సిటీల నుంచి వచ్చి గోదావరి జిల్లాలను హేళన చేస్తున్న వారికి ప్రత్యేకం....
చూసారాండే ఎంత అద్భుతంగా ఉందో... గోదారి జిల్లాల్లో ఊరిఊరికీ, ఈదిఈదికి ఇలాంటి సీన్లు సేనా కనిపిత్తాయండి. అసలు పేడతో అలికిన పూరి పాకల్లో ఉన్నా కూడా మేమున్నంత సుఖంగా.. సంతృప్తిగా మీ సిటీల్లో కోట్లు ఖర్చెట్టి కట్టుకున్న పాలరాతి బంగ్లాల్లో, అపార్ట్ మెంట్లలో మీరుండగలరేంటండే..., "భలేటోరే...!"
ఆమాటికొత్తే మీరు తిన్నారో ఉన్నారో పట్టించుకునే దిక్కూ లేదు, ఆప్యాయంగా పలకరించుకునే లక్కూ లేదు. కానీ మా పల్లెటూళ్ళలో అలాకాదండి ఎవరికి కష్టమొచ్చినా సుఖమొచ్చినా ఊరంతా పంచుకుంటాది. ఆఖరికి ఊరులో చీమ చిటుక్కుమన్నా కూడా ఊరంతా పోగవ్వుద్ది. ఇక్కడ మనిషికి మనిషే సాయం కానీ మెషీన్లు కాదండి. మాకు ఇలా బంధాలు అనుబంధాలు, అనురాగాలూ ఆప్యాయతలు పెంచుకోవడమే తెలుసు తప్ప లెక్కలు కట్టి బ్యాంకు బ్యాలెన్స్ ఒక్క సంక్రాంతి టైం లోనే జల్సాలకీ, పందేలకీ ఖర్చెట్టేత్తాం కదండే బాబా..! smile emoticon
అసలు పెపంచకం మొత్తానికి గోదారి జిల్లాలంత అందమైన జిల్లాలు ఓల్ ఇండియాలోనే కాదు ఇంగ్లాండులో కూడా లేవని మా ఊరి "సోషల్ మేట్టారు" అనీవోడండి. అందుకేకదండి మరి సినిమావోళ్ళు కూడా షూటింగులంటే గోదారి జిల్లాలకి పరిగెడతారు. మా గోదారి జిల్లాల్లో మమకారాలతో పాటు ఎటకారాలూ, సరదాలతో పాటు సరసాలూ కూడా బెమ్మాండంగా ఉంటాయండి. మాకు అనురాగాలూ ఆప్యాయతలే కాదు పంతాలూ పౌరుషాలు కూడా ఎక్కువేనండి, పరువుకోసం పేనాలైనా ఇచ్చేత్తారు తప్ప ఒకడి ముందు తలవంచరండి.
ఇంక మర్యాదల విషయానికొత్తే సెప్పేదేముంది దానికి మాకు మేమే సాటి. సిటీల్లో చుట్టం వత్తే టీ ఇవ్వడానికి కూడా ఏడిసేవాళ్ళున్న ఈ పెపంచకంలో.. మేం చుట్టం వత్తే పంచభక్ష్య పరమన్నాలతో, కడుపు నిండా తిండి పెట్టి సంతోషంగా పంపిత్తామండి , ఆయ్.. ఎవరైనా కొట్టి సంపేత్తారు "మేము పెట్టి సంపేత్తాం" కదండి మరి. ...
ఏండే అని అంటున్నామంటే ఎదటోడికి గౌరవం ఇవాలనే కానీ మాకు 'ఏరా' అని పిలవడం రాక కాదు. నోరు ఇప్పితే అమ్మనాబూతులు మాటాడగలం. కానీ పెద్దలు నేర్పిన సంస్కారం అడ్డొచ్చి ఆ పని చెయ్యం.
చివరిగా ఒక్కమాట.... పండగలకే కాదు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు మా ఊళ్ళకి రండి , ఉండాలనుకున్నన్ని రోజులు ఉండండి. సిగ్గు పడకుండా కావాల్సింది అడిగి తినండి, మర్యాద నిలబెట్టుకుని ఎల్లండి. అంతేకాని ఇక్కడికొచ్చి మా గోదావరి జిల్లాలను కానీ, ప్రజలను కానీ, పద్దతుల్ని కానీ, భాషని కానీ హేళన సెయ్యలని సూడకండి. మేం మీకంటే ముదర్లం. మీగురించి మీజీవితాల గురించీ మేం మాటాడటం మొదలెడితే మీరు జన్మజన్మలకీ మర్చిపోలేరు.
Courtesy: Venu Gopal Raju garu and Vydehi Murthy of Facebook.
3 కామెంట్‌లు:
Good one sir. Photo and the post are representing the beauty and spirit of Godavari districts village life. Thank you.
Good one sir. Photo and the post are representing the beauty and spirit of Godavari districts village life. Thank you.
మన జిల్లాల గురించి మబాగా సెప్పారండి ...మీరు సూపరండి బాబూ... సింపేసారండి ... ఆయ్ ... మీకు మీ పేమిలీకి సంక్రాంతి శుభాకాంచలండి... ఇంక ఉంటానండి
కామెంట్‌ను పోస్ట్ చేయండి