14, ఏప్రిల్ 2021, బుధవారం

జిందా హూ ఇస్ తరహ్ కె గమ్-ఎ-జిందగీ నహీ - అనువాదం సౌజన్యం శ్రీమతి శాంతా సుందరి

 

'ఆగ్' చిత్రంలో ముఖేష్ పాడిన అద్భుత గీతం 'జిందా హూ ఇస్ తరహ్ కి గమె జిందగీ నహీ'. నాకు నచ్చిన ఈ పాటకి శ్రీమతి శాంత సుందరి గారు చక్కని అనువాదం అందించారు. ఆమె అనువాదం ఇక్కడ యధాతధంగా పోస్ట్ చేస్తున్నాను. ఈ పాట ని కమలేష్ అవాస్థి గారు ముఖేష్ పాటని అనుకరిస్తూ చాలా చక్కగా పాడారు. ఆ పాట లింక్ కూడా ఇస్తున్నాను.





https://www.youtube.com/watch?v=rE0c4Zfnlnw


జిందా హూ ఇస్ తరహ్ కి గమ్-ఎ-జిందగీ నహీ

జలతా హుఆ దియా హూ మగర్ రోశనీ నహీ
( ఎలా జీవిస్తున్నానంటే జీవితం గురించి దుఃఖమే లేదు
నేనొక జ్వలించే దీపాన్ని, కానీ వెలుగులు చిమ్మలేను)

వో ముద్దతే హుయీ హై కిసీసే జుదా హుయే
లేకిన్ యే దిల్ కీ ఆగ్ అభీ తక్ బుఝీ నహీ
( తనని ఎడబాసి యుగాలే గడిచిపోయాయి
అయినా ఇంతవరకూ రగిలే నా హృదయంలోని అగ్ని ఆరలేదు)

ఆనే కో ఆ చుకా థా కినారా భీ సామనే
ఖుద్ ఉసకే పాస్ హీ మేరీ నయ్యా గయీ నహీ
( తీరమైతే నా ఎదుటికి రానే వచ్చింది
కానీ నా నావే దాని దగ్గరకి చేరుకోలేదు)

హొంఠో కే పాస్ ఆయే హంసీ క్యా మజాల్ హై
దిల్ కా ముఆమలా హై కోయీ దిల్లగీ నహీ
( నా పెదవులమీదికి చిరునవ్వు రావాలంటే మాటలా
ఇది మనసుకి సంబంధించిన వ్యవహారం, నవ్వులాట కాదు)

యే చాంద్ యే హవా యే ఫజా సబ్ హై మాంద్ మాంద్
జో తూ నహీ తో ఇనమే కోయీ దిలకషీ నహీం
( ఈ చందమామా, ఈ గాలీ , ఈ వాతావరణం అన్నీ వెలవెలపోతున్నాయి
నువ్వు లేకపోయాక నాకు వీటిలో ఆకర్షణే కనబడదు)
***
1948 లో వచ్చిన 'ఆగ్' అనే సినిమా లో ముకేష్ పాడిన ఈ ఘజల్ ఎక్కువమంది విని ఉండకపోవచ్చు.ఇది నాకు చాలా ఇష్టమైన పాటల్లో ఒకటి.రాసిన శాయర్ పేరు బేహజాద్ లఖనవీ.సంగీతం రామ్ గాంగూలీ. ఈ పాట ఒకసారి వింటే మరిచిపోలేమన్నది నా అభిప్రాయం. నన్ను అది చాలా ఏళ్ళుగా వెంటాడుతూనే( haunting) ఉంది. మీరూ విని చూడండి.

(Translation courtesy Smt. Santha Sundari)

కామెంట్‌లు లేవు:

ముందు చూపు కలిగి - ఆటవెలది

ఎంత చక్కటి చిత్రమో 😍 ఆటవెలది // ముందు చూపు గలిగి ముందునిద్ర యనుచు  కన్ను మూసి మంచి కలలు గనుచు  హాయిననుభవించు రేయి పగలు  యంత దూర దృష్టి వింత...