23, జనవరి 2016, శనివారం

జాజి మల్లె బ్రతుకు జాలి గొలుపు నాకు



శ్రీమతి శశికళ ఓలేటి గారి ఆటవెలది  పద్యాలు చదివిన తర్వాత నాకు గుర్తుకొచ్చిన నా బొమ్మలు. ఎంత చక్కని పద్యాలో! ఎంత చక్కటి భావుకత!! 

ఆటవెలది పద్యాలు 

1.జాజి మల్లె బ్రతుకు జాలి గొలుపు నాకు

నోచుకొన వెపుడును నోము ఫలము
సందె పొద్దు వేళ శృంగారమౌ కాని
పగటి విరులు తప్ప, ప్రభువు కరుదు.
2. ఆడ పిల్ల నెప్పుడా జాజితో బోల్చి,
పంది రదియె వేయ , బలిమి కూడు.
జాణ యైన తాను, జాడించి బ్రతుకును
బేల యయిన, జాజి పూల తీరె.
3. మిగుల సంతసమున మేలుహారము జేరి
మురిసి పోవుచు నవి సరసి జేరు
భాగ్యవశమున నవి భగవంతు చేరినన్
చరిత మగును బ్రతుకు సఫలమగును.

4. సన్నజాజి చూడ చక్కనమ్మను బ్రోలు
రాతిరందు తరలు, రమణి సిగకె
సున్నితంపు సొగసు చూడ మరులు గొల్పు,
కొన్ని ఘడియ లున్న కూర్చు తావి.

5. విరిసి విరయ కుండ విరజాజి పూవులు,
విరిసినంత వరకు విడచి తావి
నేల రాలిపోయి నింగితారల పోలి,
ఫక్కుమనుచు నవ్వు పడతి వోలె.

6.
విశ్వమందు విరులు వేన వేలున్నను, 
సన్నజాజి కెపుడు సాటి రావు,
జాజి పూవు నిలుచు సౌందర్య , సుకుమార
కుసుమశరుని ప్రీతి కోమలి వలె!

7.
,వె
సన్నజాజి కెపుడు , సంతసంబేయగు
విరియ జాజి కెపుడు ,విసుగు రాదు
పరిమళములు నింపు పడతుల సిగలందు 
విడచి పోదు (పోవు) విరహ వేళలందు


కామెంట్‌లు లేవు:

కెరటాలు వేరనీ సాగరం వేరనీ ఆలోచనే తప్పు! - తెలుగు గజల్

 ॥తాజా గజల్॥  నా pencil చిత్రానికి Dr. ఉమాదేవి గారి గజల్ ~~~~🔹🔸🔹~~~~ కెరటాలు వేరనీ సాగరం వేరనీ ఆలోచనే తప్పు! పోరాట మేలేని జీవితం కోసమై అన...