30, సెప్టెంబర్ 2023, శనివారం

సిస్టర్ నివేదిత - వివేకానందుడి బోధనలకు ప్రబావితమైన విదేశీ మహిళ (charcoal pencil sketch)

నా charcoal pencil sketch


సిస్టర్ నివేదిత వివేకానందుడి బోధనలకు ప్రభావితమై హిందూమతాన్ని స్వీకరించిన మొదటి విదేశీ మహిళ.

భారత తపాలా శాఖ ఈమె గౌరవార్ధం ఓ తపలా బిళ్ళ విడుదల చేసింది.


మరిన్ని వివరాలు ఈ క్రింది లింక్ క్లిక్ చేసి చదవండి. సౌజన్యం : ప్రభాత వెలుగు

వ్యాసం సౌజన్యం : శ్రీ సామల కిరణ్


https://www.v6velugu.com/sister-nivedita-replica-of-indianness

తిరుపతి వెంకట కవులు - తెలుగు సాహిత్యంలో జంట కవులు - నా pencil చిత్రాలు.


 నా charcoal pencil sketches

చిన్నప్పుడు స్కూల్ లో చదెవేటప్పుడు వీరి గురించి తెలుసుకున్నాను. నాకు వీరి చిత్రాలు నా pencil తో వేసుకునే భాగ్యం కలిగింది. వీరిరువురి గురించి వికీపీడియా లో చదివి మరిన్ని వివరాలు తెలుసుకోగలిగాను. మీ సౌలభ్యం కోసం వికీపీడియా లింక్ క్రిందని ఇస్తున్నాను. చదివి తరించండి.

ధన్యవాదాలు.

https://te.wikipedia.org/wiki/%E0%B0%A4%E0%B0%BF%E0%B0%B0%E0%B1%81%E0%B0%AA%E0%B0%A4%E0%B0%BF_%E0%B0%B5%E0%B1%87%E0%B0%82%E0%B0%95%E0%B0%9F_%E0%B0%95%E0%B0%B5%E0%B1%81%E0%B0%B2%E0%B1%81


18, సెప్టెంబర్ 2023, సోమవారం

పొన్నాడ కుమార్ - రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలి

 కీ. శే. పొన్నాడ కుమార్ గారు నాకు స్వయానా పినతండ్రి. 


కుమార్ గారు గొప్ప రచయిత, నటులు, గాయకులు కూడా. వీరితో నా అనుబంధం మరువరానిది.


నా చిన్నతనంలో మేము ఉండే రైల్వే క్వార్టర్ కి ఓ అర కిలో మీటర్ దూరంలో కుమార్ గారి క్వార్టర్ ఉండేది వారు కూడా రైల్వే ఉద్యోగులే. కుమార్ గారు తమ విరామ సమయంలో సాహితీ సేవ, నాటకరంగ సేవ చేస్తూ ఉండేవారు. వారు రచించిన కథలు, కవితలు వ్యాసాలు  ఆనాటి ప్రముఖ తెలుగు పత్రికలు చిత్రగుప్త, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక తదితర  పత్రికల్లో ప్రచురితమయ్యేవి. అవి మాకు చూపిస్తూ ఉండేవారు. కారా మాస్టారు గా ప్రసిద్ధి చెందిన కీ. శే. కాళీపట్నం రామారావు గారు శ్రీకాకుళం లో స్థాపించిన  "కథానిలయం" గ్రంధాలయం లో పొన్నాడ కుమార్ గారి కథలు కొన్ని లభ్యం.   నేను ఇప్పుడు ఓ ప్రముఖ చిత్రకారునిగా, కార్టూనిస్ట్ గా పేరు సంపాదించుకోవడం వెనుక ఆయన ప్రోత్సాహం చాలా ఉందని చెప్పక తప్పదు.


ఇంక నాటక రంగానికి వస్తే వారు చాలా పౌరాణిక సాంఘిక నాటకాల్లో నటించారు. నేను చిన్నప్పుడు కటక్ నుండి భద్రక్ వెళ్లి వారు నటించిన పౌరాణిక నాటకం చూడడం నాకు బాగా గుర్తు. ఉద్యోగ బాధ్యతల్లో ఉన్నా కూడా వారు ఆనాటి ప్రముఖ పౌరాణిక నాటక రంగ నటులైన ఈలపాట రఘురామయ్య, సూరిబాబు, పీసపాటి వంటి నటులతో కూడా నటిస్తూ ప్రదర్శనలు ఇచ్చేవారు. అటువంటి ఓ నాటకం ఒడిస్సాలో భద్రక్ పట్టణంలో ప్రదర్శించగా నా చిన్నతనంలో తిలకించే భాగ్యం కలిగింది. బరంపురంలో వారు మా నాన్నగారు శ్యాంసుందర్ రావు గారు తదితర బరంపురంల ప్రఖ్యాత స్థానిక నటులతో కలిసి ప్రదర్శించిన " పల్లెపడుచు " అనే సాంఘిక నాటకం తిలకించే భాగ్యం కూడా కలిగింది. 


కుమార్ గారు మంచి గాయకులు. నాటకాల్లో ఆయన పద్యాలు ఆయనే పాడుకునేవారు. ఆయన పద్యం చదివితే ప్రేక్షకుల నుండి 'వన్స్ మోర్' అనే అభ్యర్థనలు వచ్చేవి.


నేను వేసిన కార్టూన్లు కొన్ని ప్రముఖ పత్రికలు ఆంధ్రప్రభ ఆంధ్ర పత్రిక లో ప్రచురితమయ్యేవి. నా కార్టూన్ చూసి నన్ను అభినందించేవారు. కొన్ని సూచనలు కూడా ఇచ్చేవారు.


పదవి విరమణ అనంతరం కుమార్ గారు కొన్నాళ్ళు తమ స్వస్థలమైన ఎలమంచిలి లో ఉండేవారు.  అక్కడ కూడా స్థానిక సాహితీ ప్రముఖులతో  తన సాహితీ సేవ కొనసాగించారు. ఆ తర్వాత విశాఖపట్నంలో స్థిరపడ్డారు. విశాఖ నగరం ఎందరో సాహితీప్రియులను ఆదరించింది, పోషించింది.   వారిలో కుమార్ గారు ఒకరు. ఓ విశాఖ ప్రముఖ సాహితీ సంస్థ కుమార్ గారిని 'విశాఖ రత్న' బిరుదుతో సత్కరించింది.


కుమార్ గారు సంఘ సేవకులు కూడా. పదవీ విరమణ అనంతరం వారు కొన్ని బ్రాహ్మణ వివాహ పరిచయ వేదికల్లో పాల్గొనేవారు.  పెళ్లి సంబంధాలు కుదిర్చారు.. మా పెద్దమ్మాయి  సంబంధం కూడా ఆయనే  కుదిర్చేరు.  ఆయన ఆధ్వర్యంలోనే మా పెద్దమ్మాయి వివాహం కూడా జరగడం నా జీవితంలో ఓ మరపురాని మధురానుభూతి. 


ఇంతటి బహుముఖ ప్రజ్ఞాశాలి పొన్నాడ  కుమార్ గారిని సంస్మరిస్తూ వారి సేవలను అందరికీ తెలియజేసే విధంగా  వారి కుమారుడు శ్రీ పొన్నాడ రఘునాథ్ గారు ఓ పుస్తకం ప్రచురించడం బహుదా ప్రశంసనీయం. వారికి నా ఆశీస్సులు. కుమార్ గారికి నా నివాళి.



16, సెప్టెంబర్ 2023, శనివారం

రుక్మిణి లక్ష్మీపతి







My charcoal pencil sketch of Rukmini Lakshmipati


ఈ చిత్రంలో వ్యక్తి  రుక్మిణి లక్ష్మీపతి.      ఆయుర్వేద ఘన వైద్యులు శ్రీ ఆచంట లక్ష్మీపతి గారి సతీమణి శ ఆచంట రుక్మిణమ్మ.


ఈమె జమీందారీ కుటుంబం నుంచి వచ్చింది. ఆనాడు ఆ కుటుంబాలలో ఆచారాలు ఎక్కువ. స్త్రీల చదువుకు ప్రోత్సాహం లేదు. అటువంటి వాతావరణంలో ఆమె పట్టభద్రురాలైంది. డిగ్రీ తీసుకుంది. అంతేకాదు Madras Legislature కి ఎన్నికైన తొలి మహిళ. ఈమె.   Medras Presidency లో మంత్రి పదవి చేపట్టిన తొలి మహిళ కూడా ఈమే.  

పట్టభద్రురాలై ,పారిస్ లో అంతర్జాతీయ మహిళా సభ జరిపి ,ఉప్పు సత్యాగ్రహం లో పాల్గొని ,ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేసిన మహిళ  ఆచంట రుక్మిణమ్మ.  ఆనాడు ఆ కుటుంబాలలో ఆచారాలు ఎక్కువ. స్త్రీల చదువుకు ప్రోత్సాహం లేదు. అటువంటి వాతావరణంలో ఆమె పట్టభద్రురాలైంది. డిగ్రీ తీసుకుంది. తర్వాత మద్రాసులో ఖద్దరు ప్రచారము చేసింది.

1946 లో ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం మంత్రివర్గంలో ఆరోగ్య మంత్రిగా కూడా పనిచేసింది. ఈ విధంగా అవకాశం యిస్తే ఆడవారు ఏ రంగంలోనైనా రాణిస్తారు అని నిరూపించిన మహిళా రత్నం ఆచంట రుక్మిణమ్మ గారు. ఆచంట రుక్మిణమ్మ .6-12-1892 జన్మించి 6-8-1951న 59వ ఏట మరణించారు.



15, సెప్టెంబర్ 2023, శుక్రవారం

సుబ్రహ్మణ్యభారతి - తమిళ రచయిత, కవి - charcoal pencil sketch


my charcoal pencil sketch


Description

'చిన్నస్వామి సుబ్రహ్మణ్య భారతి' తమిళ రచయిత, కవి, పత్రికా సంపాదకుడు, స్వాతంత్ర్య సమర యోధుడు, సంఘ సంస్కర్త. ఆధునిక తమిళ కవిత్వానికి మార్గదర్శిగానూ, "మహాకవి భారతి"గానూ సుప్రసిద్ధుడు, తమిళ సాహిత్య ప్రముఖుల్లో అత్యున్నత వ్యక్తిగా పేరొందారు.'

తమిళ జాతీయకవి సుబ్రహ్మణ్య భారతి తెలుగు భాషను ‘సుందర తెలుంగు’ అని కీర్తించినాడు.

పి. సి. సర్కార్, ఇంద్రజాలికుడు. pencil sketch


పి.సి.సర్కార్ గా పిలువబడే ప్రొతుల్ చంద్ర సర్కార్ గొప్ప భారతీయ ఇంద్రజాలికుడు. దేశవిదేశాల్లో లెక్కలేనన్ని ఇంద్రజాల ప్రదర్శనల నిచ్చాడు. అతనికి ముగ్గురు కుమారులు. మానిక్ సర్కార్, దర్శకుడు, ఎనిమేటర్, లేసర్ నిపుణుడు. పి.సి.సర్కార్ జూనియర్, పి.సి.సర్కార్ యంగ్లు ఇంద్రజాలికులు. వికీపీడియా

అమ్మ బొమ్మ


నేను చిత్రీకరించిన అమ్మ బొమ్మల్లో ఇదొకటి. అమ్మ నాన్నలకి దూరంగా ఉంటూ చదువుకున్న కారణమో మరేమోకాని అమ్మ బొమ్మలంటే చాలా ఇష్టం.

పాలగుమ్మి పద్మరాజు -- రచయిత

 పాలగుమ్మి పద్మరాజు రచయిత -  పెన్సిల్ స్కెచ్ పాలగుమ్మి పద్మరాజు ( జూన్ 24 , 1915 - ఫిబ్రవరి 17 , 1983 ) ప్రముఖ తెలుగు రచయిత, కేంద్ర సాహిత్...