్థులు. పట్టాను, ఇదిగో లాగండి అంటూ త్రాడు అందిస్తాడు. దానిని పట్టి లాగగా లాగగా చివరికొక కంకాళం వస్తుంది.
ఏది? చేపను పట్తానని చెప్పి చివరికొక కంకాళం తెచ్చా వేమిటి? అన్నారు.
ఏడ్చావ్! మీరెన్నడూ చూడనంత పెద్దచేపను పట్టానా లేదా? అది కంకాళమైతే నేమి? అన్నాడు. అంతటితో కథ అయిపోయింది.
"నోబెల్ ప్రయిజిచ్చారు. ఎందుకిచ్చారు చెప్పు!" అన్నాడాయన. బాగా వ్రాశాడండి. వర్ణనలూ అవీ.. అనబోతుంటే, "వర్ణనలూలేవు, నీ మొహంలేదు. 'కర్మణ్యే వాధికారస్తే, మా ఫలేషు కదాచన' అని అర్థం చేసుకో. దానిని మనసులో పెట్టుకొని మళ్లీ చదువు"
నీకర్మ నీవు చేయి. ఫలితం ఆశించకు అని గీతావాక్యం. గీతకు ప్రాణమది. దానిని అర్థంచేసుకొని ఏడవలేదు మనం వందకోట్ల జనం. ఆ ప్రాణం వాడు అందుకున్నాడు. వాడిభాషలో వ్రాశాడు. అందులోని ప్రాణం వాళ్ల కర్థమైంది. అందుకని నోబెల్ ప్రయి జిచ్చారు. మనమూ వ్రాస్తాం- పెంటకుప్పలగురించి. పెంట కుప్పలను దాటి మనదృష్టి వెళ్లదు. ఎటర్నల్ సబ్జెక్టు (శాశ్వతమైన, సార్వకాలికమైన విషయం) తీసుకుని వ్రాశాడు వాడు."
మనకు నోబెల్ ప్రయిజు రాదేమని చాలామంది అడుగుతుంటారు. మనబుఱ్ఱ ముందుకు వెళ్లకపోతే ఎందుకు వస్తాయి? మానవ సమాజాన్ని ఛాలెంజ్ చేస్తున్న సమస్య లున్నాయి. అవి ఆంధ్రుడుకాని, ఆఫ్రికన్ గానీ, పదో శతాబ్దంకానీ ఇరవయ్యో శతాబ్దంకానీ, అవి ఇండియన్ కానీ అమెరికన్ గానీ.. ఎవరైనాకానీ ఎటర్నల్ ప్రాబ్లమ్ తీసుకొని వ్రాయాలి.
దానినే ఇంతకుముందు Ignoble ని Ennoble చేయటమన్నాను. సమకాలీనాన్ని సార్వకాలీనం చేయటమన్నాను ఆ శక్తి వస్తేనేగాని ఎవరికైనాగాని నోబెల్ ప్రయిజువంటి ప్రపంచ స్థాయి బహుమతులు రావు.
(9మార్చి 2002నాడు విజయవాడలో 'సమాలోచన' నిర్వహించిన "తెలుగుకథా సమాలోచనం"లో శ్రీ ప్రోలాప్రగడ సత్యనారాయణ మూర్తిగారి ప్రసంగం లోని కొంతభాగం)

 

17, ఏప్రిల్ 2021, శనివారం

'అమ్మ,' ఓ కమ్మని పదం


 ఎవరు వ్రాయగలరు....

'అమ్మ'  అను మాటకన్నా 

కమ్మని పదం!!

ఎవరు పాడగలరు....

'అమ్మ' అనురాగము కన్నా

తీయని రాగం...


'అమ్మే' గా తొలిగా నేర్చుకున్న

మధుర పలుకు... 

అది 'తెలుగే' అయినా...

మరే భాష అయినా.!


'అమ్మే' గా తొలి స్వరం.. 

ప్రాణమనే పాటకు..


అవతారమూర్తి అయినా...

అణువంతే పుడతాడు.. 

'అమ్మ' ప్రేవు పంచుకొన్నాకే..

అంతటివాడు అవుతాడు... 


నీ వెంతటి ఘనుడవైనా... 

నీ చిరునామా 'అమ్మే' సుమా...

మరొక 'అమ్మ' కు....

'అమ్మే' గా జన్మనిచ్చేది..!


'అమ్మ' లాలి పాటతో ఎదిగావు...

'అమ్మ' చేయి పట్టి..

నడక నువ్వు నేర్చావు.. 

దీనుడవైనా.. 

ధీరుడవైనా... 

'అమ్మ' ఒడి ఒక్కటేగా.... 


'అమ్మ' ని మరిచిన వాడు.. 

మృతునితో సమానం..


#రామకృష్ణ_వారణాసి 

13-03-2021

చిత్రం :: శ్రీ పొన్నాడ మూర్తి 🙏🌹

16, ఏప్రిల్ 2021, శుక్రవారం

నృత్య దర్శకుడు సలీం కధ


 ========================= 

ముగ్గురు సీఎంలతో స్టెప్పులు వేయించిన డ్యాన్సర్ 

నృత్య దర్శకుడు సలీం.‌

 సేకరణ

=======================

అది హైదరాబాద్‌ ఆర్‌ టి సి రోడ్‌ లోని సంగం థియేటర్‌.

వేటగాడు సినిమా ప్రదర్శన. ఆకు చాటు పింద తడిచే పాట

రాగానే పెద్ద సంఖ్యలో యువకులు తెర ముందుకు వెళ్లిపోయి.

అచ్చం ఎన్టీఆర్‌లానే స్టెప్పులేస్తున్నారు. కొందరు తెరపైకి

నాణాలు విసురుతున్నారు. కొద్దిమంది సీట్లలోనే కూర్చోని

ఈలలతో హోరెత్తించారు. 80 వ దశకంలో కొన్ని

సినిమాలకు ఇలాంటి ద్ధాఎశ్యాలు కనిపించేవి. ఆ తరువాత

మరే భాషలోనూ, మరే ప్రాంతంలోనూ ఇలాంటి దృశ్యాలు

కనిపించలేదు.

ప్రేక్షకులను తమ సీట్లలో తమను కూర్చోనివ్వకుండా తెర

ముందుకు పరిగెత్తించి వారితో నృత్యాలు చేయించిన ఆ నృత్య దర్శకుడు సలీం.


రాజకీయాల్లో హై కమాండ్‌ ముఖ్యమంత్రులతో స్టెప్పు

లేయించడం మామూలే. కానీ ఆయన సినిమాల్లో ముగ్గురు

ముఖ్యమంత్రులతో స్టెప్తులేయించారు. సలీం స్టెప్పులు

వేయించిన తరువాత వాళ్లు ముఖ్యమంత్రులయ్యారు.


ఎం జి రామచందన్ర్‌, జయలలిత, ఎన్టీరామారావు ఈ ముగ్గురితోనూ 

స్టెప్పులు వేయించారు. స్టెప్పుల్లోనే నిరంతరం మునిగిపోయిన

ఆయన తన జీవిత స్టెప్పులను మాత్రం సరిగా కంపోజ్‌ చేసుకోలేక పోయాడు.

సినిమాలో స్టెప్పులు సరిగా రాకపోతే రీ టేక్‌ ఉంటుంది. జీవితంలో అలా

ఉండదు. అందుకే ఆయన 80 ఏళ్ల వయసులో అనాధలా మరణించాడు.

ప్రమాదంలో ఒక చేయి పని చేయని స్థితికి చేరుకున్న తరువాత

కొరియోగ్రాఫర్‌గా అవకాశాలు లేకపోయినా నిరంతరం డ్యాన్స్‌నే ప్రేమించాడు.

అతను సినిమా ల్లో డ్యాన్స్‌ను ఎంతగా ప్రేమించాడంటే? జరిగిందేదో

జరిగిపోయింది ఇకచాలు డ్యాన్స్‌ల పిచ్చి వదిలేయండి... కుటుంబం కావాలో ఆ

డ్యాన్సులు కావాలో తేల్చుకోండి అని భార్య అడిగితే, ఏ మాత్రం

ఆలోచించకుండా సలీం డ్యాన్స్‌కే ఓటు వేశాడు. డ్యాన్స్‌ కావాలా? విడాకులు

కావాలా? అని భార్య అడిగితే విడాకులు తీసుకొని డ్యాన్స్‌ను నమ్ముకున్నాడు.

దాంతో 941 సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా పని చేసిన ఆ.

వయసులో ఎవరూ లేని అనాధలా, తినడానికి తిండి, కట్టుకోవడానికి సరైన

బట్టలు కూడా లేకుండా 2011 అక్టోబర్‌ 16న మద్రాసులో కన్నుమూశాడు.

సలీం వైఫల్యంలో సలీంకు మాత్రమే బాధ్యత ఉంది. ఒక్క సలీం విషయంలోనే

కాదు ఏ వ్యక్తి విజయం సాధించినా, పరాజయం పాలైనా దారిద్యంతో

మరణించినా, అంతిమ కాలంలో ప్రశాంతంగా కన్ను మూసినా అంతకు

ముందు ఆ వ్యక్తి వేసిన అడుగులే ఆ పరిస్థితికి కారణం అవుతుంది తప్ప

మరెవరిదో బాధ్యత కానే కాదు.


దక్షిణ భారత దేశంలోనే నంబర్‌ వన్‌ కొరియోగ్రాఫర్‌గా సలీం నిలిచారు.

తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, హిందీ భాషా సినిమాల్లో ఒకటి రెండు

సంవత్సరాలు కాదు సుదీర్హ కాలం బహుశా మరో కొరియోగ్రాఫర్‌ ఎవరూ

ఇంతటి. సుదీర్ధ కాలం ఫీల్ట్‌లో లేరు. 941 సినిమాలకు 

కొరియోగ్రాఫర్‌గా పని చేశారు.   సలీం అని సింగిల్‌ కార్డు మాత్రమే

ఉండాలి. ఒక్క పాటకు పరిమితం కావడం ఒక్కసారి కూడా జరగలేదు. ఆ కాలంలోనే 

 ఒక్కో పాటకు లక్ష రూపాయల పారితోషికం తీసుకునే వారు. మరి

డబ్బంతా ఏమయింది అంటే ఆయన గర్వంగా నన్ను అంతా కుట్టి ఎంజిఆర్‌

అని అభిమానంగా పిలిచేవారు. ఎంజి రామచంద(న్‌్‌ దాన ధర్మాలకు పెట్టింది.

పేరు, అలా సలీం కూడా అడిగిన వారికల్లా సహాయం చేస్తుంటే చిన్న ఎంజిఆర్‌

అని ముద్దుగా పిలిచేవారట! ఇది సలీమే చెప్పుకున్న మాట.

కృష్ణ రజనీకాంత్‌, కమలహాసన్‌, జితేంద్ర వారు వీరని కాదు ఆ కాలంలో

హీరోలందరితో డ్యాన్సులు చేయించారు సలీం.

హైదరాబాద్‌లో ఒక సినిమా షూటింగ్‌లో ఎడమ చేయి ప్రమాదంతో పని 

చేయకుండా పోయింది. అప్పటి నుంచి ఆయనకు సినిమాలు లేవు. ఐనా ఒక

చేయితో కూడా నేను డ్యాన్స్‌ చేయించి చూపగలను అని ధీమాగా ఎవరూ

ఆయన్ని సీరియస్‌గా తీనుకోలేదు. ఆయన శిష్యులే ద్యాన్సర్లుగా వెలిగిపోతున్నా

తన జీవితం గురించి తానే పట్టించుకోని గురువు గురించి శిష్యులు ఎందుకు,

పట్టించుకుంటారు. ఒంటి చేత్తో డ్యాన్స్‌లు చేయడానికి సలీం ఉత్సాహపద్దా

భార్యా బిడ్డలు కూడా ఇష్టపడలేదు. నీ జీవితం నీది మా జీవితం మాది అంటూ

వెళ్లిపోయారు. నా ప్రాణం ఉన్నంత వరకు డ్యాన్స్‌ చేస్తాను అని సలీం చెప్పినా

ఆయనకు అవకాశం ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు.

కేరళకు చెందిన సలీం మక్కా సందర్శించాలనేది జీవిత లక్ష్యం. దాని కోసమే

మద్రాసు వచ్చిన ఆయన ఎంతో మందికి సహాయం చేశారు. చివరి దశలో

చేతిలో చిల్లిగవ్వ లేకుండా కనులు మూశారు. ఓ పెద్ద భవనం అద్దె కున్న

వారితో వివాదం. ఆ భవనంపై సలీం వాదన అద్దెకుండేవారి వాదన వేరువేరుగా

ఉంది. ఆ భవనం వ్యవహారంలో హత్య జరిగిందని అంటారు. తప్పు ఎవరిదో

ఏం జరిగిందో కానీ సలీం జీవితం మాత్రం రోడ్డున పడింది. 941 సినిమాలు

అంటే దాదావుగా నాలుగువేల పాటలకు న్థూఎత్యాలను కంపోజ్‌ చేసిన సలీం

చివరి రోజుల్లో కడువులో తిండి చేతిలో చిల్లిగవ్వ లేకుండా కనులు మూయడం

బాధాకరం.


మనిషి చందమాను ఎప్పుడో తాకేశాడు. మార్స్‌వైవు అడుగులు వేస్తున్నాడు.

కానీ కొన్ని అంశాల్లో మనకు చీమకున్నంత ముందు చూవు కూడా

లేదేమోననిపిస్తుంది. రేపటికి ఎలా అనే ఆలోచన అంత చిన్న జీవి చీమకు

ఉన్నప్పుడు చీమ కన్నా కొన్ని కోట్ల రెట్లు పెద్ద సైజులో ఉందే మనకు ఉండాల్సిన

అవసరం లేదా? సలీంనో, మరో సినిమా ప్రముఖుడినో తప్పు పట్టడం మన

ఉద్దేశం కాదు. అంత స్థాయికి ఎదిగిన వారే ముందు చూవు లేకపోతే ఎందుకూ

కొరగాకుండా పోయారు. సామాన్యులం మనమెంత జాగ్రత్తగా ఉండాలో

చెప్పడానికే ఈ ప్రయత్నం. వ్రూఎత్తిని ప్రేమించాల్సిందే కానీ జీవితాన్ని

కుటుంబాన్ని అంతకన్నా ఎక్కువ గౌరవించాలి. ఏదో ఒక దశలో నీ వృత్తి నీ

నుంచి దూరం కావచ్చు, నువ్వు వీడ్మోలు పలికే రోజు రావచ్చు కానీనీ

కుటుంబం మాత్రం నీవున్నంత వరకు నీతో ఉంటుంది.

14, ఏప్రిల్ 2021, బుధవారం

జిందా హూ ఇస్ తరహ్ కె గమ్-ఎ-జిందగీ నహీ - అనువాదం సౌజన్యం శ్రీమతి శాంతా సుందరి

 

'ఆగ్' చిత్రంలో ముఖేష్ పాడిన అద్భుత గీతం 'జిందా హూ ఇస్ తరహ్ కి గమె జిందగీ నహీ'. నాకు నచ్చిన ఈ పాటకి శ్రీమతి శాంత సుందరి గారు చక్కని అనువాదం అందించారు. ఆమె అనువాదం ఇక్కడ యధాతధంగా పోస్ట్ చేస్తున్నాను. ఈ పాట ని కమలేష్ అవాస్థి గారు ముఖేష్ పాటని అనుకరిస్తూ చాలా చక్కగా పాడారు. ఆ పాట లింక్ కూడా ఇస్తున్నాను.





https://www.youtube.com/watch?v=rE0c4Zfnlnw


జిందా హూ ఇస్ తరహ్ కి గమ్-ఎ-జిందగీ నహీ

జలతా హుఆ దియా హూ మగర్ రోశనీ నహీ
( ఎలా జీవిస్తున్నానంటే జీవితం గురించి దుఃఖమే లేదు
నేనొక జ్వలించే దీపాన్ని, కానీ వెలుగులు చిమ్మలేను)

వో ముద్దతే హుయీ హై కిసీసే జుదా హుయే
లేకిన్ యే దిల్ కీ ఆగ్ అభీ తక్ బుఝీ నహీ
( తనని ఎడబాసి యుగాలే గడిచిపోయాయి
అయినా ఇంతవరకూ రగిలే నా హృదయంలోని అగ్ని ఆరలేదు)

ఆనే కో ఆ చుకా థా కినారా భీ సామనే
ఖుద్ ఉసకే పాస్ హీ మేరీ నయ్యా గయీ నహీ
( తీరమైతే నా ఎదుటికి రానే వచ్చింది
కానీ నా నావే దాని దగ్గరకి చేరుకోలేదు)

హొంఠో కే పాస్ ఆయే హంసీ క్యా మజాల్ హై
దిల్ కా ముఆమలా హై కోయీ దిల్లగీ నహీ
( నా పెదవులమీదికి చిరునవ్వు రావాలంటే మాటలా
ఇది మనసుకి సంబంధించిన వ్యవహారం, నవ్వులాట కాదు)

యే చాంద్ యే హవా యే ఫజా సబ్ హై మాంద్ మాంద్
జో తూ నహీ తో ఇనమే కోయీ దిలకషీ నహీం
( ఈ చందమామా, ఈ గాలీ , ఈ వాతావరణం అన్నీ వెలవెలపోతున్నాయి
నువ్వు లేకపోయాక నాకు వీటిలో ఆకర్షణే కనబడదు)
***
1948 లో వచ్చిన 'ఆగ్' అనే సినిమా లో ముకేష్ పాడిన ఈ ఘజల్ ఎక్కువమంది విని ఉండకపోవచ్చు.ఇది నాకు చాలా ఇష్టమైన పాటల్లో ఒకటి.రాసిన శాయర్ పేరు బేహజాద్ లఖనవీ.సంగీతం రామ్ గాంగూలీ. ఈ పాట ఒకసారి వింటే మరిచిపోలేమన్నది నా అభిప్రాయం. నన్ను అది చాలా ఏళ్ళుగా వెంటాడుతూనే( haunting) ఉంది. మీరూ విని చూడండి.

(Translation courtesy Smt. Santha Sundari)

12, ఏప్రిల్ 2021, సోమవారం

చిత్రానికి పద్యాలు



నా చిత్రానికి పద్య రచనలు చేసిన కవయిత్రులకు నా ధన్యవాదాలు


నగవులు పూచెడిదగు నీ

మొగమది వసివాడిపోయి ముకుళించినదే...

మగువా! నీ కన్నులలో

దిగులుకు గల కారణమ్ము తెలియుట లేదే!


(శ్రీమతి పద్మజ మంత్రాల గారు రచించిన పద్యం) 


------------------------------------------------------------------------------------------------------------- 

మగవారి మాటలన్నియు

సగమే నిజమని దలచుచు సతిదిగులందెన్

సగభాగము నీవనుచును

తగవే తలపైన గంగ దాల్పగనుహరా !

(శ్రీమతి ఉమాదేవి జంధ్యాల గారు రచించిన పద్యం)

--------------------------------------------------------------------------------------------------------------- 

కళకళ లాడే వదనము
కళతరిగివివర్ణ మైన కారణ మెద్దిన్
కళవళ పడకే యతిగా
మెళకువ తోమెల గినయెడ మెదులునుమనమున్

(శ్రీమతి జానకి గంటి గారు రచించిన పద్యం) 

11, ఏప్రిల్ 2021, ఆదివారం

నాన్న - రచన శ్రీ RVSS శ్రీనివాస్)

 





(మిత్రుడు శ్రీనివాస్, వయసులో నాకంటే చిన్నవాడు, ప్రతి సంవత్సరం నా పుట్టినరోజు నాడు నాకు ప్రత్యేకంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పేవాడు. భోపాల్ 'దూర్ దర్శన్' లో ఉద్యోగం చేస్తుండేవాడు. ఇప్పుడు ఎక్కడున్నాడొ తెలియదు. FB లో కనిపించడంలేదు. రెండు మూడు సందర్భాల్లో కలుసుకున్నాం. ఫోన్లో మాట్లాడుకున్నాం.  శ్రీనివాస్  ః నీ కవిత కి నా బొమ్మ జోడించి నీ అనుమతి లేకుండా నా బ్లాగులో పెట్టుకున్నాను.  నీకు అభ్యంతరం ఉండదని భావిస్తున్నాను. ఈ పోస్ట్ నీకు ఎప్పుడైనా తారసపడితే నాకు ఫోన్ చెయ్యవా ప్లీజ్ ... అంకుల్)


పిల్లల్ని నవమాసాలు మోసిన అమ్మ గొప్పతనం ఒకవైపునుంటే

ఆ సంతనాన్ని అమ్మతో సహా జీవితాంతం మోసే నాన్న గొప్పతనం వేరొకవైపుంటుంది.

మూడు పూటలా రుచికరమైన భోజనం పెట్టేది అమ్మైతే,

ఆ భోజనం ఇంట్లోకి రావడానికి కారణం నాన్నే కదా !

దెబ్బ తగిలితే ‘అమ్మా’ అంటూ అరుస్తాం

కాని మందు వేయించేది నాన్నే కదా..!

పాకెట్ మనీ కోసం రెకమండేషన్ చేసేది అమ్మే అయినా

మన ఖాళీ జేబులు నింపేది నాన్నే కదా…!

చిన్న చిన్న సమస్యలు అమ్మ తీరుస్తుంది

సమస్య జటిలమైతె  పరుగెత్తేది నాన్న దగ్గరకే కదా ..!

భూదేవంత ఓర్పు సహనం అమ్మదైతే

ఆకాశమంత ఔన్నత్యం నాన్నది !

చిన్నప్పుడు నాన్న భుజాల మీద స్వారీ చేస్తాం

పెద్దయ్యాక కనీసం ఆ రెక్కల భారం పంచుకునే ప్రయత్నం కూడా చేయం..

కొబ్బరిపెంకులాంటి నాన్న కరుకుదనానికి భయపడి

వెన్నలాంటి మనసున్న అమ్మ చల్లని ఒడి చేరతాం.

ఆ కొబ్బరి నీళ్ళ తీపి

ఆ లేత కొబ్బరి మెత్తదనం చూడగలిగితే,

నాన్నను ఎప్పటికీ వదలం.

అమ్మ వర్తమానాన్ని చూస్తే,

మన భవిష్యత్తుని మనకంటే ముందుగా చూసేది,

మన లక్ష్యాలను చూపేది,

వాటిని సాధించుకోవడానికి బంగారు బాటలు వేసేది నాన్నే కదా … !

 

(సౌజన్యం : నా మిత్రుడు, ప్రఖ్యాత కవి శ్రీ RVSS శ్రీనివాస్ రచన. శ్రీనివాస్ కి నా శుభాశీస్సులు)

 

7, ఏప్రిల్ 2021, బుధవారం

కాపు రాజయ్య - చిత్రకారుడు

(My charcoal and graphite pencil drawing)


కాపు రాజయ్య ( ఏప్రిల్ 71925 – ఆగష్టు 202012తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు.గ్రామీణ నేపథ్యం గల చిత్రాలకు ఈయన పేరు పొందాడు. ఈయన చిత్రపటాలు ప్రపంచం లోని పలు ప్రదేశాలలో ప్రదర్శింపబడినవి. ఈయన 1963 లో లలితకళా సమితిని స్థాపించారు


1993లో కళాప్రవీణ, 1997లో కళావిభూషణ్, 2000లో హంస, 2007లో లలిత కళారత్న అవార్డులు  అందుకున్నారాయన. సిద్దిపేటలో జన్మించిన రాజయ్య జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఏడు దశాబ్దాలకు పైగా తన చిత్రాలద్వారా ఎన్నో అవార్డులందుకున్న రాజయ్య సిద్దిపేటను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. రాజయ్య చిత్రాలను పార్లమెంటు, న్యూఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్, సాలార్ జంగ్ మ్యూజియం, ఆంధ్రప్రదేశ్ లోని లలితకళా అకాడమిలో ప్రదర్శనకు ఉంచారు. సిద్దిపేటలో ఓ కళా పరిషత్ ను  కూడా శ్రీ రాజయ్య  స్థాపించారు. ఆధునిక చిత్రకళలో తెలంగాణ గ్రామీణ జీవితానికి కాపు రాజయ్య చిత్రం ప్రతిబింబం అయ్యింది. బీద కుటుంబంబంలో ఇద్దరు అక్కలకు తమ్ముడిగా చిన్న వ్యాపారస్తుడైన శ్రీ రాఘవులుకు 1925 ఏప్రిల్ 6వ తేదీన సిద్ధిపేటలో జన్మించిన రాజయ్య లలితకళా అకాడెమీ అవార్డు గ్రహీతగా జాతీయ స్థాయి చిత్రకారుడిగా ప్రఖ్యాతి చెందారు. చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో దిక్కుతోచని కుటుంబాన్ని తండ్రి స్నేహితుడు శ్రీ చంద్రయ్యగౌడ్ ఆదుకున్నాడని రాజయ్య తన జీవితాంతం గుర్తు చేసుకునేవారు. కాపు రాజయ్య జీవితంతో పోరాటం చేసి కళాకారుడయ్యారు. తనకు ఇష్టమైన చిత్రకళలో అత్యున్నత శిఖరాలకు చేరుకున్నారు. ప్రపంచీకరణ నేపధ్యంలో పల్లె జీవితం చెరిగిపోకుండా, గుర్తుండేటట్లు, తన కుంచెతో తెలంగాణా పల్లె జీవనానికి ప్రాణంపోసిన చేయితిరిగిన చిత్రకారుడు శ్రీ రాజయ్య. ఈయన చిత్రాలు ముందు తరాలవారికి, తెలంగాణా పల్లె జీవితాన్ని,సంస్కృతిని  మరచిపోకుండా చేస్తాయి అని అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.రేఖా చిత్రాలతో,మనసును ఆకట్టుకునే రంగులతో ఈయన చిత్రాలు మురిపిస్తాయి. దేశంలోని వివిధ ప్రాంతాలలో చిత్రకళను అభ్యసించిన శ్రీ  రాజయ్య దక్షిణాది ప్రాంతాలన్నిటినీ తిరిగి అన్నిరకాల చిత్రకళారీతులను పరిశీలించి, తనదైన సొంత బాణీని ఏర్పరుచుకున్నారు. తక్కువ గీతలలో ఎక్కువ అర్ధం వచ్చేటట్లుగా ఆయన చిత్రాలు ఉంటాయి. లండన్ నుంచి వెలువడే ‘స్టుడియో’ అనే పత్రిక రాజయ్య వర్ణచిత్రాన్ని ప్రచురించుకుని నీరాజనం పలికింది.

 

అమ్మకే అమ్మ అమ్మమ్మ

 ​ అమ్మకే అమ్మ అమ్మమ్మ (pen sketch) ఆ గుండె చప్పుడు వింటూ ఒదిగిపోతా, నీ దీవెనల నీడలో పెరిగి పెద్దవుతా. తరాలు దాటిన మన ప్రేమానుబంధం, ఈ సృష్టి...